Don’t Marry: పొరపాటున కూడా ఈ లక్షణాలు ఉన్న అబ్బాయిని పెళ్లి చేసుకోకండి.. ఏవంటే?

Don’t Marry: ప్రతి ఒక్క అమ్మాయి తనకు కాబోయే వాడు మిస్టర్ పర్ఫెక్ట్ అయి ఉండాలని భావిస్తారు. కానీ ఏ ఒక్కరూ కూడా మిస్టర్ పర్ఫెక్ట్ మాదిరి ఉండరు. ప్రతి వ్యక్తిలోనూ ఏవో ఒక చిన్న లోపం కనిపిస్తూనే ఉంటుంది. అయితే ఈ విధమైనటువంటి చిన్న చిన్న లోపాలు ప్రతి ఒక్కరిలో వుండడం సర్వసాధారణమే కానీ కొందరు కొన్ని విషయాలలో ఎంతో భిన్నంగా ఉంటారు. అలాంటి వారిని పెళ్లి చేసుకున్న జీవితాంతం ఎంతో బాధపడాల్సి ఉంటుంది. కనుక […]

Written By: Kusuma Aggunna, Updated On : December 2, 2021 1:18 pm
Follow us on

Don’t Marry: ప్రతి ఒక్క అమ్మాయి తనకు కాబోయే వాడు మిస్టర్ పర్ఫెక్ట్ అయి ఉండాలని భావిస్తారు. కానీ ఏ ఒక్కరూ కూడా మిస్టర్ పర్ఫెక్ట్ మాదిరి ఉండరు. ప్రతి వ్యక్తిలోనూ ఏవో ఒక చిన్న లోపం కనిపిస్తూనే ఉంటుంది. అయితే ఈ విధమైనటువంటి చిన్న చిన్న లోపాలు ప్రతి ఒక్కరిలో వుండడం సర్వసాధారణమే కానీ కొందరు కొన్ని విషయాలలో ఎంతో భిన్నంగా ఉంటారు. అలాంటి వారిని పెళ్లి చేసుకున్న జీవితాంతం ఎంతో బాధపడాల్సి ఉంటుంది. కనుక మీరు పెళ్లి చేసుకునే వ్యక్తులలో ఈ విధమైనటువంటి లక్షణాలు ఉంటే పొరపాటున కూడా పెళ్లి చేసుకోకండి… మరి ఆ లక్షణాలు ఏమిటి అనే విషయానికి వస్తే..

Don’t Marry

*మాట నిలబెట్టుకోకపోవడం: సాధారణంగా చాలామంది ఎంతో ధీమాతో కొన్ని విషయాలలో మాట నిలబెట్టుకోవడం కోసం ప్రామిస్ చేస్తుంటారు. అయితే మీరు ఆ మాటమీద నిలబడక ఇచ్చిన మాట తప్పుతారు. ఇలా మాటమాటికీ మాట నిలబెట్టుకో కపోవడం చేసిన ప్రామిస్ బ్రేక్ చేస్తున్న వారిని పెళ్లి చేసుకోకండి ఇలాంటి వారి వల్ల జీవితంలో తప్పనిసరిగా గొడవలు వస్తాయి.

*నియంత లక్షణాలు: కొందరు భార్యను ప్రేమగా చూసుకోవడం కన్నా వారిని తమ చెప్పుచేతల్లో పెట్టుకోవాలని చూస్తుంటారు. ఈ క్రమంలోనే వారికి నచ్చిన విధంగా నడుచుకోవడం, వారు చెప్పిన దుస్తులు ధరించడం, ఇలా ప్రతి విషయంలోనూ కంట్రోల్ చేసే వారిని పెళ్లి చేసుకోకండి.

*ప్రాధాన్యత ఇవ్వని వ్యక్తి: ఇద్దరి మధ్య మంచి రిలేషన్ ఉండాలంటే ఆ ఇద్దరు వ్యక్తుల మధ్య అన్ని విషయాల్లోనూ సమానత్వం ఉండాలి. మనం ఏదైనా ఒక వస్తువును ప్రేమగా ఇచ్చినప్పుడు అవతలి వ్యక్తి కూడా మనకు ప్రేమగా తిరిగి ఇచ్చినప్పుడే వారి మధ్య బంధం ఎంతో బాగుంటుంది అలా కాకుండా తీసుకోవడమే కానీ తిరిగి ఇచ్చే అలవాటు లేని వ్యక్తులతో జీవితం పంచుకుంటే ఎంతో కష్టంగా ఉంటుంది.

*పదే పదే క్షమాపణలు చెప్పడం: చాలామంది ప్రతి చిన్న విషయానికి పదేపదే క్షమాపణలు చెబుతూ ఉంటారు.ఈ విధమైనటువంటి అలవాటు ఉన్న వారు మంచి జీవిత భాగస్వామి కాలేరు కనుక ఇలాంటి వారిని పెళ్లి చేసుకోకండి.

Also Read: ఆ విషయంలో ప్రతి ఒక్కరూ మనసు చెప్పింది వినాల్సిందే..?

*అహంకారం: మనిషి అన్న తర్వాత తప్పకుండా వారిలో అహంకారం ఉంటుంది. అయితే ఈ అహంకారం హద్దు దాటినప్పుడు బంధాలు నిలకడగా ఉండవు. అందుకే అహంకారం ఉన్న వారిని పెళ్లి చేసుకోకపోవడమే మంచిది.

* అబద్దాలు చెప్పడం: సాధారణంగా కొందరికి ప్రతి చిన్న విషయానికి అబద్ధం చెప్పే అలవాటు ఉంటుంది. ఇలా అబద్ధాలు చెప్పే వారిని జీవిత భాగస్వామిగా చేసుకోవటం వల్ల వారు మన జీవితంలో ఎంతవరకు నమ్మశక్యంగా ఉండగలరో చెప్పలేము కనుక ఇలా అబద్ధాలు చెప్పే వారిని కూడా దూరంగా ఉంచడం ఉత్తమం.

Also Read: క్యాబేజీ కర్రీ చేస్తున్నప్పుడు ఈ పొరపాటు చేస్తే మాత్రం అనారోగ్యం పాలవ్వాల్సిందే?