Telugu News » Entertainment » Actress ufri javed opens up about casting couch reveals she experienced in industry
Urfi Javed: అందరిలాగే నేను కూడా కాస్టింగ్ కౌచ్ బాధితురాలినే.. బిగ్‌బాస్ కంటెస్టెంట్ షాకింగ్ కామెంట్స్
Urfi Javed: సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ పేరుతో ఎంతో మంది మహిళలు తము ఎదుర్కొంటున్న వేధింపులను బయటపెట్టిన సంగతి తెలిసిందే. మీటూ, క్యాస్టింగ్ కౌచ్ అంటూ ఇండస్ట్రీలో తనకు ఎదురైన చేదు అనుభవాలను మీడియా ముందుకొచ్చి మరి తమ బాధను కక్కుకున్న చాలా మంది హీరోయిన్లు ఉన్నారు. భాషతో సంబంధం లేకుండా.. టాలీవుడ్, బాలీవడ్, హాలీవుడ్, కోలీవుడ్ ఇలా అన్ని పరిశ్రమల్లోని మహిళలు లైంగిక వేధింపులకు గురయ్యారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా, బాలీవుడ్ నటి […]
Urfi Javed: సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ పేరుతో ఎంతో మంది మహిళలు తము ఎదుర్కొంటున్న వేధింపులను బయటపెట్టిన సంగతి తెలిసిందే. మీటూ, క్యాస్టింగ్ కౌచ్ అంటూ ఇండస్ట్రీలో తనకు ఎదురైన చేదు అనుభవాలను మీడియా ముందుకొచ్చి మరి తమ బాధను కక్కుకున్న చాలా మంది హీరోయిన్లు ఉన్నారు. భాషతో సంబంధం లేకుండా.. టాలీవుడ్, బాలీవడ్, హాలీవుడ్, కోలీవుడ్ ఇలా అన్ని పరిశ్రమల్లోని మహిళలు లైంగిక వేధింపులకు గురయ్యారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా, బాలీవుడ్ నటి ఉర్ఫీ జావెద్ ఇండస్ట్రీలో తనకు ఎదురైన చేదు అనుభవాలను భయటపెట్టారు.
హిందీలో ప్రసారమవుతున్న బిగ్‌బాస్ ఓటీటీలో పాల్గొన్న హౌస్‌మేట్స్‌లో ఉర్పీ జావెద్ కూడా ఒకరు. సోషల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మకున్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ఎప్పుడూ యాక్టీవ్‌గా ఉంటూ.. వీడియోలు, రీల్స్‌ను అభిమానులతో పంచుకుంటుంటుంది. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె.. ఇండస్ట్రీలో తను ఎదుర్కొన్న కొన్ని సంస్యలను వివరిస్తూ.. అందరికీ షాక్ ఇచ్చింది.
ఇండస్ట్రీలో చాలా మంది అమ్మాయిల్లాగే నేను కూడా కాస్టింగ్ కౌచ్ బాధితురాలినే. ఒకతను నన్ను చాలా బలవంతం చేశాడు.. నా అదృష్టం వల్లే నేను అక్కడ నుంచి బయటపడగలిగా. ఇండస్ట్రీలో పెద్దమనుషులుగా చలామని అవుతున్నా వాళ్లే ఇలాంటి పనులు ఎక్కువగా చేస్తున్నారు. వాళ్లు తలుచుకుంటే.. ఏమైనా చేయగలరనే నమ్మకం. అందుకే, నేను వాళ్ల పేర్లను నేను బయట పెట్టడం లేదు. అంటూ చెప్పుకొచ్చింది. కాగా, జావెద్ బాదే భయ్యాకి దుల్మనియా సీరియస్‌తో ప్రేక్షకులను పలకరించింది. ఆ తర్వాత మేరీ దుర్గాలో నటిగా మంచి గుర్తింపు సాధించారు.