Bike Mileage Tips: ప్రస్తుతం ప్రతి ఒక్కరి చేతిలో వాహనాలు ఉన్నాయి. సమాజంలో మార్పుతో పాటు ప్రతి ఒక్కరిలో మార్పు రావడంతో వాడే వస్తువులలో కూడా మార్పులు వచ్చాయి.
ఇక వాహనాల విషయంలో మాత్రం ప్రత్యేకంగా చెప్పనవసరమే లేదు. కొత్త మోడల్ వాహనాలు వస్తే చాలు వెంటనే కొనుగోలు చేస్తుంటారు. మైలేజీ పరంగా తక్కువగా ఉన్నా కూడా పెద్ద పెద్ద వాహనాలు కొంటారు. ఆ తర్వాత పెట్రోల్ ధర, డీజిల్ ధర పెరగడంతో ఇబ్బంది పడుతుంటారు.
Also Read: కొత్త సంవత్సరంలో ఈ రాశుల వారు చాలా జాగ్రత్తగా ఉండాలి.. లేదంటే ఇబ్బందులే!
కాబట్టి మీ వాహనం ఎక్కువ మైలేజీ ఇవ్వాలి అంటే కొన్ని టిప్స్ పాటిస్తే సరిపోతుంది. మీ వాహనంను ఎప్పటికప్పుడు సర్వీస్ చేయిస్తూ ఉండాలి. దీనివల్ల మైలేజీ పెరుగుతుంది. ఇక మంచి కండిషన్ లో ఉండటంవల్ల కూడా మైలేజీ సమస్య తక్కువగా ఉంటుంది. ఇంజిన్, గేర్ బాక్స్ లకు లూబ్రికేషన్ ఎప్పటికప్పుడు అవసరం ఉంటుంది. ముఖ్యంగా టైర్లలో గాలి ఎప్పుడూ ఉండే లా చూసుకోవాలి. అంతేకాకుండా కంపెనీ టైర్ లను మాత్రమే వాడాలి.
ఇక సిగ్నల్స్ వద్ద వాహనం ను ఆన్ లో ఉంచకుండా ఆఫ్ చేసినట్లయితే పెట్రోలు సేవ్ అవుతుంది. ఇక అవసరమైనప్పుడు మాత్రమే క్లచ్ ఉపయోగిస్తూ ఉండాలి. దీనివల్ల కూడా మైలేజీ పెరుగుతూ ఉంటుంది. జారుడు రోడ్డు వంటివి ఉన్నప్పుడు కూడా వాహనాన్ని ఆఫ్ చేసి నడిపిస్తే పెట్రోల్ బాగా సేవ్ అవుతుంది. మైలేజీ తక్కువగా ఇచ్చే వాహనాలకు ఈ చిన్న చిన్న టిప్స్ బాగా సహాయపడతాయి.
Also Read: ఈ ఫోటోలో ఓ ప్రమాదకర పాము ఉంది.. ఎక్కడో కనుక్కోండి చూద్దాం!