spot_img
Homeటెలివిజన్‌Rashmi Gautam: మగాళ్లు మంచోళ్ళు అయితే మానభంగాలు జరగవు... సంచలనం రేపుతున్న యాంకర్ రష్మీ కామెంట్స్

Rashmi Gautam: మగాళ్లు మంచోళ్ళు అయితే మానభంగాలు జరగవు… సంచలనం రేపుతున్న యాంకర్ రష్మీ కామెంట్స్

Rashmi Gautam: తెలుగు టాప్ యాంకర్స్ లో రష్మీ గౌతమ్ ఒకరు. టాప్ రేటెడ్ షోలలో ఆమె యాంకర్ గా వ్యవహరిస్తోంది. అలాగే సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటుంది. గ్లామరస్ ఫోటో షూట్లు చేస్తూ ఆకట్టుకుంటుంది. అంతేకాదు రష్మీకి సామాజిక స్పృహ ఎక్కువ. మహిళలపై జరిగే అన్యాయాలు, అకృత్యాలపై ఆమె స్పందిస్తుంటారు. పైగా రష్మీ జంతు ప్రేమికురాలు. డాగ్స్ అంటే ఆమెకు చాలా ఇష్టం. జీవ హింసను రష్మీ వ్యతిరేకిస్తుంది.

కనీసం పాలు, పాల ఉత్పత్తులు కూడా ఆమె ముట్టుకోరు. పూర్తి వేగన్ గా మారిపోయారు. అయితే రష్మీ మహిళల భద్రత, జంతు సంరక్షణ పై చేసే పోస్టులు వివాదాస్పదం అవుతుంటాయి. ఆమెను కొందరు టార్గెట్ చేస్తూ ట్రోల్ చేస్తుంటారు. అలాంటి వారికి రష్మీ తన స్టైల్ లో కౌంటర్లు ఇస్తుంటుంది. తాజాగా రష్మీ చేసిన పోస్ట్ ఒకటి వైరల్ గా మారింది. రష్మీ ఆడవాళ్ళ గురించి ఓ సంచలన పోస్ట్ చేసింది.

తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీ ద్వారా ఈ విషయాన్ని పంచుకుంది రష్మీ. ప్రముఖ రైటర్ రాచెల్ మోరన్ రాసిన కోట్ ని షేర్ చేసింది. మహిళలు పేదరికంలో ఉండి ఆకలితో అలమటిస్తున్నపుడు మనిషిగా మనం వారికి చేయాల్సింది ఫుడ్ పెట్టాలి. లైంగికంగా వాడుకోవాలని చూడకూడదు, అనే అర్థంలో ఒక కోట్ రచెల్ మొరన్ రాసుకొచ్చింది. ఈ కోట్ స్క్రీన్ షాట్ రష్మీ షేర్ చేసింది. ఈ పోస్ట్ కి అనుసంధానంగా రష్మీ ఆసక్తికర కామెంట్ రాసుకొచ్చింది.

అసలు మగవాళ్ళు మంచివాళ్లైతే అసలు వ్యభిచారం ఉండదు. దాని మనుగడ ఉండదు అని రష్మీ తెలిపింది. మహిళల వ్యభిచారం, ఆకలి బాధలపై ఓ వేశ్య చెప్పిన మాటను ఇలా రష్మీ తన స్టోరీలో పంచుకుంది. ప్రస్తుతం ఇది సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. ప్రస్తుతం రష్మీ ఈటీవీలో జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ షోలు చేస్తుంది. అడపా దడపా సినిమాల్లో నటిస్తూ వెండితెరపై కూడా సందడి చేస్తుంది

Exit mobile version