Site icon OkTelugu

Vijay Devarakonda Christmas Gift: విజయ్ దేవరకొండ సూపర్ అబ్బా… ఫ్యాన్స్ కి సర్ప్రైజింగ్ క్రిస్మస్ గిఫ్ట్స్!

Vijay Devarakonda Christmas Gift: విజయ్ దేవరకొండ జయాపజయాలతో సంబంధం లేకుండా భారీ ఫ్యాన్ బేస్ ఏర్పాటు చేసుకున్నారు. ఈ రౌడీ హీరో నటించిన పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీత గోవిందం ఆయనకు చిత్రాలు భారీ ఇమేజ్ తెచ్చిపెట్టాయి. ఎలాంటి సప్పోర్ట్ లేకుండా స్టార్ హీరోగా ఎదిగాడు విజయ్ దేవరకొండ. ఆయన యాటిట్యూడ్, మాట తీరు కొంచెం కటువుగా ఉన్నా మనసు మాత్రం చాలా మెత్తన. విజయ్ రఫ్ బిహేవియర్ ని ఇష్టపడే వాళ్ళు కూడా ఉన్నారు. విజయ్ దేవరకొండకు ఆ తరహా ప్రవర్తన ప్రత్యేకత తీసుకొచ్చింది. ఇక అభిమానుల పట్ల విజయ్ దేవరకొండ తన ప్రేమను చాటుకుంటూ ఉంటారు. వారికి ఊహించని సర్పైజ్ లు ఇస్తారు.

Vijay Devarakonda

క్రిస్మస్ సందర్భంగా విజయ్ దేవరకొండ ఇచ్చిన శాంటా గిఫ్ట్స్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యాయి. ఆయన లక్షలు ఖర్చు చేసి తన ఫ్యాన్స్ కోసం సర్ప్రైజింగ్  బహుమతులు ఏర్పాటు చేశారు. విషయంలోకి వెళితే… ప్రతి ఏటా విజయ్ దేవరకొండ #దేవరశాంటా పేరుతో ఒక కార్యక్రమం నిర్వహిస్తున్నారు. క్రిస్మస్ సందర్భంగా ఆయన అభిమానులకు శాంటా గిఫ్ట్స్ ఇస్తారు. ఈసారి ఆయన సరికొత్త ఆలోచన చేశారు. ఆయన ట్విట్టర్ లో ఒక సందేశం పంచుకున్నారు.

గత ఐదేళ్లుగా నేను దేవరశాంతా సంప్రదాయం కొనసాగిస్తున్నాను. ఈ ఏడాది నాకు ఒక చక్కటి ఆలోచన వచ్చింది. ఇండియాలో నాకు బెస్ట్ ట్రావెలింగ్ డెస్టినేషన్ మీరు నాకు చెప్పండి. అలా చెప్పిన వారిలో వంద మందికి పేయిడ్ ట్రావెలింగ్ ట్రిప్ క్రిస్మస్ బహుమతిగా ఇస్తానంటూ, హామీ ఇచ్చారు. ఇక తన ట్విట్టర్ పోల్ లో విజయ్ దేవరకొండ పర్వతాలు, ఎడారులు, సముద్ర ప్రాంతాలు, సాంస్కృతిక ప్రదేశాలు అనే నాలుగు ఆప్షన్స్ ఇచ్చారు. ఈ పోల్ నందు 30 వేలకు పైగా అభిమానులు పాల్గొన్నారు.

Vijay Devarakonda

మెజారిటీ ఫ్యాన్స్ మౌంటైన్స్ బెస్ట్ ట్రావెలింగ్ ఏరియాగా ఎంచుకున్నారు. ఇక ఈ పోల్ నందు పాల్గొన్న వారిలో లక్కీ 100 ఫ్యాన్స్ విజయ్ దేవరకొండ ఏర్పాటు చేసే తమకు ఇష్టమైన ఇండియన్ టూరిస్ట్ స్పాట్ కి వెళ్లే ఛాన్స్ దక్కించుకున్నారు. వంద మందికి ఫ్రీ ట్రావెలింగ్ గిఫ్ట్ అంటే లక్షల్లో ఖర్చు అవుతుంది. విజయ్ దేవరకొండ ఖర్చుకు వెనుకాడకుండా తన ఫ్యాన్స్ కోసం అంత పెద్ద మొత్తం కేటాయించారు. కాగా విజయ్ దేవరకొండ ప్రస్తుతం సమంతకు జంటగా ఖుషి అనే చిత్రం చేస్తున్నారు. శివ నిర్వాణ దర్శకుడు.

Exit mobile version