Internet revolution : ప్రస్తుతం అంతా ఇంటర్నెట్ యుగం. తిండి, నీళ్లు లేకపోయినా ఒకటి రెండు రోజులు ఉంటామెమోగానీ, ఇంటర్నెట్ లేకుండా పూట కూడా గడవని పరిస్థితి. ఇలాంటి రోజుల్లో 2జీ స్పీడ్‌తో మొదలైన ఇంటర్నెట్ విప్లవం ఇప్పుడు 5జీ స్పీడ్‌కు చేరుకుంది. రాబోయే రోజుల్లో 6జీ కోసం కసరత్తు జరుగుతోంది. ఇలాంటి తరుణంలో జపాన్ మరోసారి సాంకేతిక ఆవిష్కరణలో తన ఆధిపత్యాన్ని చాటుకుంది. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ స్పీడ్‌ను సాధించి రికార్డు సృష్టించింది. సెకనుకు 1.02 పెటాబిట్స్ (1.02 మిలియన్ గిగాబైట్స్) వేగంతో డేటాను ట్రాన్స్‌ఫర్ చేసిన ఈ ఘనత, డిజిటల్ యుగంలో ఒక కొత్త అధ్యాయాన్ని తెరిచింది. ఈ వేగం నెట్‌ఫ్లిక్స్ లైబ్రరీ మొత్తాన్ని ఒక్క సెకనులో డౌన్‌లోడ్ చేయగలదు. ఇది భవిష్యత్ టెలికాం సాంకేతికతకు ఒక సంచలనాత్మక ముందడుగు.
రికార్డు సృష్టించిన టెక్నాలజీ..
జపాన్‌లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్స్ టెక్నాలజీ పరిశోధకులు 19–కోర్ ఆప్టికల్ ఫైబర్ టెక్నాలజీని ఉపయోగించి 1,808 కిలోమీటర్ల దూరంలో 1.02 పెటాబిట్స్/సెకను వేగాన్ని సాధించారు. ఈ వేగం సాధారణ ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్‌తో సాధ్యమైంది. ఇది ప్రస్తుత ఇంటర్నెట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌తో అనుకూలంగా ఉంటుంది. ఈ వేగంతో, 150 GB సైజు వీడియో గేమ్ లేదా నెట్‌ఫ్లిక్స్ లైబ్రరీ మొత్తం క్షణాల్లో డౌన్‌లోడ్ అవుతుంది.
Also Read : ప్రపంచంలో అత్యధిక దేశాలు గౌరవించిన దేశాధినేత మోడీ
ఊహించలేని స్పీడ్..
1.02 పెటాబిట్స్/సెకను వేగం అంటే సెకనుకు 1,020,000 గిగాబైట్స్ డేటా ట్రాన్స్‌ఫర్. దీనితో ఒక్క సెకనులో స్టీమ్‌లోని మొత్తం వీడియో గేమ్‌లు (సుమారు 1.2 పెటాబైట్స్) డౌన్‌లోడ్ అవుతాయి. లేదా 10 మిలియన్ 8K వీడియోలను ఏకకాలంలో స్ట్రీమ్ చేయవచ్చు. భారతదేశంలో సగటు ఇంటర్నెట్ వేగం (63.55 Mbps)తో పోలిస్తే, ఈ వేగం 16 మిలియన్ రెట్లు వేగవంతమైనది. అమెరికా సగటు వేగంతో పోలిస్తే 3.5 మిలియన్ రెట్లు వేగవంతమైనది.
రికార్డు స్పీడ్ ఇంటర్నెట్ ఇలా..
ఈ రికార్డు సాధించడానికి జపాన్ పరిశోధకులు 19–కోర్ ఆప్టికల్ ఫైబర్‌ను ఉపయోగించారు. ఇది సాధారణ ఫైబర్ కేబుల్‌ల వ్యాసం (0.125 మిమీ)తో అనుకూలంగా ఉంటుంది. ఈ ఫైబర్ 19 వేర్వేరు కోర్‌ల ద్వారా డేటాను సమాంతరంగా ట్రాన్స్‌మిట్ చేస్తుంది. అధునాతన సిగ్నల్ ప్రాసెసింగ్ టెక్నిక్‌లతో దీర్ఘ దూరంలో సిగ్నల్ బలహీనతను నివారిస్తుంది. ఈ సాంకేతికత O, E, S, C, L, U బ్యాండ్‌లను ఉపయోగించి బ్యాండ్‌విడ్త్‌ను విస్తరించింది.
Also Read: ఇండియా ను దోచెయ్యడానికి సిద్దమవుతున్న ఎలాన్ మస్క్!
ఏఐ, 6జీ, స్మార్ట్ సిటీలు..
ఈ అతి వేగవంతమైన ఇంటర్నెట్ స్పీడ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, 6జీ నెట్‌వర్క్‌లు, స్మార్ట్ సిటీల అభివృద్ధికి ఊతం ఇస్తుంది. ఈ వేగంతో రియల్–టైమ్ ఏఐ ప్రాసెసింగ్, ఆటోనమస్ వాహనాలు, రిమోట్ సర్జరీలు, స్మార్ట్ సిటీలలో ట్రాఫిక్, ఎనర్జీ నిర్వహణ వంటి అప్లికేషన్‌లు సమర్థవంతంగా పనిచేయగలవు.