Zodiac Signs: ప్రతి ఒక్కరి జీవితంలో గురు భగవానుని అనుగ్రహం చాలా అవసరం. ఒక వ్యక్తి తన జీవితంలో సుఖసంతోషాలతో, ప్రగతితో మెలగాలంటే గురు భగవానుని అనుగ్రహం కావాలి. జాతకం ప్రకారం అనుకూలమైన స్థితిలో గురు భగవానుడు లేకపోతే వాళ్లు సంతోషంగా ఉండలేరు. తమ జీవితంలో వాళ్లు ఎన్నో ఎదురుదెబ్బలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే వచ్చేనెల ఫిబ్రవరి 4 నుంచి గురు భగవానుడు వక్ర ప్రాచీని ప్రారంభించనున్నారు. దీంతో ఇది కొన్ని రాశులకు అదృష్టాన్ని చేకూర్చనుంది. వాళ్లకు కోట్లు సంపాదించే యోగాన్ని కల్పించనుంది. ఆ రాశులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
వృషభం : బృహస్పతి సంచారం వల్ల వృషభ రాశి వారికి మంచి రోజులు రానున్నాయి. ఈ రాశికి చెందినవారు తమ పనిలో రాణించగలరు అని నిపుణులు చెప్తున్నారు. ఇప్పటి వరకు పూర్తి కాకుండా పెండింగ్లో ఉన్న పనులు కూడా పూర్తవుతాయి. అలాగే ఉన్నతాధికారుల నుంచి మద్దతు కూడా పొందుతారు. తాము చేసిన పనికి ప్రశంసలు కూడా పొందుతారు. తమ అనుకున్న చిరకాల కోరికలు కూడా నెరవేరే అవకాశం ఉంది. ఇప్పటివరకు మీకున్న ప్రధాన సమస్యలను పరిష్కరించుకోవడానికి స్నేహితులు, బంధువులు, కుటుంబ సభ్యుల నుంచి మద్దతు పొందుతారు. పోటీ పరీక్షలకు రెడీ అయ్యేవారు గొప్ప విజయాలు సాధిస్తారు. కుటుంబంలో శాంతి నెలకొంటుంది.
మిధున రాశి : ఈ రాశి వారికి గురు చక్ర సంచారం ఆకస్మిక ధనాన్ని ఆర్జించే అవకాశాన్ని కల్పిస్తుంది. ఈ రాశిలో జన్మించిన వారికి ఫిబ్రవరి నుంచి అదృష్టం వెంటాడుతూనే ఉంటుంది. వీళ్ళు అనుకున్నది సాధిస్తారు. ఈ సమయంలో వీళ్లు వ్యాపారం ప్రారంభించినట్లయితే గొప్ప లాభాలు పొందుతారు. ఇప్పటికే వ్యాపారం చేస్తున్న వారైతే కొత్త కాంట్రాక్టుల ద్వారా భారీ లాభాలు పొందే అవకాశం ఉంది. ఉద్యోగం చేస్తున్నవారు డబ్బు సంపాదించుకోవడానికి తగిన మార్గాలను ఎంచుకోవాలి. డబ్బు పొదుపు చేసుకోవడానికి కావలసిన అవకాశాలు దొరుకుతాయి. గురు వక్ర సంచారం వలన ఈ రాశుల వారికి తక్కువ సమయంలో ఎక్కువ లాభాలను పొందే అవకాశం ఉంది.
కుంభరాశి : గురు వక్ర సంచారం వలన ఈ రాశి వారికి కూడా అనేక లాభాలు జరుగుతాయి. ఈ రాశి వారు ఈ సమయంలో ఏ రంగంలోకి అడుగుపెట్టినా కూడా గొప్ప విజయాలు సాధిస్తారు. కార్యాలయంలో ఈ రాశుల వారు ఆధిపత్యం చెలాయిస్తారు. ప్రమోషన్ పొందే అవకాశం కూడా ఉంది. ఈ రాశుల వారు పెద్ద పెద్ద బాధ్యతలు కూడా చేపడుతారు. కొత్త వ్యాపారం ప్రారంభించాలి అనుకున్న వాళ్లకు ఇదే సరైన సమయం. వారికి అన్ని విధాలుగా మంచి జరుగుతుంది.