https://oktelugu.com/

Marriage: ఆ విషయంలో ప్రతి ఒక్కరూ మనసు చెప్పింది వినాల్సిందే..?

Marriage: సాధారణంగా ఒక అమ్మాయి తన చదువు, ఉద్యోగం,అన్ని విషయాలలో తన నిర్ణయం తాను తీసుకున్న ఒక పెళ్లి విషయంలో మాత్రం తన నిర్ణయాన్ని తన తల్లిదండ్రులకు వదిలేస్తుంది. అందుకు గల కారణం తల్లిదండ్రులకు ఇచ్చే గౌరవం అని చెప్పవచ్చు.అయితే పెళ్ళి విషయంలో పూర్తి బాధ్యత తల్లిదండ్రులకు మాత్రమే కాకుండా పెళ్లి విషయంలో తన అభిప్రాయాలను తన నిర్ణయాలను కూడా తల్లిదండ్రులతో పంచుకోవడం ఎంతో ఉత్తమం కనుక పెళ్లి విషయంలో ప్రతి ఒక్క అమ్మాయి తన మనసులో […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : December 2, 2021 / 10:44 AM IST
    Follow us on

    Marriage: సాధారణంగా ఒక అమ్మాయి తన చదువు, ఉద్యోగం,అన్ని విషయాలలో తన నిర్ణయం తాను తీసుకున్న ఒక పెళ్లి విషయంలో మాత్రం తన నిర్ణయాన్ని తన తల్లిదండ్రులకు వదిలేస్తుంది. అందుకు గల కారణం తల్లిదండ్రులకు ఇచ్చే గౌరవం అని చెప్పవచ్చు.అయితే పెళ్ళి విషయంలో పూర్తి బాధ్యత తల్లిదండ్రులకు మాత్రమే కాకుండా పెళ్లి విషయంలో తన అభిప్రాయాలను తన నిర్ణయాలను కూడా తల్లిదండ్రులతో పంచుకోవడం ఎంతో ఉత్తమం కనుక పెళ్లి విషయంలో ప్రతి ఒక్క అమ్మాయి తన మనసులో ఉన్న భావాలను తల్లిదండ్రుల చెప్పాల్సి ఉంటుంది. తనకు ఏ విధమైనటువంటి అబ్బాయి కావాలనుకుంటున్నారు తను ఎలా ఉండాలి అనుకుంటున్నాను అన్న విషయాలను తప్పనిసరిగా చెప్పాల్సి ఉంటుంది.

    Marriage

    Also Read: పొరపాటున కూడా ఈ లక్షణాలు ఉన్న అబ్బాయిని పెళ్లి చేసుకోకండి.. ఏవంటే?

    ఈ మధ్యకాలంలో పెళ్లిచూపుల సమయంలో ప్రతి ఒక్క అమ్మాయి అబ్బాయి మాట్లాడుకోవడానికి తల్లిదండ్రులు ఏ మాత్రం అడ్డు చెప్పడం లేదు. ఇలా మాట్లాడుకునే సమయంలో ఆ వ్యక్తి స్వభావం ఎలా ఉంది అతని మాట తీరు అన్ని విషయాలను గమనించాలి. అతను ఏ విషయంపైనా నిలకడగా ఉండగలడా లేదంటే మాట మార్చడం అబద్ధాలు చెప్పడానికి ప్రయత్నించడం వంటివి చేస్తున్నారా అని గమనించి వెంటనే అతని స్వభావం తల్లిదండ్రుల వద్ద బయట పెట్టడం ఎంతో ఉత్తమం.

    పెళ్లి తర్వాత మారుతారు కదా అని అప్పటికప్పుడు మన మనసుని మార్చుకొని కళ్ళు మూసుకొని పెళ్లి చేసుకుంటే జీవితాంతం ఈ విషయాన్ని భరించడం ఎంతో కష్టం అందుకే పెళ్లికి ముందు ప్రతి ఒక్క అమ్మాయి తనకు కాబోయే వ్యక్తి విషయంలో తను మనసు చెప్పిన మాటను బయట పెట్టాలి. ఇలా తన భావాలు బయట పెట్టినప్పుడు తన జీవితం ఎంతో సంతోషంగా ఉంటుంది అని చెప్పవచ్చు.

    Also Read: సీతారామశాస్త్రి కొడుకు గురించి ఈ విషయాలు మీకు తెలుసా?