Devotional Tips: సాధారణంగా కొన్ని సందర్భాలలో ఇతరుల అవసరాల కోసం మన దగ్గర డబ్బులు కొంత అప్పుగా తీసుకుంటారు. ఇలా అప్పుగా ఇచ్చిన డబ్బులు ఎన్ని రోజులకు మనకు తిరిగి చెల్లించరు. కాళ్లకు చెప్పులు అరిగేలా వారి ఇంటి చుట్టూ తిరిగిన అప్పులు వసూలు కావు.ఈ క్రమంలోనే కొందరు ఆ డబ్బు గురించి ఆలోచించడం మర్చిపోగా మరి కొందరు మాత్రం ఎలాగైనా డబ్బులు తిరిగి తీసుకోవాలని భావిస్తుంటారు.ఈ విధంగా ఇచ్చిన అప్పులు తిరిగి వసూలు కాకపోతే ఈ ఆలయానికి వెళ్లి స్వామివారిని దర్శించుకుంటే అప్పులు వసూలు అవుతాయని ప్రజల నమ్మకం. మరి ఆలయం ఎక్కడ ఉందో తెలుసుకుందాం…
Also Read: ఉప్పెనలా వచ్చిన ఉద్యోగులు..చేతులెత్తేసిన పోలీసులు
షిమోగా జిల్లాలోని తీర్థహళ్లి తాలూకాలోని శరావతి నదికి మూలమైన అంబుతీర్థలో ఈ ఆలయం ఉంది. ఈ ఆలయంలో కొలువై ఉన్న అమ్మవారిని రక్త చాముండి అని కొలుస్తారు.చాలాకాలం క్రితం తన తల్లికి రక్తం త్యాగం చేయడం వల్ల ఈ అమ్మవారికి ఈ పేరు రావడమే కాకుండా ఈ ఆలయాన్ని రక్త చాముండి ఆలయం అని పిలుస్తారు. ఈ ఆలయానికి వెళ్లి మనం ఎవరికైతే డబ్బు ఇచ్చామో మనకు తిరిగి చెల్లించకపోతే వారి పేర్లను తెలియజేయాలి. ఇలా చెప్పిన వెంటనే ఆలయ అధికారులు వారికి నోటీసులు పంపిస్తారు. మొదటిసారి నోటీసులు పంపగానే చాలా మంది తిరిగి డబ్బులు చెల్లిస్తారు.
ఇలా మూడు సార్లు నోటీసులు పంపినా డబ్బు తిరిగి చెల్లించకపోతే వారు చాముండీ దేవి ఆగ్రహానికి బలై పోతారని అమ్మ వారి ఆగ్రహానికి గురి అయితే ఎన్నో కష్టాలను ఎదుర్కోవలసి ఉంటుంది కనుక చాలా మంది తిరిగి తీసుకున్న అప్పును చెల్లిస్తారని చెబుతారు.కేవలం అప్పులు మాత్రమే కాకుండా సంతానం లేనివారు కూడా ఈ ఆలయాన్ని దర్శించి అమ్మవారిని నమస్కరించడం వల్ల సంతాన భాగ్యం కలుగుతుందని ప్రజలు పెద్ద ఎత్తున నమ్ముతారు.
Also Read: సీఎం కేసీఆర్ వేయబోయే ‘మంత్రం’ అదేనా?