Life improvement tips: రోజు ఉదయాన్నే లేవడం.. ఆ తర్వాత గబగబా ఆఫీస్ కు వెళ్లడం.. తిరిగి ఇంటికి రావడం.. రాత్రి నిద్రపోవడం.. ఇలా ప్రతి వ్యక్తి జీవితంలో జరిగేదే. అయితే కొందరు ఈ పరిస్థితిని చూసి జీవితమంటే ఇంతేనా..? ఈ మాత్రం దానికి కష్టపడి చదవాలా? అంటే అసలు కానే కాదు అని కొందరు నిపుణులు అంటున్నారు. లైఫ్ అంటే కేవలం సాధారణ జీవితం కాదని.. రోజువారి కార్యకలాపాలతో పాటు అదనంగా కొన్ని అలవాట్లు చేసుకోవాలని.. ఈ అలవాట్లతో జీవితం మరింత ఆనందమయంగా మారుతుందని అంటున్నారు. ఎలాంటి అలవాట్లతో జీవితం ప్రత్యేకంగా ఉంటుంది? అందుకోసం ఏం చేయాలి?
బతకడానికి ఏదోరకంగా డబ్బు సమకూరుతుంది. కానీ అందరిలా బతకడం వల్ల అందులో ప్రత్యేకత ఏముంది? మరి ఆ ప్రత్యేకత సాధించాలంటే అందరిలా కాకుండా భిన్నంగా ఆలోచించాలి. మిగతా వారి కంటే ఎక్కువగా కష్టపడాలి. అదనపు ఆదాయాన్ని సేకరించాలి. అంటే రోజు కామన్ గా చేసే ఉద్యోగం లేదా వ్యాపారం కాకుండా అదనంగా డబ్బు వచ్చే పనులు చేయాలి. ఆ పనులు నిజాయితీ, నిబద్ధతతో ఉండాలి. అప్పుడే ఇరువైపులా న్యాయం జరుగుతుంది. ఇరు వర్గాలు సంతోషంగా ఉండగలుగుతారు. డబ్బు ఎక్కువగా ఉంటే కొన్ని ప్రత్యేక అవసరాలు తీర్చుకోవచ్చు. అందువల్ల డబ్బులు సంపాదించడం నేర్చుకోవాలి.
డబ్బు ఎంత ఉన్నా.. ఆరోగ్యం మాత్రం బాగుండాలి. ఒక వ్యక్తి ఆరోగ్యంగా లేకపోతే అతడు డబ్బు సంపాదించలేడు.. సరైన జీవితాన్ని కొనసాగించలేడు. అందువల్ల ఆరోగ్యంగా ఉండేందుకు ప్రతిరోజు వ్యాయామం చేయాలి. అయితే బిజీ వాతావరణం లో పడి చాలామంది వ్యాయామమును పట్టించుకోరు. అంతేకాకుండా వ్యాయామం చేయడం వల్ల సమయం వృధా అని అనుకుంటారు. కానీ ప్రతిరోజు ఒక గంట సేపు చేసే వ్యాయామం భవిష్యత్తులో ఆరోగ్యంగా ఉండడానికి ఉపకరిస్తుంది. అంతేకాకుండా నిత్యం ఆరోగ్యంగా ఉండడంతో మంచి ఆలోచనలు వచ్చి మంచి పనులు చేయగలుగుతారు.
ప్రతి ఒక్కరిలో సృజనాత్మకత తప్పనిసరిగా అవసరం ఉంటుంది. ఎందుకంటే ఉద్యోగం అయినా వ్యాపారం అయినా ఒక వ్యక్తిలో ఎంతో కొంత తెలివి లేకపోతే ఆ రంగంలో ఉండలేక పోతారు. అయితే ఇది సాధారణ వ్యక్తులు చేసే పని. మిగతా వారి కంటే భిన్నంగా ఆలోచించి.. భిన్నమైన సృజనాత్మకతను పెంచుకోవడం వల్ల పదిమందిలో ఒకరిలా కాకుండా పదిమందికి ఒకరిలా మారిపోతారు. ఇలా మారిపోవడం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆ తర్వాత మరింత ఉత్సాహంగా ముందుకు వెళ్తారు.
తెలిసింది గోరంత.. తెలియంది కొండంత.. అని సినిమాల్లో చెప్పినా.. ఇది అక్షరాల నిజం. మనకు ఎప్పటికీ సరిపోయేంత జ్ఞానం ఉండదు. నిత్యం జ్ఞానం కోసం పుస్తకాలు చదువుతూనే ఉండాలి.. కొత్త విషయాలు తెలుసుకుంటూనే ఉండాలి. ఎంత జ్ఞానాన్ని ఎక్కువగా సంపాదించుకుంటే అంత ప్రశాంతమైన జీవితం ఉంటుంది.
కొందరిని చూస్తే నిరాశ అనిపిస్తుంది.. మరికొందరిని చూస్తే ఉత్సాహం అనిపిస్తుంది. కానీ ఉత్సాహంగా ఉండే వ్యక్తుల వెంట చాలామంది ఉంటారు. నిత్యం ఉత్సాహంగా ఉండడానికి మెదడుకు పదులు పెట్టాలి. అవసరమైతే కొన్ని రకాల గేమ్స్ ఆడాలి. అలా ఆడి చురుగ్గా ఉండటం వల్ల పనులను ఈజీగా చేయగలుగుతారు. అందువల్ల ప్రతి ఒక్కరికి జరుగుతాను అనేది తప్పనిసరి.