Save Numbers: సమాజంలో కొన్ని ఎమర్జెన్సీ విషయాలు ఎదురవుతూ ఉంటాయి. అలాగే కొన్ని మోసాలు జరుగుతూ ఉంటాయి. చాలా మంది వీటిని చూస్తూ ఉండిపోతారు. అందుకు పరిష్కారం కనుక్కొనరు. ఇంకొందరు సమస్య పరిష్కారం చేయాలని అనుకున్నా.. ఎవరికి? ఎలా? చేయాలో అర్థం కాదు. దీంతో అత్యవసర సమయాల్లో అందాల్సిన సేవలు అందకుండా పోతున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో.. మోసాలు జరిగినప్పుడు సరైన న్యాయం చేసే విధంగా ప్రభుత్వాలు అన్ని ఏర్పాట్లు చేస్తుంటాయి. కానీ వాటిని ఉపయోగించుకోవడంలో అవగాహ లేకుండా ఉంటారు. టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తరువాత ప్రతీ సమస్యను ఫోన్ ద్వారా పరిష్కరించుకుంటారు. అలాగే ఎమర్జెన్జీ, చీటింగ్ జరిగినప్పుడు ఫిర్యాదులు ఇవ్వడానికి కొన్ని ప్రత్యేక నెంబర్లు కేటాయించారు. ఆ నెంబర్ల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవచ్చు. ఆ నెంబర్ల వివరాల్లోకి వెళితే..
1073:
రోడ్డు మీద వెళ్లినప్పడు ఎన్నో ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. అయితే ప్రమాదంలో చిక్కుకున్న వారిని కాపాడాలని చాలా మందికి ఉంటుంది. కానీ ముందుకు రాలేరు. ఈ తరుణంలో 1073 నెంబర్ కు డయల్ చేయొచ్చు. ఈ నెంబర్ కు డయల్ చేయడం ద్వారా అంబులెన్స్, క్రేన్, పోలీసులకు ఒకేసారి సమాచారం వెళ్తుంది. దీంతో అత్యవసర సమయంలో ఇవి అందుబాటులోకి వచ్చి సేవలు అందిస్తాయి. అందువల్ల ప్రమాదం జరిగిన వారు, పక్కనున్న వారు ఈ నెంబర్ కు డయల్ చేసి ప్రాణాలను కాపాడవచ్చు.
1930:
సాంకేతికం పెరుగుతున్న కొద్దీ సైబర్ నేరాలువిపరీతంగా పెరుగుతున్నాయి. అయితే ఇలాంటి విషయంలో చాలా మందికి ఎలా ఫిర్యాదు ఇవ్వాలో తెలియదు. అందువల్ల పోలీస్ వ్యవస్థ ఈ నెంబర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎవరైనా ఆన్ లైన్ లో డబ్బులు మోసం చేయడం గానీ.. సోషల్ మీడియాలో బెదిరించినా.. ఆన్ లైన్ స్కాం జరిగినా వెంటనే ఈనెంబర్ కు డయలు చేసి ఫిర్యాదు చేయొచ్చు.
1064 (తెలంగాణ) 14400 (ఆంధ్రప్రదేశ్):
ఈ నెంబర్లు యాంటీ కరప్షన్ బ్యూరో వాళ్లవి. ఎవరైనా లంచం అడిగితే వెంటనే ఈ నెంబర్లకు ఫోన్ చేయొచ్చు. అధికారులు, ప్రజాప్రతినిధులు ఎవరైనా సరే లంచం అడిగినా.. అందుకు ప్రేరేపించినా.. ఈ నెంబర్లకు కాల్ చేసి ఫిర్యాదు చేయొచ్చు. ఫిర్యాదు ఆధారంగా ఏసీబీ వాళ్లు లంచం అడిగిన వ్యక్తిని పట్టుకుంటారు.
1915:
చాలా మంది వస్తువులను ఈ రోజుల్లో షాపింగ్ మాల్స్ లో కొనుగోలు చేస్తున్నారు. టెక్నికల్ గా కొన్ని సంస్థలు మోసాలు చేస్తుంటాయి. మోసం జరిగిందని తెలిస్తే వెంటనే ఈ నెంబర్ కు కాల్ చేయొచ్చు. కన్జూమర్ ప్రొటెక్షన్ ఆధారంగా దీనిని కేటాయించారు.