Cheating wife hotel room: భర్త మీద భార్యకు ప్రేమ ఉండడం లేదు. భార్య మీద భర్తకు ఇష్టం ఉండడం లేదు. మొత్తంగా ఒక ఇంట్లో ఉంటున్నా వేరువేరు జీవితాలు.. ఒకే ఇంటి పేరు మోస్తున్నా రకరకాల వ్యక్తిత్వాలు.. అందుకే అలాంటి సంసారాలలో మూడో వ్యక్తి ప్రవేశిస్తున్నాడు. అవాంచిత సంబంధాలకు కారణం అవుతున్నాడు. ఆ తర్వాత సంసారాలు సర్వనాశనం అవుతున్నాయి. లేనిపోని గొడవలు జరిగి కుటుంబాలు కూలిపోతున్నాయి. అంతిమంగా ఇటువంటి సంబంధాలు పెడ పోకడలకు కారణమవుతున్నాయి.. ఇటువంటి సంఘటనలు ఇటీవల కాలంలో ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. సోషల్ మీడియా ద్వారా ఇటువంటి ఘటనలు ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయి. అటువంటి ఘటన ఒకటి ఇటీవల చోటు చేసుకుంది. సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి వచ్చింది.
సోషల్ మీడియాలో కనిపిస్తున్న వీడియో ప్రకారం ఓ మహిళ దుస్తులు సర్దుకుంటూ.. చెదిరిన చుట్టుతో హోటల్ రూమ్ నుంచి బయటికి వచ్చింది. మెట్ల మార్గం నుంచి కాకుండా వెనుక వైపు నుంచి వెళ్లిపోయింది. పైగా ఆమె అత్యంత ఆందోళనతో కనిపించింది. ఆమె వేసిన ప్రతి అడుగు కూడా తనలో ఉన్న భయాన్ని ప్రతిబింబించింది. వాస్తవానికి ఆమె అలా ఎందుకు చేసిందో ఎవరికీ అర్థం కాలేదు. ఆ మహిళ అలా వెళ్ళిపోతుండగా కొందరు వ్యక్తులు అనుసరించారు. అందులో ఒక వ్యక్తి ముందు భాగంలో ఉన్నాడు. చాలాసేపటి వరకు అక్కడ ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కాలేదు. చివరికి అదంతా కూడా ఒక రకమైన వ్యవహారం అని తెలిసింది .
Also Read: కూల్ వాతావరణంలో హీట్ పెంచుతున్న సాక్షి మాలిక్
ఆ మహిళకు గతంలోనే వివాహం జరిగింది. భర్త, పిల్లలు ఉన్నారు. అయినప్పటికీ ఆమె భర్తను పక్కనపెట్టి వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగించడం మొదలుపెట్టింది. మొదట్లో ఆమె వ్యవహారంపై భర్తకు అనుమానం రాలేదు. తరచూ ఫోన్ మాట్లాడుతూ ఉండడం.. ఆమె ప్రవర్తనలో తేడా ఉండడంతో భర్తకు అనుమానం మొదలైంది. ఆ తర్వాత ఆమెను అనుసరించాడు. చివరికి తను చూడకూడని ఘటన చూశాడు..
ఆ మహిళ తన ప్రియుడితో కలిసి హోటల్ రూమ్ లోకి వచ్చింది. అక్కడ అతడితో సరస కార్యకలాపాలలో మునిగి తేలడం మొదలుపెట్టింది. ఆమెను అనుసరించిన భర్త పోలీసుల సహాయంతో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకునేందుకు వెళ్లాడు. డోర్ కొట్టగానే ఆమెకు భయం వేసింది. వెంటనే చాకచక్యంగా అక్కడి నుంచి తప్పించుకుంది. ఈ వ్యవహారం మొత్తాన్ని భర్త తరఫునుంచి వచ్చిన వారు వీడియో తీశారు. ఆ వీడియోని కాస్త సోషల్ మీడియాలో పెట్టారు.
Also Read: ట్రెండ్ మార్చిన యాంకర్ స్రవంతి… లంగా ఓణీలో కొంటె ఫోజులు! వైరల్ ఫోటోలు
నేటి కాలంలో ఇటువంటి బంధాలు పెరిగిపోతున్నాయి. ఇటువంటి వ్యవహారాల వల్ల సంసారాలు కుప్ప కూలిపోతున్నాయి. చివరికి ఈ ఘటనల వల్ల ప్రాణ నష్టం కూడా సంభవిస్తున్నది. ఇటువంటి వ్యవహారాలలో దేశ సర్వోన్నత న్యాయస్థానం కూడా విభిన్నమైన తీర్పులు ఇచ్చిన నేపథ్యంలో.. ఈ తరహా ఘటనలపై నమోదైన కేసులు నిలబడటం లేదు. అందువల్లే ఇటువంటి వ్యవహారాలు పెరిగిపోతున్నాయి.. వివాహేతర సంబంధాల వల్ల జరగకూడని దారుణాలు జరిగి పిల్లలు ఆగమైపోతున్నారు. తల్లిదండ్రులు చేసిన దారుణాల వల్ల పిల్లలు నరకం చూస్తున్నారు. అందువల్ల ఇటువంటి సంబంధాలు నెరపకూడదు. జరపకూడదు.
భార్యాభర్తల మధ్య ఏవైనా విభేదాలు ఉంటే పరిష్కరించుకోవాలి. సమస్యలుంటే మాట్లాడుకోవాలి. అంతకుమించి కనుక ఏమైనా ఉంటే పెద్ద సమక్షంలో మాట్లాడి వాటిని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. అంతేతప్ప ఇటువంటి అనైతికమైన బంధాలకు పాల్పడి ప్రాణాల దాకా తీసుకురావద్దు. అన్నింటికీ మించి కుటుంబ బంధాలను సర్వనాశనం చేసుకోవద్దు. భర్త లేకుండా భార్య ఉంటుంది. భార్య లేకుండా భర్త ఉంటాడు. కానీ వీరిద్దరు లేకుండా పిల్లలు ఉండలేరు. ఆ విషయం గమనిస్తే కుటుంబాలు బలంగా ఉంటాయి. సంసారాలు ఆనందంగా సాగిపోతుంటాయి.
She was in an OYO with her lover.
Her husband arrived there with their kids and caught her red-handed. After that, she ran away.
What is happening in society these days?
pic.twitter.com/Tf9RdZzB0L— ︎ ︎venom (@venom1s) July 10, 2025