https://oktelugu.com/

karthika Deepam: కార్తీక్ బాబును డాక్టర్ బాబుగా మార్చనున్న వంటలక్క.. పిల్లలపై ప్రేమ పెంచుకుంటున్న రుద్రాణి!

karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ ఎపిసోడ్ లో ఈ రోజు ఏం జరిగిందంటే.. దీప ఇంటి బాధ్యతలు మొత్తం తీసుకోవటంతో కార్తీక్ బాధపడతాడు. చాలా కష్టపడుతున్నావ్ అని దీపను అంటాడు. ఇక దీప మీరు పక్కనుంటే ఏ కష్టం రాదు అని చెబుతుంది. కార్తీక్ ఒంటరిగా రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తూ తన గతాన్ని తలచుకుంటూ ఉంటాడు. మరోవైపు పిల్లలు స్కూల్ అయిపోవటంతో తిరిగి రోడ్డుపై నడుచుకుంటూ వస్తారు. ఇక స్కూల్ గురించి మాట్లాడుతూ ఉండగా […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : December 25, 2021 / 10:34 AM IST
    Follow us on

    karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ ఎపిసోడ్ లో ఈ రోజు ఏం జరిగిందంటే.. దీప ఇంటి బాధ్యతలు మొత్తం తీసుకోవటంతో కార్తీక్ బాధపడతాడు. చాలా కష్టపడుతున్నావ్ అని దీపను అంటాడు. ఇక దీప మీరు పక్కనుంటే ఏ కష్టం రాదు అని చెబుతుంది. కార్తీక్ ఒంటరిగా రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తూ తన గతాన్ని తలచుకుంటూ ఉంటాడు. మరోవైపు పిల్లలు స్కూల్ అయిపోవటంతో తిరిగి రోడ్డుపై నడుచుకుంటూ వస్తారు.

    ఇక స్కూల్ గురించి మాట్లాడుతూ ఉండగా హిమ రోడ్డు పక్కన వాంతింగ్ చేసుకోవడంతో అప్పుడే కార్తీక్ వచ్చి తల పట్టుకుంటాడు. ఏం జరిగింది అని సౌర్య అడగటంతో పర్వాలేదు అని కార్తీక్ అంటాడు. ఇక రుద్రాణి వారికి ఎదురు పడటంతో కాసేపు వారితో మాటల యుద్ధం చేస్తుంది. శ్రీవల్లి బాబుకు జ్వరం రావడంతో కార్తీక్ ఏం కాదని ధైర్యం చెబుతాడు.
    ఇక బాబుకి పేరు పెట్టాలని ఆనంద్ అని పెడుతున్నామని అనడంతో దీప షాక్ అవుతుంది.

    సౌందర్య గతంలో పిల్లలతో గడిపిన క్షణాలు తలచుకొని కుమిలిపోతుంది. ఇక ఆనందరావుతో కార్తీక్ వాళ్ల గురించి మాట్లాడుతూ చాలా బాధపడుతుంది. మోనిత ప్లాన్స్ గురించి తెలుసుకోవడానికి రత్న సీతను పెట్టాను అని తెలుపుతుంది. ఇక సౌర్య తన తల్లిదండ్రులతో కాసేపు సరదాగా ఆడుకుందామని అనడంతో కార్తీక్ నవ్వుతాడు. అలా కాసేపు సరదాగా మాట్లాడుతుండగా ఇంట్లోకి రుద్రాణి వస్తుంది. ఇక పిల్లలు ఆమెను చూసి భయపడతారు.

    దీప కూడా పిల్లల్ని దగ్గరికి తీసుకుంటుంది. రుద్రాణి పిల్లల మీద ప్రేమతో వారికీ స్వీట్ లను, విటమిన్ టాబ్లెట్లను తీసుకొస్తుంది. కానీ దీప అవి వద్దని మర్యాదగా చెబుతుంది. ఇక దీప వంటగదిలో వంట చేస్తుండగా కార్తీక్ వచ్చి ఏదైనా పనిచేయాలని అనుకుంటాడు. ఇక దీప అక్కడే ఒక చిన్న వైద్యశాల పెట్టమని సలహా ఇస్తుంది. దీన్ని బట్టి చూస్తే దీప మళ్ళీ కార్తీక్ ను డాక్టర్ బాబు గా మారుస్తుందేమో అన్నట్లుగా అనిపిస్తుంది.