Pushpa 2: పుష్ప 2 ఓజీ ఈ రెండు సినిమాలకు ఏమైంది..?

సుజీత్ డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్ హీరోగా చేస్తున్న ఓజి సినిమాని ఇంతకు ముందు సెప్టెంబర్ 27వ తేదీన రిలీజ్ చేస్తున్నామంటూ అనౌన్స్ చేశారు.

Written By: Gopi, Updated On : June 16, 2024 1:56 pm

Pushpa 2

Follow us on

Pushpa 2: ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్ లో మంచి గుర్తింపును సంపాదించుకున్న నటుడు అల్లు అర్జున్…ఇక ఆయన చేస్తున్న పుష్ప 2 సినిమా మీద ఇండియా వైడ్ గా మంచి క్రేజ్ అయితే ఉంది. మరి ఈ సినిమా ఎప్పుడు వస్తుంది అంటూ ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే ఇంతకు ముందు దాకా ఆగస్టు 15వ తేదీన ఈ సినిమా రాబోతుంది అంటూ అనౌన్స్ చేసిన సినిమా మేకర్స్ ఇప్పుడు మాత్రం ఈ సినిమా తేదీని పోస్ట్ పోన్ చేసినట్టుగా తెలుస్తుంది.

అయితే దీనికి గల కారణాలు ఏంటి అంటే ఈ సినిమా కొంతమంది పోస్ట్ ప్రొడక్షన్ చేసేవాళ్లు సరిగ్గా చేయలేదనే ఉద్దేశ్యం తో మళ్లీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చేయించే పనిలో బిజీగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక అందులో భాగంగానే దానికోసం ఇంకా కొంచెం టైమ్ కావాల్సి ఉండడంతో ఈ సినిమాని పోస్ట్ పోన్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇక అందుకే అదే తేదీన రామ్ హీరోగా, పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో వస్తున్న డబుల్ ఇస్మార్ట్ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక మొత్తానికైతే ఈ సినిమా ని పోస్ట్ పోన్ చేసినట్టుగా తెలుస్తుంది.

మరి కొత్త తేదీని మళ్లీ ఎప్పుడు అనౌన్స్ చేస్తారో చూడాలి… ఇక ఇదిలా ఉంటే సుజీత్ డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్ హీరోగా చేస్తున్న ఓజి సినిమాని ఇంతకు ముందు సెప్టెంబర్ 27వ తేదీన రిలీజ్ చేస్తున్నామంటూ అనౌన్స్ చేశారు. అయితే ఆ తేదీన ఇప్పుడు ఓజీ సినిమా వచ్చే అవకాశాలైతే లేవు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ మంత్రిగా డిప్యూటీ సీఎం గా నిర్వర్తించాల్సిన సమయం అయితే వచ్చింది. కాబట్టి దానికోసమే ఆయన మరికొన్ని రోజులు షూటింగ్ కి బ్రేక్ ఇవ్వాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది.

ఇక మొత్తానికైతే సెప్టెంబర్ 27వ తేదీన పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా రావడం లేదనే ఉద్దేశ్యం తోనే దేవర సినిమాని రిలీజ్ చేస్తున్నట్టుగా అనౌన్స్ అయితే చేశారు. మరి పుష్ప 2, ఓజీ సినిమాలు ఎప్పుడు రిలీజ్ అవుతాయి. అనే వాటికి సంబంధించిన అప్డేట్ ని సినిమా మేకర్స్ ఎప్పుడు అనౌన్స్ చేస్తారు అనేది తెలియాల్సి ఉంది…