Allu Arjun: ఏపీ వరద బాధితులకు అండగా అల్లుఅర్జున్​.. భారీ విరాళం ప్రకటన

Allu Arjun: ఆంధ్రప్రదేశ్​లో గత వారం రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు.. చెరుపులు మునిగిపోయి.. కట్టలు తెగిపోయి పలు ప్రాంతాలు నీటమునిగాయి. వాహనాలు, ఇళ్లు కూడా కొట్టుకుపోయాయి. దీంతో ప్రజలు కూడా జీవనోపాధి కోల్పోయారు. కొంతమందికి కూడు, గూడు కూడా లేకూండా పోయాయి. అంతలా వరద ముంచెత్తింది. వీటన్నింటినీ తట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు. విప్పత్తు ప్రతిస్పందన దళం, మునిసిపాలిటీ కార్మికులు సహాయక చర్యల్లే భాగంగా 24 గంటలు పనిచేస్తున్నారు. My heart goes out […]

Written By: Raghava Rao Gara, Updated On : December 2, 2021 11:41 am
Follow us on

Allu Arjun: ఆంధ్రప్రదేశ్​లో గత వారం రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు.. చెరుపులు మునిగిపోయి.. కట్టలు తెగిపోయి పలు ప్రాంతాలు నీటమునిగాయి. వాహనాలు, ఇళ్లు కూడా కొట్టుకుపోయాయి. దీంతో ప్రజలు కూడా జీవనోపాధి కోల్పోయారు. కొంతమందికి కూడు, గూడు కూడా లేకూండా పోయాయి. అంతలా వరద ముంచెత్తింది. వీటన్నింటినీ తట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు. విప్పత్తు ప్రతిస్పందన దళం, మునిసిపాలిటీ కార్మికులు సహాయక చర్యల్లే భాగంగా 24 గంటలు పనిచేస్తున్నారు.

వర్షాల కారణంగా రైతుల పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. సాధారణంగా ప్రతి ఏటా జనవరికి వరి కాపు కాసి.. పంట చేతికొచ్చే సమయం.. అదే సమయంలో వర్షాలు రావడంతో.. పంట కోయకుండానే.. పూర్తిగా నాశనమైపోయింది. దీంతో రైతులు ఏం చేయలేని నిస్సహాయ స్థితిలోకి వెళ్లిపోయారు. కాగా, ఈ కష్టసమయాల్లో ప్రజలకు అండగా ఉండేందుకు సినీ ప్రముఖులు ఒక్కొక్కరుగా ముందుకు వస్తున్నారు. తాజాగా, అల్లు అర్జున్​ సీఎం రిలీఫ్ ఫండ్​కు 25 లక్షలు విరాళం అందించారు. ప్రజలు కష్టాల పాలవడ్డవం తన మనసును కలచివేసిందని.. వాళ్లకు తన తరఫున సాయం అందిస్తున్నట్లు ప్రకటించారు. నిన్ననే చిరు, జూనియర్​ ఎన్టీఆర్​, మహేశ్​బాబు, రామ్​చరణ్​ వంటి ప్రముఖులు వరసగా 25 లక్షలు విరాళం ప్రకటించారు.

Also Read: తప్పెవరిది? వరదసాయం కేంద్రం ముందే ఇచ్చిందట..! జగన్ సర్కార్ ఈ నిధులు ఏం చేసింది..?

Allu Arjun

కాగా, ఇటీవలే ఏపీ ప్రభుత్వం సినిమా టికెట్​ ధరల విషయంలో తీసుకున్న నిర్ణయంపై ప్రముఖ సెలెబ్రిటీలు, డర్శకులు స్పందించారు. వెంటనే టికెట్​ధరల తగ్గింపుపై తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు. ఈ నేపథ్యంలోనే ఏపీ ప్రభుత్వాన్ని కూల్​ చేయడం కోసమే ఇలా విరాళాలు ప్రకటింరాన్న వార్త వస్తోంది. మరోవైపు ఎప్పటినుంచే సినిమా వాళ్లు ఇలాంటి విపత్తు సమయాల్లో అండగా ఉన్నారు.. కాబట్టి.. అటువంటి ఆలోచనలు అనవసరమని కూడా అంటున్నారు.

Also Read: తూచ్ తొండాట.. చెడ్డపేరు జగన్ కు.. టిక్కెట్ల కాసులు మాత్రం సినీ పెద్దలకా?