Zero Rupee Note:  జీరో రూపీ నోటు గురించి తెలుసా.. ఈ నోటు వల్ల ఉపయోగాలు ఇవే?

Zero Rupee Note: మన దేశంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూపాయి నుంచి 2,000 రూపాయల నోట్ల వరకు ముద్రిస్తుందనే సంగతి తెలిసిందే. అయితే మన దేశంలో జీరో రూపీ నోటు కూడా ఉంది. జాతిపిత మహాత్మాగాంధీ ఫోటో ముద్రించబడి ఉండే ఈ నోటు గురించి ఎక్కువ మందికి తెలియదు. పాత 50 రూపాయల నోటును పోలి ఉండే జీరో రూపీ నోటు సాధారణ నోటుతో పోలిస్తే పెద్దదిగా ఉంటుంది. అయితే ఈ జీరో రూపీ […]

Written By: Kusuma Aggunna, Updated On : December 29, 2021 11:47 am
Follow us on

Zero Rupee Note: మన దేశంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూపాయి నుంచి 2,000 రూపాయల నోట్ల వరకు ముద్రిస్తుందనే సంగతి తెలిసిందే. అయితే మన దేశంలో జీరో రూపీ నోటు కూడా ఉంది. జాతిపిత మహాత్మాగాంధీ ఫోటో ముద్రించబడి ఉండే ఈ నోటు గురించి ఎక్కువ మందికి తెలియదు. పాత 50 రూపాయల నోటును పోలి ఉండే జీరో రూపీ నోటు సాధారణ నోటుతో పోలిస్తే పెద్దదిగా ఉంటుంది. అయితే ఈ జీరో రూపీ నోట్లను మాత్రం ఆర్బీఐ ముద్రించదు.

Zero Rupee Note

తమిళనాడు రాష్ట్రంలోని ప్రముఖ ఎన్జీవో సంస్థలలో ఒకటైన ఫిఫ్త్ పిల్లర్ లంచాలను అరికట్టాలనే మంచి ఉద్దేశంతో జీరో రూపీ నోటును ప్రవేశపెట్టింది. తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో ఈ నోట్లను ముద్రించడం గమనార్హం. ఫిఫ్త్ పిల్లర్ సంస్థ ఈ నోట్లను బస్ స్టేషన్లు, రకరకాల మార్కెట్లు, రైల్వే స్టేషన్లలో పంపిణీ చేసింది. అయితే జీరో రూపీ నోట్లకు ఎటువంటి విలువ ఉండదని గుర్తుంచుకోవాలి.

Also Read: ముసురుకుంటున్న కరోనా..ఢిల్లీ, ముంబైలో తీవ్రత 70శాతం వరకూ..

ఫిఫ్త్ పిల్లర్ సంస్థ లంచగొండి అధికారులలో మార్పు తీసుకొనిరావాలనే ఉద్దేశంతో జీరో రూపీ నోట్లను ప్రవేశపెట్టింది. ఈ నోటు వల్ల అధికారులలో మార్పు వచ్చినా రాకపోయినా ఈ నోటు మాత్రం చరిత్రలో నిలిచిపోవడం గమనార్హం. ఎవరైనా లంచం అడిగితే ఈ నోటు ఇవ్వండి తర్వాత మాకు ఫిర్యాదు చేయండి అని ఫిఫ్త్ పిల్లర్ సంస్థ చెబుతోంది. ఈ జీరో రూపీ నోటు కింద “నేను లంచం ఇవ్వను.. లంచం తీసుకోను” అనే క్యాప్షన్ ఉంటుంది.

5 లక్షల కంటే ఎక్కువమంది ఈ నోటుకు ఆమోదం తెలుపుతూ సంతకాలు చేశారు. www.5thpillar.org వెబ్ సైట్ ద్వారా ఈ జీరో రూపీ నోట్లను పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. లంచానికి వ్యతిరేకంగా ఈ నోటుకు బాగా పాపులారిటీ దక్కింది.