Kaikala Satyanarayana: మన సినీ పరిశ్రమ లో కొంతమంది నటీనటులు భౌతికంగా మన మధ్య ఉన్నా లేకపోయినా తెలుగోడు బ్రతికి ఉన్నంత వరకు గుర్తుండిపోతారు..ఎందుకంటే వాళ్ళు పోషిచిన పాత్రల ద్వారా కోట్లాది మంది ప్రేక్షకుల హృదయాల్లో వేసుకున్న చిరస్థాయి ముద్ర అలాంటిది..అలాంటి మహానటులలో ఒకరు కైకాల సత్యనారాయణ..87 ఏళ్ళ వయస్సు గల కైకాల సత్యనారాయణ, సినిమా కోసం 65 ఏళ్ళ విలువైన సమయాన్ని వెచ్చించారు..పౌరాణికం నుండి జానపదం వరకు..కుటుంబ కథా చిత్రాల నుండి..కమర్షియల్ మాస్ సినిమాల వరకు.

కైకాల సత్యనారాయణ పోషించని పాత్ర అంటూ ఏది మిగిలి లేదు..ఎస్ వీ రంగారావు తర్వాత ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో అన్నీ రకాల పాత్రలు పోషించిన ఏకైక నటుడు కైకాల సత్యనారాయణ మాత్రమే..కేవలం తెలుగు సినిమా పరిశ్రమకి మాత్రమే కాదు..యావత్తు భారతదేశ చలనచిత్ర పరిశ్రమకి గర్వకారణం వంటి వారు సత్యనారాయణ..అలంటి మహానటుడు నేడు కన్నుముయ్యడం యావత్తు సినీ లోకాన్ని శోకసంద్రం లోకి నెట్టేసింది..సినీ రంగం లో ఆయన చూడని శిఖరాలు మిగిలి లేదు..అలాగే రాజకీయ రంగం లో కూడా తెలుగు దేశం పార్టీ తరుపున ఎంపీ గా పోటీ గెలుపొందాడు.
అటువంటి సుదీర్ఘ సినీ ప్రస్థానం ఉన్న కైకాల సత్యనారాణయన కి ఇప్పటి వరకు పద్మశ్రీ అవార్డు దక్కకపోవడం అనేది సినీ పరిశ్రమకి అవమానకరం వంటిది..కేంద్రం లో ఇన్ని దశాబ్దాలుగా ఎన్నో ప్రభుత్వాలు మారాయి..కానీ ఒక్క ప్రభుత్వం కూడా ఈ మేలిమి బంగారం ని గుర్తించి ‘పద్మశ్రీ’ పురస్కారం ఎందుకు ఇవ్వలేదో ఇప్పటికీ అంతు చిక్కని ప్రశ్న..మన రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఏనాడు అందుకోసం కృషి చెయ్యలేదు.

కైకాల సత్యనారాయణ తెలుగు దేశం పార్టీ నుండే పోటీ చేసాడు..కానీ ఆ పార్టీ అధికారం లోకి వచ్చినప్పుడు కూడా కైకాల సత్యనారాయణ కి పద్మశ్రీ పురస్కారం ఇప్పించేందుకు ఏ మాత్రం కృషి చెయ్యలేదు..ఎందుకు ఈ మహానటుడు పట్ల ఇంత నిర్లక్ష్యం అంటూ సినీ పరిశ్రమకి చెందిన కొంతమంది ప్రముఖులు వాపోతున్నారు..బ్రతికి ఉన్నప్పుడు ఎలాగో గుర్తించలేదు..కనీసం ఇప్పుడైనా సత్యనారాయణ కి పద్మశ్రీ పురస్కారం ఇస్తారో లేదో చూడాలి.