Sleep
Sleep : కాసేపు కునుకు తీస్తే మనసు ఎంతో హాయిగా ఉంటుంది. కనీసం 8 గంటలు నిద్రపోతే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. కానీ ఇప్పుడున్న కాలంలో ఒత్తిడి, ఉద్యోగం, వ్యాపారం కారణంగా చాలామంది సరైన నిద్రపోవడం లేదు. దీంతో అనేక కొత్త రోగాలను తెచ్చుకుంటున్నారు. అయితే కొందరు నిద్ర పోవాలని అనుకున్న వెంటనే నిద్ర పట్టదు. ఉదయం చేసిన పనులన్నీ మనసులోకి వచ్చి ఇబ్బంది పెడుతూ ఉంటాయి. మరికొందరికి భవిష్యత్తు, వర్తమానం సంబంధించిన విషయాలు కళ్ళ ముందు కదలాడుతూ నిద్ర పట్టదు. కానీ ఇలా నిద్రపోవడానికి కళ్ళు మూసుకున్న మనసు నిద్ర పోకపోతే చికాకు కలుగుతుంది. మరి బెడ్ పైకి వెళ్ళిన వెంటనే నిద్ర పట్టాలంటే కొన్ని టిప్స్ ఫాలో కావాలి. అవేంటో ఇప్పుడు చూద్దాం..
Also Read : నిద్రలేమి కారణంగా వచ్చే వ్యాధులు ఇవే.. వెంటనే తెలుసుకోండి..
ప్రస్తుత సమాజంలో చాలామంది చాలా రకాల పనులు చేస్తున్నారు. కొందరు ఉదయం 9 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు విధుల్లో మునిగితే.. మరికొందరు రాత్రంతా మెలకువతో ఉంటూ పనులు చేస్తున్నారు. అయితే ఏ పని చేసినా కనీసం 8 గంటల పాటు నిద్రపోవడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. కానీ కొంతమంది విధుల్లో ఉండకుండా కాలక్షేపం ఎక్కువగా చేస్తూ నిద్రను పాడు చేసుకుంటున్నారు. మొబైల్ ఫోన్ తో పాటు ఇతర కాలక్షేపాలతో సమయాన్ని వృథా చేసుకుంటున్నారు. అయితే కొన్ని అలవాట్లను చేసుకోవడం వల్ల పడుకున్న వెంటనే నిద్ర వచ్చే అవకాశం ఉంది. వీటిలో..
రాత్రి పడుకునే ముందు టీ, కాఫీలకు దూరంగా ఉండటం మంచిది. ఎందుకంటే వీటిలో ఉండే కెఫిన్ నిద్రను రాకుండా చేస్తుంది. రాత్రుల్లో విధులు నిర్వహించేవారు నిద్ర రాకుండా ఉండడానికి టీ, కాఫీలు తాగుతూ ఉంటారు. కానీ రాను రాను అదే అలవాటు అయిపోయి పడుకున్నా కూడా నిద్రను పట్టకుండా చేస్తుంది. అందువల్ల రాత్రి సమయంలో టీ కాఫీలకు దూరంగా ఉండటం మంచిది.
ప్రతిరోజు నిద్ర గడియారాన్ని సెట్ చేసుకోవాలి. అంటే ప్రతిరోజు ఒకే సమయంలో నిద్ర పోవడానికి ప్రయత్నించాలి. కొన్ని రోజులపాటు ఎన్ని పనులు ఉన్నా వాటిని పక్కన పెట్టి ఒకే సమయంలో నిద్ర పోవడం వల్ల.. ఇది అలవాటుగా మారి ఆ సమయానికి మంచి నిద్ర పడుతుంది. అయితే కొన్ని రోజులు నిద్ర పట్టని సమయంలో మంచి సంగీతం వింటూ నిద్రపోవాలి. అలా చేస్తే ఫలితం ఉంటుంది.
నిద్రపోయే ముందు ఎటువంటి ఒత్తిడిలకు లోను కావద్దు. ప్రశాంతమైన వాతావరణంలో గడపాలి. ఇష్టమైన సంగీతం వినాలి. కుటుంబ సభ్యులతో మాట్లాడాలి. నచ్చని వ్యక్తులకు దూరంగా ఉండాలి. వీలైతే ఒక పుస్తకం చదువుతూ ఉండాలి. ఇలా చేయడం వల్ల మనసు ప్రశాంతంగా మారి ఆ తర్వాత వెంటనే నిద్ర వస్తుంది.
రాత్రి సమయంలో తక్కువగా తినడం వల్ల శరీరంలో జీర్ణక్రియ సక్రమంగా ఉంటుంది. దీంతో రక్త ప్రసరణ మెరుగ్గా ఉండి సరైన నిద్ర వస్తుంది. ఆయిల్ ఫుడ్ లాంటివి తినడం వల్ల జీర్ణక్రియ సమస్యలు ఏర్పడి కడుపు ఉబ్బరంగా ఉంటుంది. దీంతో మనసు ఆందోళనగా ఉండి నిద్ర పట్టే అవకాశాలు ఉండవు. అందువల్ల సాయంత్రం లైట్ ఫుడ్ తీసుకోవాలి.
Also Read : భాగస్వామితో కలిసి నిద్రిస్తే ఇన్ని ప్రయోజనాలా.. ఇవి అందరూ తెలుసుకోవాల్సిన విషయాలు..