Walking
Walking: వ్యాయామం చేయడం ఆరోగ్యానికి చాలా మంచిది. డైలీ వ్యాయామం చేయడం వల్ల బాడీ ఫిట్‌గా ఉండటంతో పాటు ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఆరోగ్యంగా ఉంటారు. అయితే చాలామంది వాళ్ల బిజీ లైఫ్ వల్ల అసలు వ్యాయామం చేయడం లేదు. నిజం చెప్పాలంటే కనీసం శారీరక శ్రమ కూడా బాడీకి లేదు. డైలీ వ్యాయామం చేయడం వల్ల కండరాలు బలంగా తయారవుతాయి. అలాగే శరీరంలో ఉన్న కొవ్వు తగ్గుతుంది. అలాగే ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి విముక్తి చెందుతారు. ఈ రోజుల్లో అందరూ కూడా సుఖానికి అలవాటు పడి కనీసం శారీరకంగా వ్యాయామం కూడా చేయడం లేదు. అయితే వాకింగ్ అనేది ఏ సీజన్‌లో చేసిన ఆరోగ్యానికి మంచిదే. అయితే ప్రస్తుతం చలి తీవ్రత బాగా పెరిగిపోయింది. దీనివల్ల చాలా మంది అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. దీంతో చలికాలంలో వాకింగ్ చేయడానికి పెద్దగా ఇష్టపడటం లేదు. అయితే చలికాలంలో వాకింగ్ చేయడం ఆరోగ్యానికి మంచిదేనా? చేస్తే ఎప్పుడు చేయాలి? అనే పూర్తి విషయాలు ఈ స్టోరీలో చూద్దాం.
ఏ సీజన్‌లో అయిన వ్యాయామం చేయడం ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే చలికాలంలో వ్యాయామం చేసేవారు ముఖ్యంగా కొన్ని విషయాలను తప్పకుండా తెలుసుకోవాలి. ఉదయం 5 గంటల సమయంలో అసలు వ్యాయామానికి వెళ్లకూడదు. ఎందుకంటే ఈ సమయంలో చలి తీవ్రత భారీగా ఉంటుంది. దీంతో జలుబు, దగ్గు వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాస్త ఎండ వచ్చిన తర్వాత వాకింగ్‌కి వెళ్లాలి. అదే ఉదయం 7 గంటల నుంచి 9 గంటల సమయంలో వాకింగ్‌కి వెళ్లడం చాలా మంచిది. దీనివల్ల ఉదయం పూట ఉన్న పొగమంచు వల్ల మీకు ఎలాంటి అనారోగ్య సమస్యలు రావు. లేదు ఉదయం చలికి తట్టుకోలేమంటే.. సాయంత్రం సమయాల్లో వాకింగ్‌కి వెళ్లడం బెటర్ అని నిపుణులు అంటున్నారు. అలాగే చలిని తట్టుకునే స్వెటర్లు, చెవులు, పాదాలు అన్ని కప్పుకునేలా దుస్తులు ధరించాలి. వీటివల్ల చల్లని గాలి చొరవక జలుబు వంటి సమస్యల నుంచి విముక్తి పొందుతారు. అలాగే ఆస్తమా, గుండె సమస్యలతో బాధపడుతున్న వారు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఉదయం పూట కంటే సాయంత్రం పూట వీరు వాకింగ్‌కి వెళ్లడం మంచిది.
చలికాలంలో వాకింగ్ చేసేవారు ఒక్కసారిగా ఎక్కువగా చేయకూడదు. కాస్త నెమ్మదిగా నడుస్తూ.. వేగం పెంచాలి. నిజం చెప్పాలంటే చలికాలంలో వాకింగ్‌కి వెళ్లకపోవడం కూడా మంచిదే. చలి తీవ్రత పెరుగుతున్నట్లయితే వాకింగ్‌కి వెళ్లవద్దు. చలిలో వాకింగ్‌కి వెళ్లడం వల్ల అనారోగ్య సమస్యల బారిన పడతారు. రోజు ఉదయం కొంత సమయం సూర్యరశ్మిలో ఉండటం మంచిది. ఇలా ఉండటం వల్ల శరీరానికి విటమిన్ డి అందడంతో పాటు చలి నుంచి కూడా బయటపడతారు. అలాగే చలికాలంలో రోజుకి ఒక 15 నుంచి 20 నిమిషాలు మాత్రమే వాకింగ్ చేయడం మంచిది. అంతకంటే ఎక్కువగా చేస్తే ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.