Discovery: మామూలుగా ఒక సినిమా లేదా సీరియల్ షూటింగ్ చేస్తున్నప్పుడు అందులో నటిస్తున్న యాక్టర్లు దర్శకులు చెప్పినట్టు వింటారు. కెమెరామెన్లు చెప్పినట్టుగా హావభావాలు ప్రదర్శిస్తుంటారు. పైగా ప్రతి సన్నివేశానికి టేక్ లు ఉంటాయి. కెమెరామెన్ చెప్పినప్పుడు.. దర్శకులు గ్రీన్ సిగ్నల్ వచ్చినప్పుడు మాత్రమే నటీనటులు నటిస్తారు. ఆ తర్వాత కేరవాన్ లోకి వెళ్తారు.
నటన అనేది మనుషులు మాత్రమే చేయగలుగుతారు. మనుషులకు మాత్రమే మేధస్సు ఉంటుంది కాబట్టి దర్శకులు, కెమెరామెన్లు చెప్పినట్టు నటినటులు నడుచుకుంటారు. కానీ జంతువులు అలా చేస్తాయా? జంతువులకు నటించే సత్తా ఉంటుందా? ఒకవేళ నటించే నైపుణ్యం ఉన్నప్పటికీ అవి దర్శకుడు, కెమెరామెన్ చెప్పినట్టు వింటాయా? జంతువులలో గుర్రాలు లేదా శునకాలు నటిస్తాయి. శిక్షణ పొందిన గుర్రాలు, కుక్కలు దర్శకుడు చెప్పినట్టు వింటాయి. కెమెరామెన్ చెప్పినట్టు హావభావాలు ప్రదర్శిస్తాయి. గుర్రాలు, కుక్కలు కాకుండా సింహాలు, జింకలు నటిస్తే.. కెమెరామెన్, దర్శకుడు చెప్పినట్టు వింటే ఎలా ఉంటుంది.. చదువుతుంటే ఆశ్చర్యం అనిపిస్తోంది కదూ.. మా కూడా కింద ఉన్న వీడియో చూసిన తర్వాత అలానే అనిపించింది. కానీ ఆ తర్వాతే అసలు సంగతి తెలిసింది.
ఎనిమల్ ప్లానెట్, డిస్కవరీ చానల్స్ లో జంతువుల వేట, ఇతర వ్యవహారాల గురించి అత్యంత లోతుగా చెబుతుంటారు. దానికి తగ్గట్టుగా వీడియోలను ప్లే చేస్తుంటారు. సింహాలు లేదా పులులు జింకలను ఇతర జంతువులను వేటాడుతున్నప్పుడు వీడియోలు తీస్తుంటారు. వాస్తవానికి క్రూర మృగాలకు వేట అనేది సర్వసాధారణం. కానీ ఆ వేట కూడా దర్శకులు డిసైడ్ చేసే విధంగా ఉంటే ఎలా ఉంటుందో.. ఓ వీడియో సోషల్ మీడియాలో కనిపిస్తోంది. ఆ వీడియో ప్రకారం ఓ పులి ఆకస్మాత్తుగా జింక మీదికి వచ్చింది. డైరెక్టర్ కట్ అనగానే ఆగిపోయింది. వాస్తవానికి ఈ వీడియో నిజమని చాలామంది అనుకుంటున్నారు. కాకపోతే ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా రూపొందించింది అని తెలియడంతో ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో లక్షల్లో వీక్షణలను సొంతం చేసుకుంది. కామెంట్లు కూడా అదే స్థాయిలో దక్కించుకుంది. ఈ వీడియోను చూసిన వారంతా ముందుగా ఆశ్చర్యపోతున్నారు.. ఆ తర్వాత అసలు విషయం తెలిసి విస్తు పోతున్నారు.