https://oktelugu.com/

Girlfriend: మీ గర్ల ఫ్రెండ్ మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలి అనుకుంటే మీ నుంచి ఇవి ఆశిస్తుంది..

గౌరవం ఇవ్వాలి: సాధారణంగా మనిషికి గౌరవం ఇవ్వడం ముఖ్యం. ఎవరి నుంచి అయినా గౌరవం ఎక్స్ పెక్ట్ చేస్తారు అమ్మాయిలు. పెళ్లాయ్యాక కూడా భార్య అనే చిన్న చూపు లేకుండా భార్య మాటలకు వారి అభిప్రాయాలకు గౌరవం ఇవ్వాలి అనుకుంటారు.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : May 1, 2024 / 12:40 PM IST

    Girlfriend

    Follow us on

    Girlfriend: పెళ్లి అంటే ఇద్దరి వ్యక్తుల మధ్య ఒక జీవితం. వీరిద్దరు కలిసి ఉండాలా? విడిపోవాలా అనేది వారి ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుంది. ఎన్ని సమస్యలు వచ్చినా కలిసి ఉండాలి అనుకుంటే జీవితాంతం సంతోషంగా ఉంటారు. లేదంటే విడిపోతారు. అయితే ఒక అమ్మాయిలు తమకు కాబోయే భర్త నుంచి కొన్ని లక్షణాలను కోరుకుంటారు. మరి అమ్మాయిలు పెళ్లి వరకు వెళ్లాలి అంటే అబ్బాయిలకు ఉండాల్సిన లక్షణాలు ఏంటో ఓ సారి చూసేయండి.

    1.. గౌరవం ఇవ్వాలి: సాధారణంగా మనిషికి గౌరవం ఇవ్వడం ముఖ్యం. ఎవరి నుంచి అయినా గౌరవం ఎక్స్ పెక్ట్ చేస్తారు అమ్మాయిలు. పెళ్లాయ్యాక కూడా భార్య అనే చిన్న చూపు లేకుండా భార్య మాటలకు వారి అభిప్రాయాలకు గౌరవం ఇవ్వాలి అనుకుంటారు.

    2.. ఆర్థిక స్వాతంత్రం: ఒకవేళ భార్య ఉద్యోగం చేస్తే తన పనులు షేర్ చేసుకోవాలి అనుకుంటారు. తనను ఉద్యోగానికి వెళ్లడానికి ప్రోత్సహించాలి. ఇక అమ్మాయి ఉద్యోగం చేయకపోతే తన ఖర్చులకు కాస్త డబ్బులు ఇవ్వాలి. ఉద్యోగం చేయకపోయినా రెస్పెక్ట్ ఇవ్వాలి. వారి ఇష్టాఇష్టాలను గౌరవించాలి.

    3.. మద్దతు: కొన్ని సార్లు ఇంట్లో గొడవలు అవుతుంటాయి. భార్య మరొ ఇంటి నుంచి వస్తుంది కాబట్టి ఆమెను బయట అమ్మాయిలాగా అనుకోకుండా మద్దతు ఇవ్వాలి అనుకుంటారు. ఒకవేళ తప్పు చేస్తే బయట వారి ముందు అసలు అవమానించ కూడదు అనుకుంటారు.

    4.. అహంకారం.. అహంకారం ఎవరికి ఇష్టం ఉండదు. ఇక కాబోయే భర్తకు అలాంటి లక్షణం అసలు ఉండకూడదు అనుకుంటారు. ఇంటి పనుల్లో కూడా సహాయం చేసేంత మంచి మనసు ఉండాలి అనుకుంటారు అమ్మాయిలు.

    5.. అర్థం చేసుకోవడం.. ఏదైనా సమస్య వల్ల మానసికంగా బాధ పడుతుంటే వారిని అర్థం చేసుకోవాలి. ఏదైనా విషయంలో ఫీల్ అవుతుంటే వాళ్ల బాధను కొట్టి పడేయకుండా అర్థం చేసుకోవాలి. వారు ఏం చేస్తే తమ బాధ తీరుతుందో ఆ సమయంలో అలానే ఉండాలి. మానసికంగా బలహీనంగా ఉంటే బలం అందించాలి. చాలా మంది అమ్మాయిలు, భార్యలు భర్తల నుంచి ఎమోషనల్ సపోర్ట్ నే కోరుకుంటారు.

    ఈ విషయాలు అన్నీ కూడా ఒక అమ్మాయి అబ్బాయిని పెళ్లి చేసుకోవాలి అనుకోవడానికి ముఖ్యమైన లక్షణాలు. మరి మీకు ఇలాంటి లక్షణాలు లేకపోతే మీ గర్ల్ ఫ్రెండ్ మీతో పెళ్లి అనే విషయాన్ని ఆలోచించకపోవచ్చు. కాస్త మారండి అబ్బాయిలు. చిన్న జీవితం ఇద్దరు కలిసి ఆనందంగా ఉండండి..