Toothbrush : ఏ వస్తువులను అయిన కొంత లిమిట్‌లో మాత్రమే వాడాలి. చాలామంది బట్టలు లేదా చెప్పులు దెబ్బతింటే వెంటనే కొత్తవి కొనుక్కుంటారు. కానీ రోజూ చేసే బ్రష్‌ను మాత్రం మార్చరు. శరీరం ఎంత శుభ్రంగా ఉండాలని కోరుకుంటారో.. నోరు కూడా అంతే శుభ్రంగా ఉండాలి. అప్పుడే ఆరోగ్యంగా ఉంటారు. ముఖ్యంగా బ్రష్ చేసే విధానం బట్టే నోరు అనేది ఆరోగ్యంగా ఉంటుంది. చాలా మంది బ్రష్ కొనుక్కోవడానికి బద్దకం అయ్యి.. ఒకటే బ్రష్‌ను ఎక్కువ రోజులు వాడుతుంటారు. ఇలా ఒకే బ్రష్‌ను ఎక్కువ రోజులు వాడటం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి బ్రష్‌లను వాడటం వల్ల దంత సమస్యలు, నోటిలో పుండ్లు, పళ్లు అరిగిపోవడం వంటివి జరుగుతాయి. ఎప్పుడూ ఒకే బ్రష్ కాకుండా అప్పుడప్పుడు బ్రష్ మారుస్తుండాలి. అప్పుడే దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి. మరి టూత్ బ్రష్‌ను ఎన్ని నెలలకు ఒకసారి మార్చాలి? ఎలా వాటిని ఉపయోగించాలో తెలుసుకుందాం.
టూత్‌బ్రష్‌ను ఎన్ని రోజులకు ఒకసారి మార్చాలంటే?
సాధారణంగా టూత్‌బ్రష్‌లను రెండు నుంచి మూడు నెలలకు ఒకసారి మార్చాలి. లేకపోతే తప్పకుండా దంత సమస్యలు వస్తాయి. ఒకే టూత్ బ్రష్‌ను ఎక్కువ రోజులు వాడటం వల్ల అందులో బ్యాక్టీరియా ఉండిపోతుంది. దీనివల్ల దంతక్షయం వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి బ్రష్ పాడైన లేకపోయిన వాటిని మార్చేయాలి. బాగా పాడయిన బ్రష్‌ల వల్ల పళ్లు కూడా అరిగిపోయే ప్రమాదం ఉంది. జ్వరం, ఏదైనా సమస్యలు వచ్చిన తర్వాత వెంటనే టూత్ బ్రష్‌ను మార్చాలి. లేకపోతే ఆ సమస్య ఉన్నప్పుడు ఉన్న బ్యాక్టీరియా అలాగే ఉండిపోతుంది. దంతాల విషయంలో అసలు నిర్లక్ష్యం చేయవద్దు. ఇలా చేయడం వల్ల పళ్లు పాడయితే.. ఎలాంటి ఆహారం తినలేరు. ఏం తిన్నా పళ్లు నొప్పగా ఉంటాయి. హార్డ్‌గా ఉండే బ్రష్‌లను కొనకుండా మృదువుగా ఉండే వాటిని మాత్రమే కొనాలి.
ఎలా మెయింటైన్ చేయాలంటే?
బ్రష్‌లను చాలా శుభ్రంగా ఉపయోగించాలి. వాటిని ఎలా పడితే అలా ఉంచకుండా.. మూతలతో పెట్టాలి. అప్పుడే బ్యాక్టీరియా ఏదీ చేరకుండా ఉంటుంది. బాత్‌రూమ్‌లోని బ్యాక్టీరియాలు బ్రష్‌లకు అంటుకుంటాయి. దీంతో ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. బ్రష్ చేసే ముందు దానిని బాగా శుభ్రం చేయాలి. లేకపోతే బ్యాక్టీరియా బాడీలోపలికి వెళ్తుంది. అలాగే బ్రష్ చేసిన తర్వాత కూడా అవి తడిగా ఉండకూడదు. వాటి తేమ పోయిన తర్వాత వాటికి మూత పెట్టాలి. ఈ చిట్కాలు పాటిస్తే దంతాలకు ఎలాంటి సమస్య రాకుండా ఆరోగ్యంగా ఉంటారు. లేకపోతే దంత సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి బ్రష్‌ను ఎప్పటికప్పుడూ మారుస్తూ.. జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.