https://oktelugu.com/

Maruti Alto: మార్కెట్లోకి మళ్లీ రాబోతున్న మారుతి ఆల్టో.. ధర ఎలా ఉండనుందంటే?

దేశంలోని ఆటోమోబైల్ కంపెనీల్లో మారుతి సుజుకి ముందంజలో ఉంటుంది. ఈ కంపెనీ నుంచి ఇప్పటి వరకు వివిధ కార్లు మార్కెట్లోకి వచ్చి వినియోగదారులను అకట్టుకున్నాయి. మారుతి నుంచి రిలీజ్ అయిన కొన్ని కార్లు ఎవర్ గ్రీన్ గా నిలిచాయి.

Written By:
  • Srinivas
  • , Updated On : November 25, 2024 / 01:02 PM IST

    Maruthi-Aulto

    Follow us on

    Maruti Alto: దేశంలోని ఆటోమోబైల్ కంపెనీల్లో మారుతి సుజుకి ముందంజలో ఉంటుంది. ఈ కంపెనీ నుంచి ఇప్పటి వరకు వివిధ కార్లు మార్కెట్లోకి వచ్చి వినియోగదారులను అకట్టుకున్నాయి. మారుతి నుంచి రిలీజ్ అయిన కొన్ని కార్లు ఎవర్ గ్రీన్ గా నిలిచాయి. వీటిలో వ్యాగన్ ఆర్, స్విప్ట్ తదితర కార్లు ఉన్నాయి. అయితే సామాన్యులకు అందుబాటులో, బడ్జెట్ లో కొన్ని కార్లను కంపెనీ రిలీజ్ చేసింది. వీటిలో Alto ఒకటి. కొత్తగా కారు కొనాలని అనుకునే మిడిల్ క్లాస్ పీపుల్స్ మారుతి ఆల్టో వైపు చూసే వారు. కానీ ఆ తరువాత పలు కార్లు అందుబాటులోకి రావడంతో దీనిని పట్టించుకోలేదు. అయితే ఇప్పుడు ఇదే ఆల్టో కారు ఇప్పుడు కొత్త వెర్షన్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతుంది. ఇందులో కొన్ని ఫీచర్లతో పాటు ఇంజిన్ పనితీరును మెరుగుపరిచి మార్కెట్లోకి రిలీజ్ చేయనున్నారు. ఆ వివరాల్లోకి వెళితే..

    మారుతి కంపెనీ నుంచి రిలీజ్ అయిన మొదటి తరం కారు ఆల్టో. ఇది 2000 సంవత్సరంలో మార్కెట్లోకి వచ్చింది. కానీ 2006 నుంచి దీనిని అత్యధికంగా కొనుగోలు చేయడం ప్రారంభించారు. మారుతి 800 తరువాత అత్యధికంగా విక్రయాలు జరుపుకున్న మోడల్ అల్టోనే. భారతదేశంలో మిలియన్ మార్క్ దాటిన కార్లలో ఇది కూడా ఉంది. దీనిని రూ. 3.99 లక్షల ప్రారంభ ధర నుంచి విక్రయాలు జరిపారు. టాప్ ఎండి రూ.5.96 లక్షల వరకు విక్రయించవచ్చు. మారుతి ఆల్టో కే 10 తొమ్మిది వేరియంట్లలో అందుబాటులో ఉంది.

    మారుతి ఆల్టోలో పెట్రోల్ తో పాటు సీఎన్ జీ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. పెట్రోల్ వేరియంట్ లో 22 నుంచి 31.59 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. సీఎన్ జీ వెర్షన్ లో 36 కిలో మీటర్ల మైలేజ్ ఇష్తుంది. ఇందులో పెద్ద ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, 4 స్పీకర్లు, డిజిటల్ డ్రైవర్ డిస్ ప్లే, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్ వంటివి ఉన్నాయి. సేప్టీలోనూ ఈ కారు ఏమాత్రం తగ్గేదేలే అన్నట్లుగా ఉంది. ఇందులో ఎయిర్ బ్యాగ్స్ తో పాటు చైల్డ్ లాక్, స్పీడ్ ఫెన్సింగ్ తో పాటు సెన్సార్ పార్కింగ్ ఉన్నాయి.

    అయితే మారుతి ఆల్టో 800 కొత్త వెర్షన్ వచ్చే డిసెంబర్ లో లాంచ్ కానుందని తెలుస్తోంది. దీని ధర రూ.3.54 లక్షల ప్రారంభం నుంచి రూ.4.95 లక్షల వరకు ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇది 24 నుంచి 31 కిలోమీటర్ల మైలేజ్ ఇవ్వనుంది. ఇక 10వ తరం మారుతి ఆల్టో 2026లో8 మార్కెట్లోకి రానుంది. దీని పెట్రోల్ వెర్షన్ 25.2 కిలోమీటర్ల మైలేజ్ ఇవ్వనుంది. అలాగే ఇప్పుడున్న మారుతి ఆల్టో కంటే 100 కిలోల బరువు ఎక్కువగా ఉండనుంది.

    కొత్తగా కొరు కొనాలనుకునే సామన్యులు మారుతి ఆల్టో కొత్త కారును తీసుకురావంతో సేల్స్ పెరుగుతాయని భావిస్తోంది. సామాన్యులకు అందుబాటు ధరలో ఉన్న ఈ కారు మైలేజ్ తో పాటు చిన్న ఫ్యామిలీకి అనుగుణంగా ఉంటుంది. అయితే లేటేస్ట్ టెక్నాలజీ ఫీచర్లతో రానుండడంతో దీని కొనుగోలుకు ఎక్కువగా ఆసక్తి చూపే అవకాశం ఉందని భావిస్తున్నారు.