Star Hero sons: మహేష్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ కుమారుల్లో ఎవరు బెస్ట్ హీరో కాగలరు? ఆ సామర్థ్యం ఎవరికుంది? 

Star Hero sons: తెలుగు సినిమా ఇండస్ట్రీలో అగ్రహీరోలుగా మహేష్ బాబు, అల్లు అర్జున్ , ఎన్టీఆర్ లు కొనసాగుతున్నారు. వారు నట వారసత్వం నుంచే వచ్చారు. కృష్ణ నుంచి మహేష్, సీనియర్ ఎన్టీఆర్ నుంచి జూనియర్.. చిరంజీవి అల్లుడిగా బన్నీ ఇండస్ట్రీలో స్థిరపడ్డారు. తమదైన ప్రతిభతో ఇండస్ట్రీలో టాప్ హీరోల స్థాయికి ఎదిగారు. అలా ఎదగడంలో ఎన్నో కష్టనష్టాలకు ఓర్చారు. అయితే ఇప్పుడు వీరి వారసులు కూడా అప్పుడే సినిమాల్లోకి వచ్చేస్తున్నారు. మహేష్ బాబు కుమారుడు ‘1 […]

Written By: NARESH, Updated On : February 19, 2022 12:26 pm
Follow us on

Star Hero sons: తెలుగు సినిమా ఇండస్ట్రీలో అగ్రహీరోలుగా మహేష్ బాబు, అల్లు అర్జున్ , ఎన్టీఆర్ లు కొనసాగుతున్నారు. వారు నట వారసత్వం నుంచే వచ్చారు. కృష్ణ నుంచి మహేష్, సీనియర్ ఎన్టీఆర్ నుంచి జూనియర్.. చిరంజీవి అల్లుడిగా బన్నీ ఇండస్ట్రీలో స్థిరపడ్డారు. తమదైన ప్రతిభతో ఇండస్ట్రీలో టాప్ హీరోల స్థాయికి ఎదిగారు. అలా ఎదగడంలో ఎన్నో కష్టనష్టాలకు ఓర్చారు.

అయితే ఇప్పుడు వీరి వారసులు కూడా అప్పుడే సినిమాల్లోకి వచ్చేస్తున్నారు. మహేష్ బాబు కుమారుడు ‘1 నేనొక్కడినే’ సినిమాలో చిన్నప్పటి మహేష్ పాత్రలో మెరిసాడు. ఇక బన్నీ కొడుకు సోషల్ మీడియాలో , చిన్నచిన్న షార్ట్ వీడియోల్లో నటిస్తూనే ఉన్నాడు. కూతురు ఆల్ రెడీ ‘శాకుంతలం’లో నటించింది కూడా. ఇక ఎన్టీఆర్ కు ఇద్దరు కుమారులు. వాళ్లు పెద్దగా బయటకు రారు. సోషల్ మీడియాలోనూ కనిపించరు. ఎందుకో ఎన్టీఆర్ వారిని దాచేస్తున్నాడు. బయటి ప్రపంచానికి దూరంగా పెంచుతున్నారు.

Also Read:  వైఎస్ వివేకా హత్య: టీడీపీలో చేరేందుకు ఆయన కూతురు రెడీ అయ్యిందా?

ఈ ముగ్గురు స్టార్ హీరోల్లో ముందుగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చేది మహేష్ కుమారుడు ‘గౌతమ్’ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆల్ రెడీ ఓ సినిమాలో నటించాడు కాబట్టి. పైగా మహేష్ బాబు లాగానే అందం, చందం, హైట్ కలిగి ఉన్నాడు. ఇక బన్నీ కుమారుడు ప్రస్తుతానికి చిన్న పిల్లాడుగానే ఉండడంతో మరికొన్నేళ్లలో ఇండస్ట్రీలోకి రావచ్చు. ఎన్టీఆర్ పిల్లలు మరీ చిన్నపిల్లలు కావడం.. ఆయన బయటకు ఫోకస్ చేయకపోవడంతో వారి సీనీ ఎంట్రీకి ఇంకా చాలా సమయం ఉందని చెప్పొచ్చు.

Also Read:  నేడు జగ్గారెడ్డి రాజీనామా? కాంగ్రెస్ కు షాక్?

ముగ్గురు స్టార్ హీరోల కిడ్స్ హీరో మెటిరియల్ అని చెప్పొచ్చు. ఇందులో మహేష్ , బన్నీ కుమారులకు సినీ సాన్నిహిత్యంతో కాస్త యాక్టివ్ రోల్ పోషిస్తున్నారు. వారు హీరోలుగా రాణించడం ఖాయం. కానీ ఎన్టీఆర్ కుమారులు మాత్రం ఇప్పటిదాకా సినీ ప్రపంచంతో సంబంధం లేనట్టుగా పెంచుతున్నారు. వారి వీడియోలు కూడా బయటకు పెద్దగా రావడం లేదు. బహుశా పెద్దయ్యాక వారిని ఎన్టీఆర్ సినిమాల్లోకి తీసుకొచ్చే ఛాన్స్ ఉంది. మహేష్ , బన్నీ, ఎన్టీఆర్ నటవారసత్వాన్ని ముందుకు తీసుకుపోవడంలో ముగ్గురూ ముగ్గురే అని చెప్పొచ్చు.

Also Read: ఆ హీరోయిన్ని కమిట్‌మెంట్ అడిగిన తెలుగు హీరోలు