Listening Music : రోజూ పాటలు వింటే.. అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు మీ సొంతం?

కొందరు అయితే చదివేటప్పుడు కూడా పాటలు వింటూ చదువుతారు. ఇలా చదివితేనే గుర్తు ఉంటుందని భావిస్తారు. ఎన్ని సమస్యలు ఉన్న ఒక్కసారిగా పాటలు వింటే అన్ని సమస్యలు తీరిపోతాయి. సంగీతం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. మరి అవేంటో తెలియాలంటే ఈ స్టోరీ చదివేయండి.

Written By: Neelambaram, Updated On : September 26, 2024 9:19 pm

Listening Music

Follow us on

Listening Music  : చాలామంది కేవలం వినోదం కోసం మాత్రమే కాకుండా మానసిక ప్రశాంతత కోసం కూడా రోజూ పాటలు వింటారు. మనస్సు బాలేకపోయిన, బాధగా ఉన్న ప్రతీ సందర్భానికి కూడా సంగీతానికి మొదటి ప్రాధాన్యత ఇస్తారు. సంగీతం వినడం వల్ల బోలెడన్నీ ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా ఉదయాన్నే లేచిన వెంటనే పాటలు వింటే మనస్సుకు చాలా ఆహ్లాదకంగా ఉంటుంది. ఏ పని చేసిన చిరాకుగా ఉండదు. చాలా యాక్టివ్‌తో పనిచేస్తారు. కొందరు అయితే చదివేటప్పుడు కూడా పాటలు వింటూ చదువుతారు. ఇలా చదివితేనే గుర్తు ఉంటుందని భావిస్తారు. ఎన్ని సమస్యలు ఉన్న ఒక్కసారిగా పాటలు వింటే అన్ని సమస్యలు తీరిపోతాయి. సంగీతం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. మరి అవేంటో తెలియాలంటే ఈ స్టోరీ చదివేయండి.

ఒత్తిడి నుంచి విముక్తి
పాటలతో రోజును స్టార్ట్ చేస్తే శరీరంలో ఉన్న కార్డినాల్ స్థాయిలు తగ్గుతాయి. వీటిని ఒత్తిడి హార్మోన్లు అంటారు. ఈ హార్మోన్లు సరిగ్గా ఉండాలంటే సంగీతం కాపాడుతుంది. పాటలు వినడం వల్ల ఒత్తిడి నుంచి విముక్తి రావడంతో పాటు కోపం వంటివి కూడా రావు. ఎంత కోపంగా ఉన్న కాస్త కంట్రోల్ చేసుకోగలరు. అంత తొందరగా ఏ విషయానికి కూడా చిరాకు పడుకుండా ఉంటారు.

మెదడు పనితీరు మెరుగుపడటం
మెదడు వ్యాయామానికి సంగీతం బాగా ఉపయోగపడుతుంది. పాటలు వినడం వల్ల ఆ లిరిక్స్ గుర్తుపెట్టకోవడానికి ప్రయత్నిస్తాం. దీనివల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది. ఏ విషయాన్ని అయిన తెలివిగా ఆలోచిస్తారు. డైలీ ఇలా పాటలు వినడం వల్ల మెదడు పనితీరు మెరుగుపడుతుంది.

గుండె ఆరోగ్యం
సంగీతం వినడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. రక్తపోటు అదుపులో ఉండటంతో పాటు నాడీ వ్యవస్థ కూడా ఆరోగ్యంగా ఉంటుంది. పాటలు వినడం వల్ల మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. దీంతో గుండె పోటు వచ్చే ప్రమాదాలు తగ్గుతాయి. కేవలం గుండె ప్రమాదాలు మాత్రమే కాకుండా మానసికంగా సంతోషంగా ఉంటారు.

వర్క్‌వుట్‌లు చేయగలరు
ఎక్కువగా వ్యాయామం చేయలేకపోతే పాటలు వింటూ చేయండి. ఇలా పాటలు వింటూ చేయడం వల్ల మీకు తెలియకుండానే మీరు ఎక్కువగా వ్యాయామాలు చేస్తుంటారు. ఎక్సర్‌సైజ్ చేయడం వల్ల శారీరకంగా ఆరోగ్యంగా ఉంటారు. ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా ప్రశాంతంగా ఉంటారని నిపుణులు చెబుతున్నారు.

డోపమైన్ పెరిగేలా చేస్తుంది
సంగీతం వినడం వల్ల బాడీలో డోపమైన్ హార్మోన్ విడుదల అవుతుంది. దీనిని హ్యాపీ హార్మోన్ అంటారు. పాటలు వినడం వల్ల ఈ హార్మోన్ రిలీజ్ అయ్యి.. సంతోషంగా ఉంటారు. ఎలాంటి ఆందోళన, నిరాశ లేకుండా హ్యాపీగా ఉంటారు. అలా ఉన్నప్పుడే అనారోగ్య సమస్యలు దరిచేరవు. లేకపోతే అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడాల్సి వస్తుందని నిపుణులు అంటున్నారు.

Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.