Tollywood Actors: ఒక సినిమా అద్భుతమైన విజయం సాధించింది అనగానే.. ఆ సినిమాకి సీక్వెల్ చేస్తే ఎలా ఉంటుంది ? అనే చర్చ సినిమా ఇండస్ట్రీలో మేకర్స్ మధ్య నిత్యం జరుగుతూ ఉంటుంది. దీనికి తోడు బాహుబలి, పుష్ప లాంటి చిత్రాలు మంచి ఉదాహరణగా నిలుస్తాయి. అందుకే.. సీక్వెల్ అనేది వర్కౌట్ కానీ ఐటమ్ అని ఎన్నిసార్లు ప్రూవ్ అయినా.. దర్శకనిర్మాతలకు మాత్రం జ్ఞానోదయం కాదు.
ఆల్ రెడీ సినిమా ఇండస్ట్రీలో కొన్ని సినిమాలు రెండు భాగాలుగా తెరకెక్కి డిజాస్టర్లుగా నిలిచాయి. భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆ చిత్రాలు అతి పెద్ద ప్లాప్ చిత్రాలుగా నిలిచాయి. వాస్తవానికి ఇటీవల ఈ తరహా సీక్వెల్స్ మరీ ఎక్కువ అయిపోయాయి. సహజంగానే ఒక సినిమా మొదటి భాగం అద్భుతమైన విజయం సాధిస్తే.. రెండవ భాగం పై ప్రేక్షకుల్లో మరింతగా అంచనాలు పెరుగుతాయి.
భారీ ఓపెనింగ్స్ వస్తాయి. అలాగే ఆ సినిమాకు బిజినెస్ కూడా భారీ స్థాయిలో జరుగుతుంది. పైగా సినిమాను జనంలోకి తీసుకువెళ్ళడానికి ఎక్కువ కష్టపడాల్సిన పని లేదు. అందుకే, మేకర్స్ లో సీక్వెల్ కి ఎక్కువ డిమాండ్ ఉంది. అయితే విచిత్రంగా ఇప్పటివరకు తెలుగులో వచ్చిన సీక్వెల్స్ లో సక్సెస్ అయినవి చాలా తక్కువ శాతం. ముందుగా చెప్పుకున్నట్టు రాజమౌళి ‘బాహుబలి’ సిరీస్ తప్ప.. ఆ స్థాయిలో సక్సెస్ అయినవి లేవు.
అసలు సీక్వెల్ గా వచ్చిన ఏ సినిమా కూడా దాదాపుగా విజయం సాధించలేదు. పైగా టాలీవుడ్ లో గతంలో వచ్చిన పెద్ద సినిమాల సీక్వెల్స్ అన్నీ భారీ ఫెయిల్యూర్స్ గా నిలిచాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ తీసిన ‘గబ్బర్ సింగ్’ పెద్దవిజయం సాధించింది. బాబీ దర్శకత్వంలో ఆ సినిమాకు సీక్వెల్ గా వచ్చిన ‘సర్దార్ గబ్బర్ సింగ్’ బాక్సాఫీస్ వద్ద ఘోరంగా ఫెయిల్ అయింది.
Pawan Kalyan
ఇక అల్లు అర్హున్ హీరోగా సుకుమార్ తీసిన ఆర్య సినిమా భారీ విజయం సాధించింది. అయితే, ఆ సినిమాకు సీక్వెల్ గా వచ్చిన ఆర్య2 భారీ ప్లాప్ అయింది. ఇక కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ హీరోగా వచ్చిన ‘రఘువరన్ బిటెక్’ సినిమా మంచి విజయం సాధించింది. కానీ, ఈ సినిమాకు సీక్వెల్ గా వచ్చిన రఘువరన్ 2 మాత్రం భారీ డిజాస్టర్ గా నిలిచింది.
Allu Arjun
Also Read: పదేండ్ల క్రితం తెలుగు హీరోల రెమ్యునరేషన్లు ఎలా ఉన్నాయో తెలుసా..?
అలాగే రవితేజ హీరోగా సురేందర్ రెడ్డి తీసిన ‘కిక్’ సినిమా ఏ స్థాయి విజయం సాధించిందో కొత్తగా చెప్పక్కర్లేదు. కానీ, దానికి సీక్వెల్ గా వచ్చిన ‘కిక్ ‘2’ మాత్రం ఘోరంగా ప్లాప్ అయింది. అందుకే బ్లాక్ బస్టర్ సినిమాలకు సీక్వెల్స్ తీయకుండా ఉడటమే మంచిది.
Ravi Teja
Also Read: షాకింగ్ : పాతిక సౌత్ సినిమాలను రీమేక్ చేస్తున్న బాలీవుడ్ !
అసలు దర్శకనిర్మాతలు సీక్వెల్స్ పై ఉత్సాహం చూపించినా పవన్, బన్నీ, రవితేజ, ధనుష్.. ఆ పొరపాటు చేయకుండా ఉండాల్సింది.
Dhanush