IRCON Recruitment 2022: ఇర్కాన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. 40 అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ నుంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజైంది. ఈ ఉద్యోగ ఖాళీలలో అసిస్టెంట్ మేనేజర్ (సివిల్) ఉద్యోగ ఖాళీలు 20 ఉండగా ఎగ్జిక్యూటివ్ (సివిల్) ఉద్యోగ ఖాళీలు 20 ఉన్నాయి. భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వశాఖకు సంబంధించిన ఈ సంస్థ వేర్వేరు ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం సిద్ధమైంది.
సివిల్ ఇంజనీరింగ్‌లో గ్రాడ్యుయేషన్ కనీసం 75 శాతం మార్కులతో పూర్తి చేసిన వాళ్లు అసిస్టెంట్ మేనేజర్ (సివిల్) ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవాలి. ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే వాళ్లకు పనిలో అనుభవం తప్పనిసరిగా ఉండాలి. 30 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు మాత్రమే ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హత కలిగి ఉంటారని చెప్పవచ్చు. ఎగ్జిక్యూటివ్ (సివిల్) ఉద్యోగ ఖాళీలు 20 ఉండగా 60 శాతం మార్కులతో సివిల్ ఇంజనీరింగ్ పాసైన వాళ్లు ఈ ఉద్యోగాలకు అర్హులు.
Also Read: కేసీఆర్ సార్ మేడారం రాకపోయే.. విమర్శల జడివాన మొదలాయే!
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే వాళ్లకు సంబంధిత పనిలో మూడేళ్ల అనుభవం ఉండాలి. ఈ ఉద్యోగ ఖాళీలకు కూడా 30 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు మాత్రమే అర్హతను కలిగి ఉంటారని చెప్పవచ్చు. అసిస్టెంట్ మేనేజర్ (సివిల్) ఉద్యోగ ఖాళీలకు 40,000 రూపాయల నుంచి 1,40,000 రూపాయల వరకు వేతనంగా ఉండగా ఎగ్జిక్యూటివ్ (సివిల్) ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు 30,000 రూపాయల నుంచి 1,20,000 రూపాయల వరకు వేతనం లభిస్తుంది.
జనరల్ అభ్యర్ధులకు 300 రూపాయలు దరఖాస్తు ఫీజు కాగా ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్ధులకు దరఖాస్తు ఫీజులో మినహాయింపు ఉంటుంది. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ జరగనుంది. 2022 సంవత్సరం మార్చి 8వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు చివరి తేదీగా ఉండగా https://www.ircon.org/index.php?lang=en లింక్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
Also Read: యాదాద్రి మహాయాగం వాయిదాకు కారణాలేంటి?
Recommended Video: