chicken : చాలా మంది చికెన్ ను లైక్ చేస్తారు. మరి చికెన్ ను ఇష్టపడని వారు ఎవరు ఉంటారు కదా. నాన్ వెజ్ ప్రియులకు చికెన్ ఫేవరేట్ కూడా. ఈ చికెన్ లో ఎన్నో వెరైటీలను కూడా చేస్తుంటారు. తింటారు. కానీ మీరంతా ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే మీరు డేంజర్ లో పడతారు. ఓ పెద్ద ప్రమాదం ముంచుకొని వస్తుంది. ఎందుకంటే బాయిలర్ కోళ్లలో భయంకరమైన బ్యాక్టీరియా ఉంటుంది. ఈ విషయాన్ని రీసెంట్ గా గుర్తించారు శాస్త్రవేత్తలు. తెలంగాణ, కేరళలో అమ్మే బాయిలర్ కోళ్లలో యాంటీ బయాటిక్ ను తట్టుకునే బ్యాక్టీరియా పెరుగుతుంది. దీంతో చికెన్ తినవద్దని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూట్రీషియన్ (ఎన్ఐఎన్) సైంటిస్టులు హెచ్చరించారు. తినేవారు కచ్చితంగా జాగ్రత్త పాటించాలి అంటున్నారు నిపుణులు.
అయితే కొందరు పౌల్ట్రీ ఫామ్స్ వాళ్లు అవసరం ఉన్నా లేకపోయినా సరే కోళ్లకు యాంటీబయాటిక్ ఇంజెక్షన్లు ఇవ్వడం వల్ల తినే వారికి సమస్యలు వస్తున్నాయి. ఎందుకంటే ఈ ఇంజెక్షన్ ల వల్ల కోళ్లలో యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ పెరుగుతుందట. ఇలాంటి కోళ్ల మాంసం తింటే ప్రమాదం సంభవిస్తుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. అందుకే మాంసాన్ని బాగా ఉడికించాలి అంటున్నారు. కాస్త ఉడికిన తర్వాత తినడం మంచిది కాదని ఎక్కువగా ఉడికించాలి అంటున్నారు. ఎక్కువ ఉడికినా సరే జాగ్రత్త అవసరమని చెబుతున్నారు. ఎన్ఐఎన్ శాస్త్రవేత్తలు కేరళను సౌత్ జోన్ గా, తెలంగాణను సెంట్రల్ జోన్ గా విభజించి మరీ ఈ అధ్యయనం చేశారట.
తెలంగాణ, కేరళ రాష్ట్రాల్లోని 47 పౌల్ట్రీ ఫామ్ లో 131 శాంపిళ్ల(కోడి రెట్టల)ను సేకరించారు. వాటి నుంచి డీఎన్ఏను వేరు చేసి పరిశోధన చేశారు నిపుణులు. పరిశోధనలో కోళ్లలో భయంకరమైన బ్యాక్టీరియా వృద్ధి చెందుతుందని తేలిందట. కోళ్ల రెట్టలో విరేచనాలకు కారణమయ్యే ఈకోలి, చర్మ వ్యాధులకు కారణమయ్యే స్టెఫిలోకాకస్ ఆరియస్తో అనే బ్యాక్టీరియా వృద్ధి చెందుతుందట. అంతేకాదు క్లాస్ట్రిడియం పెర్‌ఫ్రింజెన్స్, క్లేబ్సియెల్లా ఎంటరోకోకస్ ఫెకాలిస్, సూడోమోనాస్ ఎరుగినోసా, బాక్టీరియోడ్స్ ఫ్రాజిల్స్ వంటి హానికరమైన బ్యాక్టీరియా కు సంబంధించిన ఆనవాళ్లు కూడా కనిపించాయి అంటున్నారు నిపుణులు.
ఈ బ్యాక్టీరియా మానవుల శరీరంలోకి ప్రవేశిస్తే వ్యాధులు రావడం పక్కా అని హెచ్చరిస్తున్నారు. ఈ బ్యాక్టీరియాలన్నీ యాంటీ బయాటిక్ ట్రీట్ మెంట్ కు సవాల్ విసురుతాయని తేల్చి చెప్పారు. అందుకే ఇలాంటి చికెన్ ను అధిక ఉష్ణోగ్రతలో ఉడికించాలి. ఇలా చేయడం వల్ల వీటిలో 95 శాతం బ్యాక్టీరియా నాశనం అవుతుందని తెలిపారు. తెలంగాణతో పోలిస్తే కేరళలో ఈ సమస్య మరింత ఎక్కువ ఉందట. ఎందుకంటే యాంటీ మైక్రోబయల్ రెసిస్టెన్స్(ఏఎంఆర్) జన్యువు తీవ్రత కేరళలో ఎక్కువగా ఉందట. అందుకే కోళ్లు తినడం మంచిది కాదని అంటున్నారు. ఎన్ని చెప్పినా సరే చికెన్ తినకుండా ఉండలేకపోతున్నాం అంటున్నారు. అయితే ఎక్కువ ఉడకబెట్టి తినండి.