Thammudu: రీ రిలీజ్ లో కూడా సత్తా చాటుతున్న తమ్ముడు సినిమా…

ప్రస్తుతం ఆయన ఏపీ డిప్యూటీ సీఎంగా పదవి బాధ్యతలను స్వీకరించారు. ఇక దాంతో పాటుగా పలు శాఖలకు మంత్రిగా కూడా వ్యవహరిస్తున్నారు.

Written By: Gopi, Updated On : June 16, 2024 12:48 pm

Thammudu

Follow us on

Thammudu: సినిమా ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఎప్పుడైతే ఆయన సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడో అప్పటినుంచి తను మాత్రం ఎక్కడ తగ్గకుండా ముందుకు దూసుకెళ్తూన్నాడు. ఇక ప్రస్తుతం తన తోటి హీరోలు తనని రీచ్ అవ్వలేని పొజిషన్ కి చేరుకున్నాడు. ప్రస్తుతం పాన్ ఇండియా హీరోలకు సైతం లేని క్రేజ్ పవన్ కళ్యాణ్ కి ఉందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.

ఇక ప్రస్తుతం ఆయన ఏపీ డిప్యూటీ సీఎంగా పదవి బాధ్యతలను స్వీకరించారు. ఇక దాంతో పాటుగా పలు శాఖలకు మంత్రిగా కూడా వ్యవహరిస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ 1999వ సంవత్సరంలో చేసిన తమ్ముడు సినిమా సూపర్ సక్సెస్ అయింది. ఇక ఆ సినిమాని ఇప్పుడు రిలీజ్ చేశారు. ఇక రీ రిలీజ్ లో కూడా ఈ సినిమా సూపర్ సక్సెస్ సాధించడమే కాకుండా ప్రేక్షకులందరి మన్ననలు పొందుతుంది.

ఇక నిన్న రీ రిలీజ్ అయిన ఈ సినిమాకి అకిరా నందన్ కూడా వెళ్లి అభిమానుల్లో జోష్ నింపాడు. ఇక మొత్తానికైతే ఈ సినిమా 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రీ రిలీజ్ చేయడం అనేది పవన్ అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో కూడా మంచి ఉత్సాహం అయితే నింపింది. ఇక ఆర్టీసీ క్రాస్ రోడ్ లో అకీరా నందన్ మెగా ఫ్యామిలీ తరుపున సినిమా చూడటానికి వచ్చి వాళ్ళ నాన్న సినిమాలు చూసి ఆనందించాడు.

ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ అటు రాజకీయాలు, ఇటు సినిమాలు రెండింటి మీద ఫోకస్ చేసి ముందుకు కదలబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇప్పటికే సెట్స్ మీద ఉన్న సినిమాలను పూర్తిచేయాలని తను అనుకుంటున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి. మరి ఆయన షూటింగ్ లో ఎప్పుడు పాల్గొంటాడు అనే విషయాల మీదనే సరైన క్లారిటీ అయితే రావడం లేదు…చూడాలి మరి పవన్ కళ్యాణ్ సినిమాలు ఎంత పెద్ద సక్సెస్ ను సాధిస్తాయి అనేది…