Phobias: పిల్లలకు ఈ ఫోబియోలు ఉంటాయి. మీ పిల్లలకు కూడా ఉన్నాయా? మీరు గుర్తించారా?

చిన్నపిల్లలు చాలా విషయాలకు భయపడుతుంటారు. కానీ సరిగ్గా చెప్పలేరు. వీరిని అర్థం చేసుకొని పేరెంట్స్, టీచర్స్ వారి భయాన్ని పొగొట్టే ప్రయత్నం చేయాలి. లేదంటే అవి ఫోబియాలుగా మారే అవకాశం ఉంటుంది. భవిష్యత్తులో మానసిక రోగాలుగా మారే అవకాశం కూడా ఉంది. అయితే పిల్లలు ఎదుర్కొనే కొన్ని ఫోబియాల గురించి తెలుసుకుందాం.

Written By: Swathi Chilukuri, Updated On : September 26, 2024 9:20 pm

Phobias

Follow us on

Phobias: డిడాస్కలీనో ఫోబియాలో పిల్లలు స్కూల్ కు వెళ్లాలి అంటే భయపడుతుంటారు. కానీ సమాజం పట్ల అన్ని విషయాల మీద అవగాహన ఉండాలంటే కాస్త త్వరగానే స్కూల్ కు వెళ్లాలి.ఎన్నో రకాల వ్యక్తులను డీల్ చేయడం పాఠశాల నుంచే ప్రారంభం అవుతుంది. కొన్ని సార్లు ఈ స్కూలే వారికి సమస్యగా మారుతుంది. కొత్త పిల్లలు, కొత్త రకాల మైండ్ సెట్ లు, టీచర్స్, మొదటి సారి అమ్మానాన్నను, కుంటుంబాన్ని వదిలి వెళ్లడం వారికి ఇబ్బందిగా ఉంటుంది. అందుకే వెళ్లను అని మారం చేస్తారు. అందుకే నచ్చజెప్ప ఫ్రెండ్లీగా స్కూల్ లో ఉండేలా చూడాలి.

సోఫో ఫోబియా అంటే చదువులో వెనకబడటం. కొన్ని సబ్జెక్టులు పిల్లలకు నచ్చవు. వాటిని నేర్చుకుందాం అనుకున్నా బుర్రకు ఎక్కవు. సో వారికి ఇబ్బంది అవుతుంది. భయపడతారు. మ్యాథ్స్ అంటే పిల్లలకు భయం అనుకుందాం. ఒక ప్రాబ్లం సాల్స్ చేసే సమయంలోనే మరో సమస్య చేయాల్సి వస్తుంది. ఇలాంటి సమయంలో వారికి ఈ సమస్య మరింత పెద్దగా కనిపించవచ్చు. ఈ సమస్య పోవాలంటే వారికి ఆ సబ్జెక్ట్ మీద ఆసక్తిని పెంచాలి. టీచర్స్ కూడా భయపెట్టేలా కాకుండా సింపుల్ గా చెప్పడం వల్ల ఈ సమస్య నుంచి పిల్లలు బయటపడతారు.

అటెలో ఫోబియా అంటే పిల్లలకు ఇచ్చిన హోమ్ వర్క్ సమయంలో ఫినీష్ చేయకపోతే ఆందోళన చెందుతారు. హోమ్ వర్స్ పూర్తి చేయలేదని, ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవ్వలేదని, ఇలా అనేక విషయాల పట్ల పిల్లలు ఇబ్బంది ఎదుర్కొంటారు. ఈ భయం వల్ల ఇతర విషయాల్లో కూడా తప్పులు చేస్తారు. దీంతో ఈ ఫియర్ మరింత పెరుతుంది. అందుకే కొంత కాలానికి వారు పనులు చేయకుండా ఎస్కేప్ అవ్వాలి అని చూస్తుంటారు. హోమ్ వర్క్ చేయకుండా వివిధ కారణాలు చెబుతూ తిట్లు, దెబ్బలు తింటారు. వారి దగ్గర ఉండి పనులు చేయించడం, తప్పు చేసిన ఓపికగా చెప్పడం వంటివి చేయాలి.

టెస్టో ఫోబియా లో పిల్లలు పరీక్షలకు భయపడతారు. ఎగ్జామ్స్ వస్తున్నాయంటే టెన్షన్ కు గురవుతారు. చెమటలు, జ్వరాలు కూడా వచ్చేస్తాయి. అంత భయపడతారు. ఇది చిన్నతనం నుంచే కొనసాగితే పెద్దయ్యాక వారి పనితీరుపై దెబ్బతింటుంది. జాబ్ చేసే ప్లేస్ లో మంచి పర్ఫామెన్స్ ఇవ్వకపోవచ్చు. తరచూ మేనేజర్, బాస్ చేత తిట్లు తింటారు సో జాగ్రత్త. అందుకే ముందే పరీక్షల మీద భయం పోయేలా చేయండి.

నోమో ఫోబియాలో ఫోన్ లేకుండా చదవలేని పరిస్థితి ఏర్పడింది. ప్రాజెక్ట్స్ అని, ఆన్ లైన్ క్లాస్ లని ఫోన్ లు ఉపయోగిస్తారు. ఇక పిల్లలకు ఫోన్లు లేకపోతే వారు ఇబ్బంది పడతారు. ఇస్తే ఫోన్ కు అలవాటు పడుతున్నారు. ముఖ్యంగా ఈ సమస్య చిన్న పిల్లల నుంచి టీనేజర్స్ వరకు వస్తుంటుంది. పిల్లలేమో ఆటలు, కార్టూన్ లతో గోల చేయాలి. టీనేజర్స్ వాట్సాప్, ఫేస్బుక్, ఇన్ స్టా లో ఉంటున్నారు. ఇలాంటి వారికి ఫోన్ ఉండదని చెబితే కలిగే భయాన్నే నోమో ఫోబియా అంటారు. వీరికి ఫోన్ లేకపోతే ప్రపంచం స్థంబించిపోయిన ఫీలింగ్ వస్తుంది. అంతేకాదు మానసిక సమస్యలు కూడా వస్తున్నాయి. సో జాగ్రత్త.

Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.