Ap Cinema Tickets: ఏపీలో టికెట్ ధరల వ్యవహారం రోజురోజుకూ హాట్‌టాపిక్‌గా మారిపోతోంది. టికెట్ ధరలు తగ్గిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై డిస్ట్రిబ్యూటర్లు, ప్రొడ్యూసర్లతో సహా పలువురు సినీ ప్రముఖులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎంత నచ్చచెప్పి చూసినా జగన్ సర్కారు వినకపోయే సరికి.. పలు థియేటర్లు నష్టాల్లో కూరుకుపోవడంతో.. సినిమాను ప్రదర్శించలేక స్వచ్ఛందంగా థియేటర్లను మూసేందుకు ముందుకొచ్చారు. మరోవైపు రెవెన్యూ అధికారులు సినిమా థియేటర్లను తనిఖీలు చేస్తూ.. ప్రభుత్వ నిబంధనలు పాటిస్తున్నారో లేదో అని పరిశీలిస్తున్నారు.
Also Read: టికెట్ ధరల తగ్గింపు తట్టుకోలేక థియేటర్లకు తాళాలు..
తాజాగా, చిత్తూరులో 17 థియేటర్లపై తనిఖీలు నిర్వహించి మూసేసినట్లు సమాచారం. మదనపల్లి, కుప్పం, పలమనేరు పుంగనూరుల్లో కూడా నిన్నటి నుంచే షోలు ఆపేశారు. జిల్లాలో మొత్తం 70 థియేటర్లకు లైసెన్సులు పునరుద్ధరం కాలేదని అధికారులు గుర్తించి వాటిని మూసేయాలని అధికారులు జారీ చేసినట్లు తెలుస్తోంది.
కాగా, మదనపల్లిలో 7, కుప్పంలో 4, వి కోట 3, బి.కొత్తకోట 2, పీలేరు 4, పుంగనూరు 4, పలమనేరు 4, రొంపిచర్ల 2, కలికిరి 2, సదుం మొలకల చెరువు, గుర్రంకొండ, కలకడ, తంబల్ల పల్లిలలో థియేటర్లకు నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలోనే జిల్లా కలెక్టర్ రాజా బాబు థియేటర్ల ఓనర్లు, ఎగ్జిబిటర్లతో సమావేశమై రెన్యూవల్ లేకుండా షోలకు అనుమతి ఇచ్చే ప్రశక్తే లేదని తేల్చి చెప్పేశారు. అయితే, సోమవారం వరకు ఎగ్జిబిటర్లు తమకు అనుమతి కావాలని కోరినట్లు తెలుస్తోంది. మరి పరిస్థితి ఇలాగే ఉంటే థియేటర్లు మూసేయాల్సిందేనా అనేది డిస్ట్రిబ్యూటర్లలో మెదులుతున్న ప్రశ్న.
Also Read: సమంత పాటపై శ్రీ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..