Children Study: మీ పిల్లలు బాగా చదవడం లేదా? అయితే ఇలా చేయండి

కొంతమంది పిల్లలు బాగా చదువుతుంటారు. కానీ తప్పుడు పద్ధతుల వల్ల వారు చదువు మీద పెద్దగా ఆసక్తిని పెట్టరు. అందుకే ఇప్పుడు పిల్లలు చదవాలంటే తల్లిదండ్రులు ఏం చేయాలి అనే వివరాలు తెలుసుకుందాం.

Written By: Swathi, Updated On : June 16, 2024 1:49 pm

Children Study

Follow us on

Children Study: పిల్లలు బాగా చదివి బాగుపడాలని ప్రతి ఒక్కరి తల్లిదండ్రులు కోరుకుంటారు. కానీ చిన్న తనంలో వారికి చదువు మీద పెద్దగా ఆసక్తి ఉండదు. దీనికి కారణం తల్లిదండ్రులు కూడా అంటే మీరు నమ్ముతారా? కానీ అవును అంటున్నారు నిపుణులు.
కొంతమంది పిల్లలు బాగా చదువుతుంటారు. కానీ తప్పుడు పద్ధతుల వల్ల వారు చదువు మీద పెద్దగా ఆసక్తిని పెట్టరు. అందుకే ఇప్పుడు పిల్లలు చదవాలంటే తల్లిదండ్రులు ఏం చేయాలి అనే వివరాలు తెలుసుకుందాం.

సరైన జీవనశైలి: యోగా చేయడం వల్ల పిల్లల చదువుల మీద సానుకూల ప్రభావం ఉంటుంది. యోగా మాత్రమే కాదు వారి జీవనశైలి , ఆహారపు అలవాట్ల మీద కూడా శ్రద్ధ వహించాలి. ఫాస్ట్ ఫుడ్ , జంక్ ఫుడ్ లకు పూర్తిగా దూరం చేయాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేసేలా ప్రోత్సహించాలి.

మంచి వాతావరణం: పిల్లలు చదువుకోవడానికి మాటి మాటికి బయటకు వెళ్తారు. అంటే ఇంట్లో సరైన వాతావరణం లేదని అర్థం. దీన్ని సర్దిదిద్దకుండా పిల్లలను తిడితే వారికి చదువుకోవాలనే ఆసక్తి కూడా పోతుంది. కాబట్టి మీరు చదువుకోవడానికి సరైన శాంతియుత వాతావరణాన్ని ఇంట్లోనే సృష్టించండి. లేదంటే బయటకు వెళ్లిన వారి మీద దృష్టి పెట్టండి.

ప్రశంసలు: పిల్లలు చేసే పనుల్లో మంచి ఉంటే ప్రశంసిస్తూ ఉండాలి. కానీ ప్రతి దానికి వారిని తిడుతూ ఉండకూడదు. వీలైనంత వరకు ప్రశంసించండి, కానీ అతిగా కూడా ప్రశంసిస్తే చెడు జరుగుతుంది అని గుర్తు పెట్టుకోండి. కొన్ని సార్లు వారు ఏదైనా ఎక్కువ శ్రద్ధతో చేస్తుంటారు. ఈ పద్ధతి వారిని చదవడానికి ప్రోత్సహిస్తుంది కాబట్టి డిస్ట్రబ్ చేయకండి.

రిలాక్సేషన్: ఎక్కువ మార్కులు సాధించాలని పిల్లల మీద ఎక్కువ ఒత్తిడికి చేస్తున్నారు. ఇలా చేయడం తప్పు. రోజంతా చదువుతూ ఉంటే, పిల్లలు శారీరకంగా , మానసికంగా అలసిపోతారు. కాబట్టి పిల్లలు బాగా చదువుకోవాలంటే కనీసం ఎనిమిది గంటల నిద్ర కచ్చితంగా వారికి అవసరం. అప్పుడే బాగా చదవగలరు. చదివింది గుర్తు పెట్టుకోగలరు.