IPL Auction 2023 Sunrisers Hyderabad: ఐపీఎల్ మినీ వేలంలో అన్ని జట్లు అల్ రౌండర్ల వెంటపడుతుంటే మన ఘనత వహించిన సన్ రైజర్స్ మాత్రం బ్యాటర్లు, స్పిన్నర్ల వెంట పడింది. దిగ్గజ ఆల్ రౌండర్లను గాలికి వదిలేసి చేతులు కాల్చుకున్న సన్ రైజర్స్ హైదరాబాద్.. వేలంలో ఈరోజు మంచి స్పిన్నర్లను మాత్రం కొనుగోలు చేసింది.

ఐపీఎల్ వేలంలో పంజాబ్, హైదరాబాద్ వద్దే భారీగా డబ్బు ఉంది. హైదరాబాద్ వద్ద 42 కోట్లు ఉంటే పంజాబ్ వద్ద 32 కోట్లు.. మిగతా అన్నింటి వద్ద 20 కోట్లలోపే. అలాంటి జట్లు మేటి ఆల్ రౌండర్లను కొంటుంటే సన్ రైజర్స్ హైదరాబాద్ వదిలేసి బ్యాటర్లు, స్పిన్నర్లకు ప్రాధాన్యతనిచ్చింది. హైదరాబాద్ ఓనర్ కావ్య పాప వేలానికి ఇప్పుడు సన్ రైజర్స్ కు కెప్టెన్ కూడా లేకుండా పోయారు. బెన్ స్టోక్స్ ను కొనుగోలు చేయలేక చతికిలపడింది.
ఇంగ్లండ్ తరుఫున బెస్ట్ స్పిన్నర్ గా ఉన్న అదిల్ రషీద్ ను సన్ రైజర్స్ కొనుగోలు చేసింది. అతడు ఇటీవల టీ20 వరల్డ్ కప్ లో అద్భుత ప్రదర్శన చేశాడు.రన్స్ కట్టడి చేసి వికెట్లు అందించాడు. భీకర ఫాంలో ఉన్న మన సూర్యకుమార్ యాదవ్ ను కూడా అదీల్ రషీద్ ఔట్ చేశాడు. మంచి రిస్ట్రీ స్పిన్నర్ గా పేరుంది.

అలాగే దేశవాళీలో అదరగొడుతున్న యువ స్పిన్నర్ మాయాంక్ మార్కండేను సైతం హైదరాబాద్ కొనుగోలు చేసింది. ఇతడు రంజీ, విజయ్ హాజరే, అంతకుముందు ఐపీఎల్ లో కూడా బాగా రాణించాడు. వీరిద్దరి బౌలింగ్ లో ఆడడం ప్రత్యర్థులకు సవాలే. అనుభవానికి, ఆటకు, యువకులకు ప్రాధాన్యతనిచ్చింది హైదరాబాద్. ఈ కొనుగోళ్లను చూస్తే తక్కువ ధరలో మెరుగైన ఆటగాళ్లను కొన్నట్టు అర్థమవుతోంది.