Lord Shani
Lord Shani : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు మారడం వల్ల వాటి ప్రభావం రాశులపై పడుతుంది. ప్రతి గ్రహం కొన్నాళ్లపాటు ఒక రాశిలో ఉండి మరో రాశిలోకి మారుతూ ఉంటుంది. ఇలా గ్రహాలు మొత్తం 12 రాశులు మారుతూ ఉంటాయి. అయితే వీటిలో శని గ్రహం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. సాధారణంగా శని తమ జీవితంలో ఉంటే భయపడిపోతూ ఉంటారు. ఎందుకంటే ఒక్కసారి శనిపీడ పట్టిందంటే ఏడేళ్ల వరకు ఉంటుందని కొందరు నమ్ముతారు. అందువల్ల శని పీడను వదిలించుకునేందుకు రకరకాల పూజలు చేస్తారు. కానీ శని దేవుడి అనుగ్రహం వల్ల కొన్ని రాశుల వారికి మహాదశ పడుతుంది. శని గ్రహం సంచారం వల్ల కొన్ని గ్రహాలకు ఎప్పటికీ అనుకూలంగా ఉంటుంది. మీరు శనిదేవునికి కొన్ని పరిహారాలు చేస్తే మరిన్ని ప్రయోజనాలు పొందే అవకాశాలుంటాయి. అయితే శని దేవుడి వల్ల ఏ రాశుల వారికి అద్భుతమైన ప్రయోజనాలు ఉంటాయో తెలుసుకుందాం..
శని ఏ ఏ రాశిలో ప్రయాణించినా కొన్ని రాశుల వారికి అధిక ప్రయోజనాలు ఉంటాయి. అలాంటి వాటిలో మకరం ఒకటి. శని దేవుడి కారణంగా మకర రాశి వారికి ఎప్పటికీ ప్రయోజనాలు కలుగుతూనే ఉంటాయి. ఈ రాశి వారు అనేక రకాల ప్రయోజనాలు పొందుతారు. శని దేవుడి దయవల్ల వీరు ఏ పని చేపట్టిన ఆటంకం లేకుండా పూర్తి చేయగలుగుతారు. అలాగే వారు తాము అనుకున్న పనిని సకాలంలో పూర్తి చేయగలుగుతారు. వీరికి సమాజంలో గౌరవం పెరుగుతుంది. అనుకోకుండా ఆదాయాన్ని పొందుతారు. డబ్బు ఎక్కువ కాలం పాటు ఇంట్లో నిల్వ ఉంటుంది. అనవసరపు ఖర్చులకు అడ్డుకట్ట వేయగలుగుతారు. కొత్తగా వ్యాపారం చేసే వారికి ఎలాంటి ఆటంకాలు ఉండవు.
శని దేవుడు చల్లగా చూసే మరో గ్రహం కుంభం. ఈ రాశి వారి శని దేవుడు ఎప్పుడు అనుకూలంగా వ్యవహరిస్తాడు. ఏ రాశిలో వారు శని దేవుడికి కాస్త పరిహారం చేస్తే ఊహించని దాని కంటే ఎక్కువ ప్రయోజనాలు పొందుతారు. వీరు కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉండగలుగుతారు. ఏ సమస్య వచ్చినా పరిష్కారం చేసుకోగలుగుతారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఉద్యోగులు ఊహించిన దానికంటే ఎక్కువగా ఆదాయాన్ని పొందుతారు. కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణాలు చేస్తారు. స్నేహితులను కలుస్తూ ఉల్లాసంగా ఉంటారు. పిల్లల విషయంలో శుభవార్తలు వింటూ ఉంటారు.
కన్యారాశిపై శని దేవుడి దయ ఎప్పటికీ ఉంటుంది. ఈ రాశి వారు శని దేవుడి అనుగ్రహం వల్ల అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేయగలుగుతారు. వీరు వ్యాపారులైతే వారికి ఎలాంటి అడ్డంకులు ఉండవు. కొందరు వ్యక్తులు వీరిపై ఆధిపత్యాన్ని ప్రయోగించడానికి చేసిన ప్రయత్నాలు విఫలమవుతూ ఉంటాయి. అలాగే వీరు ఎప్పటికీ సంతోషంగా ఉండగలుగుతారు. అయితే ప్రయాణాలు చేసే సమయంలో ఈ రాశి వారు జాగ్రత్తగా ఉండాలి. కానీ శని దేవుడి మరణం వల్ల ఆ సమస్య కూడా ఒక్కోసారి పరిష్కారం గానే ఉంటుంది. అయితే మాటల విషయంలో అదుపులో ఉంచుకోవాలి. కుటుంబంలో ఏ చిన్న వివాదం ఏర్పడిన వెంటనే పరిష్కరించుకోగలగాలి.