Divvela Madhuri controversy: ఈ సీజన్ బిగ్ బాస్(Bigg Boss 9 Telugu) హౌస్ లోకి వైల్డ్ కార్డు కంటెస్టెంట్ గా చాలా వైల్డ్ గా అడుగుపెట్టిన వారిలో ఒకరు దివ్వెల మాధురి(Divvela Madhuri). ఈమెకు బయట ఉన్నప్పుడు ఎంతటి నెగిటివిటీ ఉండేదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అందుకు కారణం వైసీపీ పార్టీ లో ఆమె భర్త MLC గా ఒకప్పుడు కొనసాగడం ఒక కారణం అయితే, పచ్చని సంసారం లో చిచ్చు పెట్టి, భార్య భర్తలను విడదీసి, ఈమె దువ్వాడ శ్రీనివాస్ తో ఉండడం మరో కారణం గా చెప్పొచ్చు. హౌస్ లోకి వచ్చిన కొత్తల్లో ఈమె చాలా పొగరుతో వ్యవహరించింది. ప్రతీ ఒక్కరి పై నోరు జారుతూ ఇష్టమొచ్చినట్టు వ్యవహరించేది. ముఖ్యంగా రీతూ చౌదరి, డిమోన్ పవన్ బంధంపై ఈమె చేసిన కామెంట్స్ ఎంతటి దుమారం రేపాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. తనూజ తో నాకు ఉన్నది హెల్తీ బాండ్, కానీ డిమోన్ పవన్ తో నీకు ఉన్నది అన్ హెల్తీ బాండ్ అంటూ నోరు జారింది.
దీనికి రీతూ చౌదరి కూడా చాలా గట్టిగానే కౌంటర్లు ఇచ్చింది. అయితే పక్క రోజు దివ్వెల మాధురి డిమోన్ పవన్ తో మాట్లాడుతూ ‘మీ ఇద్దరి రిలేషన్ చూడడానికి అసలు నచ్చడం లేదని రీతూ వాళ్ళ అమ్మ నాకు ఫోన్ చేసి చెప్పింది. ఈ విషయం తనతో కూడా చెప్పమని చెప్పింది’ అంటూ చెప్పుకొచ్చింది. నిన్న బిగ్ బాస్ హౌస్ నుండి రీతూ చౌదరి ఎలిమినేట్ అయ్యింది. ఆమెని తమతో పాటు తీసుకెళ్లడానికి ఆమె తల్లి మరియు బిగ్ బాస్ సీజన్ 4 రన్నర్ అఖిల్ సార్థక్ వచ్చారు. అయితే అంతకు ముందు రీతూ చౌదరి మీడియా తో ముచ్చటించింది. ఆమె తల్లి కూడా పక్కనే ఉంది. ఒక రిపోర్టర్ రీతూ చౌదరి తల్లిని ఒక ప్రశ్న అడుగుతూ ‘మీరు రీతూ, డిమోన్ రిలేషన్ బాగాలేదని, మీ అమ్మాయిని అతనితో దూరంగా ఉండమని బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తున్న దివ్వెల మాధురి కి ఫోన్ చేసి చెప్పారట, నిజమేనా’ అని అడగ్గా, దానికి రీతూ చౌదరి తల్లి సమాధానం చెప్తూ, అలాంటిదేమి లేదని చెప్పుకొచ్చింది.
దీంతో దివ్వెల మాధురి చెప్పిన మాటలన్నీ అబద్దాలేనా అని సోషల్ మీడియా లో నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు. కేవలం రీతూ, డిమోన్ విషయం లో మాత్రమే కాదు, భరణి కి దివ్య ని దూరంగా ఉండమని చెప్పండి అంటూ ఈమెకు దివ్య తల్లి ఫోన్ చేసి చెప్పిందట. కానీ దివ్య వాళ్ళ అమ్మ ఫ్యామిలీ వీక్ లో వచ్చినప్పుడు, నేనే మా అమ్మాయిని భరణి గారితో క్లోజ్ గా ఉండమని చెప్పినట్టు చెప్పుకొచ్చింది. అప్పుడే ఆడియన్స్ కి దివ్వెల మాధురి ఇలా చెప్పిందేంటి?, అంటే అబద్దం చెప్పిందా అనే అనుమానం కలిగింది. ఇప్పుడు రీతూ చౌదరి తల్లి కూడా ఇలా చెప్పడం తో దివ్వెల మాధురి అబద్దాల పుట్ట అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
