Seven Seater Bike: “మన దగ్గర ఎంతో మేథో సంపత్తి ఉంది. అంతకుమించి యువ రక్తం ఉంది. ఇలాంటి అప్పుడు దిగుమతుల మీద ఎందుకు ఆధారపడాలి? మనకు కావాల్సిన వాటిని, అవసరమైన వాటిని తయారు చేసుకోలేమా? అందుకే మనం మన సొంత కాళ్ళ మీద నిలబడాలి” మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం ప్రారంభోత్సవ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్న మాటలివి. ఆ మాటలు స్ఫూర్తిగా తీసుకున్నాడో, లేక మరి ఏమిటో తెలియదు కానీ ఓ యువకుడు ఏకంగా సెవెన్ సీటర్ బైక్ తయారు చేశాడు. పైగా దానిని సోలార్ ఆధారంగా నడిచేలా రూపకల్పన చేశాడు.. దాని కథా కమామీసు ఏమిటో మీరూ చదివేయండి.
అవసరమే నేర్పించింది
ఈ సువిషాల భూమి మీద కనిపెట్టిన ఆవిష్కరణలు మొత్తం మనుషుల అవసరాల ఆధారంగానే జరిగాయి. అవసరం అనేది మనుషులను ఆ దిశగా నడిపించింది కాబట్టే అధునాతనమైన సాంకేతికత అందుబాటులోకి వచ్చింది. అయితే ఈ సాంకేతికతను కనిపెట్టినవారిలో చదువుకున్న మేధావులు ఉన్నారు, అక్షర జ్ఞానం లేని వారు కూడా ఉన్నారు.. అయితే ఇప్పటి సాంకేతిక ప్రపంచంలో అక్షర జ్ఞానం అంతంత మాత్రం ఉన్న ఓ యువకుడు అసలైన “మేకిన్ ఇండియా”కు సిసలైన అర్థం చెప్పాడు. తన అవసరాలు తీర్చుకునేందుకు అత్యంత చౌకగా సోలార్ బైక్ రూపొందించాడు. మార్కెట్లో దొరికే వివిధ రకాలైన వస్తువులను ఉపయోగించి ఏకంగా సెవెన్ సీటర్ బైక్ తయారు చేశాడు. ఈ ఆవిష్కరణ పై మీడియా అతడిని ప్రశ్నించగా “ఇది సెవెన్ సీటర్ బైక్. ఏడుగురు సులభంగా ప్రయాణం చేయవచ్చు. పైగా ఇది సౌర శక్తితో పనిచేస్తుంది. దీనిపై 200 కిలోమీటర్ల ప్రయాణం చేయవచ్చు. దీని తయారు చేసేందుకు ఎనిమిది నుంచి పదివేల దాకా ఖర్చయింది. మీరు చూశారు కదా! ఇదే సోలార్ బైక్” అంటూ అతడు బదిలిచ్చాడు.
ఇప్పటికాలానికి చాలా అవసరం
ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్నభారత్ లో వాహనాల వినియోగం అంతకంతకు పెరుగుతుంది. గడిచిన దశాబ్దంలో వ్యక్తిగత వాహనాల కొనుగోలు తారస్థాయికి చేరింది. ఇటీవల కేంద్ర కణాంకాల శాఖ నిర్వహించిన ఒక సర్వే ప్రకారం దేశంలో సుమారు 70% మందికి వ్యక్తిగత వాహనాలు ఉన్నాయని తేలింది. ఈ వాహనాలు ఇంధనంతో నడుస్తాయి కాబట్టి వాతావరణంలో కాలుష్యం స్థాయి ఎక్కువగా ఉంటుంది. ఇలాంటప్పుడు వీటికి ప్రత్యామ్నాయం చాలా అవసరం. అందుకే ఇలాంటి సోలార్ బైకుల తయారీని ప్రభుత్వం విరివిగా ప్రోత్సహించాలి.. ఎలక్ట్రిక్ వెహికల్స్ వినియోగం పెరుగుతున్నప్పటికీ, దానిని ఎప్పటికప్పుడు చార్జింగ్ చేయాల్సి ఉంటుంది..కానీ ఈ సోలార్ బైకులకు ఆ అవసరం ఉండదు.. పైగా మేకింగ్ ఇండియా ద్వారా ఇలాంటి ఆవిష్కర్తలకు ప్రోత్సాహం అందిస్తే మెరుగైన ఫలితాలు అందుతాయి. వాహనాలకు బ్రాండ్ పేరు పెట్టి భారీ ధర నిర్ణయించి ప్రజలకు విక్రయించే కంటే.. చౌకగా ప్రజల అవసరాలు తీర్చే వినూత్న ఆవిష్కరణలను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అప్పుడే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతిపాదించిన మేకింగ్ ఇండియాకు అసలైన అర్థం, పరమార్ధం లభిస్తుంది.
View this post on Instagram