MG MOTORS: కారు కొనాలని అనుకునేవారు తమ కారు భిన్నంగా ఉండాలని అనుకుంటారు. మరికొందరు బడ్జెట్ ను దృష్టిలో ఉంచుకొని ఫోర్ వెహికల్ కొంటారు. మొన్నటి వరకు పెట్రోల్ కారుకు ఆ తర్వాత విద్యుత్ కారుకు డిమాండ్ ఉండేది. కానీ ఇప్పుడు పెట్రోల్ తో పాటు బ్యాటరీ ఉండే హైబ్రిడ్ కార్ కోసం ఎదురు చూసేవారు ఉన్నారు. వీరి కోసం కంపెనీలు సైతం హైబ్రిడ్ కారులను మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి. తాజాగా ఢిల్లీ మొబిలిటీ షోలో బ్రిటన్ దిగ్గజం MG MOTORS కొత్త కారును పరిచయం చేసింది. హైబ్రిడ్ -స్పీక్ ZS SUV కారు అయిన ఇది మిగతా వాటి కంటే ప్రధాన ఆకర్షణంగా నిలిచింది. మరి దీని గురించి తెలుసుకోవాలంటే ఈ వివరాల్లోకి వెళ్ళండి..
MG MOTORS కంపెనీ నుంచి సరికొత్త హైబ్రిడ్ కారు వినియోగదారులను ఆకర్షిస్తుంది. దీని ముందు భాగం షేప్ గ్రిల్ తో ఉంటుంది. ఎయిర్ ఇన్ఫ్లెక్ట్ రెండు పక్కల ఎల్ ఆకారంలో అమర్చి ఉన్నాయి. ఎల్ఈడి ప్రొజెక్టు హెడ్ల్యాంపులతో కలిగి ఉన్న ఈ కారుకు రన్నింగ్ లైట్స్ డిఆర్ఎల్ఎస్ తో కలిగి ఉన్నాయి. అప్డేట్ అయిన ఇవి ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. ఈ కారు మొత్తం రీ డిజైన్ చేశారు. బానే పెద్ద సైజులో ఉండి ఫార్వర్డ్ యాంగిల్ లో డ్రైవర్ కు మంచి వ్యూ కనిపిస్తుంది. కొత్త బాడీ క్లాడింగ్ తో అమర్చబడింది. వీటికి తోడు 17 అంగుళాల అలాయ్ వీల్స్, వైర్లెస్ చార్జర్, షాల్డర్ లైన్స్ తో అద్భుతంగా కనిపిస్తుంది.
ఈ మోడల్ ఇన్నర్ విషయానికొస్తే.. సరికొత్త ఫీచర్లు ఆకట్టుకుంటున్నాయి. ఇందులో 12.3 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టం, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ సిస్టం అమర్చారు. సిక్స్ స్పీకర్ ఆడియో సెట్ అప్ 7.0 అంగుళాల డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వైర్లెస్ స్మార్ట్ ఫోన్ చార్జర్ వంటివి ఇందులో ఉన్నాయి. అలాగే ADAS స్టాండర్డ్ ఫీచర్స్ ను అమర్చారు.
ఇంజన్ విషయానికొస్తే ఎంజి జెడ్ ఎస్ హైబ్రిడ్ కారులో 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్ అమర్చారు. దీనికి ఎలక్ట్రానిక్ మోటార్ను అనుసంధానించారు. ఈ బ్యాటరీ 1.83 కిలో వాట్ తో పనిచేస్తుంది. పెట్రోల్ బ్యాటరీ కలిపి 193 బీహెచ్పీ పవర్ను ఉత్పత్తి చేస్తుంది. దీంతో 8.7 సెకండ్లలోని ఈ కారు 100 కిలోమీటర్ల వరకు దూసుకెళ్లే అవకాశం ఉంటుంది. మొత్తంగా లీటర్ ఇంధనానికి ఈ కారు 23.5 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. అయితే కొన్నిసార్లు పవర్ బ్యాటరీ ఉపయోగించడం వల్ల పెట్రోల్ ఆదా చేసుకోవచ్చు. ఎంజి మోటార్స్ అనగానే చాలామంది లైక్ చేసేవారు ఎక్కువే ఉన్నారు ఇలాంటి తరుణంలో ఎస్యువి వేరియెంట్లో కొత్త కారును తీసుకురావడంపై ఆసక్తి నెలకొంది. అయితే ఈ కారు ధర విషయం మాత్రం ఇంకా వెల్లడించలేదు. కానీ ఈ మోడల్ ఆకర్షణీయంగా ఉండడంతో పలువురి దృష్టి దీనిపై పడింది.