Walk : ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలామంది బరువు పెరుగుతున్నారు. ఇంకొంత మంది రకరకాల అనారోగ్యానికి గురవుతున్నారు. అయితే ఎక్కువ శాతం మంది శారీరకంగా శ్రమ పడడం లేదు. దీంతోనే బరువు పెరుగుతున్నారని వైద్యులు చెబుతున్నారు. అందువల్ల ప్రతిరోజు వ్యాయామం చేయాలని లేదా ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలని పేర్కొంటున్నారు. ఆహారం ఎలా తీసుకుంటున్న వ్యాయామం తప్పనిసరిగా ఉండాలని అంటున్నారు. వ్యాయామంలో భాగంగా ప్రతిరోజు కనీసం వాకింగ్ చేయాలని చెబుతున్నారు. అయితే కొందరు సిటీలో ఉండే వారికి దగ్గరలో సరైన మైదానాలు ఉండకపోవచ్చు. ఇలాంటి వారు ఇంట్లోనే ట్రేడ్ మిల్ ను ఏర్పాటు చేసుకొని వాకింగ్ చేస్తూ ఉంటారు. ఇంకొంతమంది దగ్గర్లో మైదానం ఉన్నా బయటికి వెళ్లలేక.. ఇంట్లోనే ట్రేడ్ మిల్ ను ఏర్పాటు చేసుకుంటారు. అసలు బయట వాకింగ్ చేయడం మంచిదా.? లేక ఇంట్లోనే ట్రేడ్ మిల్ ను సెట్ చేసుకోవడం మంచిదా?
Also Read : శీతాకాలంలో ఉదయాన్నే వాకింగ్ చేయవచ్చా? చేస్తే ఏ సమయంలో చేయాలి?
ఆరుబయట వాకింగ్ చేయడం వల్ల గుండె వేగం కొట్టుకోవడం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఆరు బయట వాకింగ్ చేసేవారు తమకు నచ్చిన విధంగా నడుస్తారు. కొందరు ఎక్కువ ఎనర్జీతో స్పీడ్ గా నడిస్తే.. మరికొందరు స్లోగా వెళుతూ ఉంటారు. కానీ ఇంట్లో ఉన్న ట్రేడ్మిల్లు ఒకే రకమైన వాకింగ్ చేయాల్సి వస్తుంది. దీంతో గుండె పనితీరు ఒకే మాదిరిగా ఉంటుంది. అయితే హార్ట్ బీట్ పెరగడం వల్ల ఎక్కువ ఎనర్జీ పెరుగుతుంది. అందువల్ల ఆరు బయట వాకింగ్ చేయడం మంచిది.
ఆరుబయట వాకింగ్ చేయడం వల్ల ఆందోళన స్థాయిలో ఏ విధంగా మార్పులు ఉండడం లేదు. కానీ ఇంట్లో ట్రెడ్మిల్ చేయడం వల్ల ఆందోళన స్థాయిలో తగ్గుతున్నట్లు గుర్తించారు. ఈ క్రమంలో ఆందోళన స్థాయి తగ్గాలని అనుకునేవారు ఇంట్లోనే ట్రెడ్మిల్ వాకింగ్ చేయడం మంచిది.
ఆరు బయట వాకింగ్ చేసిన వారిలో ఉత్సాహం, సానుకూల దృక్పథం వంటివి ఎక్కువగా లభిస్తున్నాయి. కానీ ఇంట్లో ట్రేడ్మిల్ పై వాకింగ్ చేసేవారిలో ఇవి తక్కువగా ఉంటున్నాయి. ఈ విషయాల గురించి ఆలోచించేవారు ఆరుబయటే వాకింగ్ చేయడం మంచిది.
ఆరు బయట వాకింగ్ చేయడం వల్ల శారీరకంగా శ్రమతో పాటు శ్వాస రేటు కూడా పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే స్వచ్ఛమైన వాతావరణం లో ఉండడం వల్ల మంచి గాలిని పీల్చుకునే అవకాశం ఉంటుంది. కానీ ఇంట్లో ట్రెడ్మిల్ నడిచేవారు స్వచ్ఛమైన గాలిని పీల్చుకునే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఒకవేళ టెడ్మిల్ ఉన్న గది అపరిశుభ్రంగా ఉంటే మరింత నష్టం కలిగే అవకాశం ఉంటుంది. అందువల్ల స్వచ్ఛమైన గాలిని కోరుకునేవారు ఆరు బయట వాకింగ్ చేయడం మంచిది.
బయట వాకింగ్ చేసే వారిలో నలుగురు కలవడం వల్ల ఎంతో సంతోషంగా ఉండగలుగుతారు. అంతేకాకుండా రకరకాల మనుషులు కొత్త విషయాలు పంచుకోవడం వల్ల తెలివి పెరిగే అవకాశం ఉంటుంది. కానీ ఇంట్లో వాకింగ్ చేయడం వల్ల ఇలాంటి పరిస్థితి ఉండదు. అంతేకాకుండా కొత్త విషయాలు తెలుసుకునే ఆస్కారం అసలే ఉండదు. అందువల్ల ఇంట్లో ట్రెడ్మిల్ కంటే ఆరు బయట వాకింగ్ చేయడమే చాలా బెటర్ అని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
Also Read : వారానికి ఎన్ని అడుగులు వేస్తే ఆరోగ్యానికి మంచిదో మీకు తెలుసా?