Sobhita Dhulipala
Sobhita Dhulipala : తెలుగులో శోభిత(Sobhita Dhulipala) కేవలం రెండు సినిమాల్లో మాత్రమే నటించింది, కానీ తెలుగు రాష్ట్రాల్లో ఆమెకు ఒక స్టార్ హీరోయిన్ కి ఉన్నంత క్రేజ్, పాపులారిటీ వచ్చింది. కారణం ఆమె అక్కినేని నాగచైతన్య(Akkineni Nagarjuna) తో ప్రేమాయణం నడిపి, ఆ తర్వాత పెళ్లి చేసుకోవడమే. తెలుగులో ఆమె హీరోయిన్ గా పెద్ద రేంజ్ కి వెళ్ళలేదు కానీ, హిందీ లో మాత్రం మంచి ట్రెండింగ్ లో ఉన్న యంగ్ హీరోయిన్స్ లో ఒకరు. ఒక్కమాటలో చెప్పాలంటే హిందీ లో ఈమెకు సమంత ని మించిన క్రేజ్ ఉంది. అలాంటి జీవితాన్ని కూడా ఆమె అక్కినేని కుటుంబం కోసం వదిలేసుకొని ఒక సాధారణ గృహిణి లాగా గడుపుతుంది. భవిష్యత్తులో ఈమె సినిమాలు చేస్తుందో లేదో తెలియదు కానీ, ప్రస్తుతానికి అయితే సినిమాల పరంగా యాక్టీవ్ గా లేదు అనేది వాస్తవం. ఇది ఇలా ఉండగా శోభితా ధూళిపాళ్ల సోషల్ మీడియా లో బాగా యాక్టీవ్ గా ఉంటుంది అనే విషయం మన అందరికీ తెలిసిందే.
ఏ హీరో/ హీరోయిన్ అభిమాని అయినా సోషల్ మీడియా లో వాళ్ళ అభిమాన సెలబ్రిటీ యాక్టీవ్ గా ఉండాలనే కోరుకుంటారు. కానీ శోభిత ని మాత్రం సోషల్ మీడియా కి దూరంగా ఉండమని కోరుకుంటున్నారు. ఎందుకంటే ఆమె తన ఇంస్టాగ్రామ్ లో అప్లోడ్ చేసే ప్రతీ పోస్ట్ క్రింద కొంతమంది నెటిజెన్స్ చేసే నెగటివ్ కామెంట్స్ అలా ఉన్నాయి. నాగ చైతన్య, సమంత విడిపోయినప్పటికీ, సమంత తాలూకు జ్ఞాపకాలను పరిచయం చేస్తున్నారు కొంతమంది నెటిజెన్స్. ఆమెతో పోలుస్తూ, ప్రతీ పోస్ట్ క్రింద శోభిత ని తక్కువ చేసి కామెంట్స్ చేస్తున్నారు. నాగ చైతన్య పక్కన నువ్వు అసలు బాగలేదని, సమంత నే అతనికి సరైన జోడి అంటూ అనవసరమైన నెగటివ్ కామెంట్స్ చేస్తున్నారు. కొద్దిరోజుల క్రితమే అక్కినేని కుటుంబం మొత్తం కలిసి పార్లమెంట్ హాల్ లో ప్రధాని నరేంద్ర మోడీ తో భేటీ అయ్యారు.
ఆ సమయంలో తీసుకున్న కొన్ని ఫోటోలను శోభిత దూళిపాళ్ల తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో అప్లోడ్ చేసింది. ఆ ఫోటోల క్రింద ఎక్కువగా ఇలాంటి కామెంట్స్ కనిపించాయి. కేవలం ఈ ఒక్క పోస్ట్ క్రింద మాత్రమే కాదు, శోభిత పోస్ట్ చేసే ప్రతీ ఫోటో క్రింద ఇలాంటి నెగటివ్ కామెంట్స్ కనిపిస్తూనే ఉన్నాయి. ఆ అమ్మాయి చూస్తే ఎంత బాధపడుతుంది అనే సెన్స్ కూడా కొంతమంది ఎందుకు ఉండదు?, తన భర్త ని వేరే అమ్మాయి పక్కన పెట్టి పోల్చి చూస్తే ఏ అమ్మాయికైనా నరకం గా ఉంటుంది, శోభిత ఏమి తప్పు చేసిందని ఈ నరకం అనుభవించాలి. హిందూ సంప్రదాయాలను తూచా తప్పకుండ అనుసరించే తెలుగమ్మాయి, అంతే కాదు అనేక సందర్భాల్లో ఆమె మనసు ఎంత మంచిదో కూడా స్పష్టంగా కళ్ళ ముందు కనిపించింది. అలాంటి అమ్మాయికి ఇలాంటి పరిస్థితులు అవసరమా. మంచో చెడో సమంత(Samantha Ruth Prabhu), నాగ చైతన్య విడిపోయారు. ఎవరి జీవితాన్ని వాళ్ళు చూసుకుంటున్నారు. కానీ కొంతమంది నెటిజెన్స్ మాత్రం ఇంకా వాళ్ళ జీవితాల్లోకి తొంగి చూస్తూ, ఏ సంబంధం లేని అమ్మాయి మనసుని గాయపరుస్తున్నారు. ఇది ముమ్మాటికీ తప్పు, ఎప్పటికి ఆగుతుందో చూడాలి.