Homeఆంధ్రప్రదేశ్‌CM Jagan – CM KCR: వచ్చే ఎన్నికల్లో కేసీఆర్, జగన్‌కు ఎదురీత తప్పదా..?

CM Jagan – CM KCR: వచ్చే ఎన్నికల్లో కేసీఆర్, జగన్‌కు ఎదురీత తప్పదా..?

CM Jagan – CM KCR: రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమకు తాము అద్భుతంగా పాలన సాగిస్తు్న్నామని అనుకుంటున్నారు. తమ పాలన ప్రజలు సుఖశాంతులతో ఉన్నారని, వారికి ఎలాంటి ఇబ్బందులు లేవని అటు జగన్, ఇటు కేసీఆర్ అనుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇరు పార్టీల నేతలు క్షేత్రస్థాయిలో ప్రజలు ఏమనుకుంటున్నారనే విషయాలను దాచి ప్రజలు మనం చేస్తున్న సంక్షేమ పథకాలు, విధానాల పట్ల సంతోషంగా ఉన్నారంటూ ఫీడ్ బ్యాక్ ఇస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో అధికార పార్టీ అధినేతలకు అసలు గ్రౌండ్ లెవల్లో ఏం జరుగుతుందో తెలియడం లేదు. ఫలితంగా వారు తమ పాలనా విధానాలను మార్చుకోకుండా మూస ధోరణిలో ముందుకు సాగుతున్నట్టు రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. నిజానికి వీరి పాలనలో అవినీతి రాజ్యమేలుతోందని ప్రజలు కుండబద్దలు గొడుతున్నారు.

CM Jagan – CM KCR
CM Jagan – CM KCR

అవినీతికి కేరాఫ్‌గా తెలుగు రాష్ట్రాలు..

అవినీతి రహిత పాలనను అందిస్తున్నామని పదే పదే చెప్పుకునే ముఖ్యమంత్రులకు తెలుగు రాష్ట్రాల్లో జరిగే అవినీతి గురించి నిజంగా తెలీదా? లేక కావాలనే జనాలను మభ్య పెడుతున్నారా? అని కొందరు ప్రశ్నిస్తున్నారు. తాజాగా యూత్‌ ఫర్‌ యాంటీ కరప్షన్‌ (YAP) నిర్వహించిన ఓ సర్వేలో అవినీతి బండారం బట్టబయలైంది. ఏపీలోని 7 జిల్లాలు, తెలంగాణలోని 30 జిల్లాల్లో నిర్వహించిన స‌ర్వేలో అవినీతిపై ప్రజలు నోరు విప్పారు. తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 21,523 మంది అభిప్రాయాలను సేకరించగా వారు ఉన్నది ఉన్నట్టు వెల్లడించారట.. ఈ సర్వేలో ముఖ్యంగా ప్రభుత్వ సర్వీసులు, ప్రభుత్వ విధానాలు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రశ్నలు అడిగినట్టు తెలుస్తోంది.

Also Read: జగన్ , కేసీఆర్ లకు గొప్ప ఇబ్బందే వచ్చిందే?

90 శాతం అవినీతా..

యూత్‌ ఫర్‌ యాంటీ కరప్షన్‌ నిర్వహించిన సర్వేలో తెలుగు ప్రజలు షాక్ అయ్యే సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. తమను అడిగిన ప్రశ్నలపై ప్రజలు నిర్మోహమాటంగా సమాధానం చెప్పారట.. ప్రభుత్వ శాఖల్లో నేడు 90 శాతం అవినీతి జరుగుతోందని కుండబద్దలు గొట్టారు. డబ్బులు ఇవ్వనిదే ఏ అధికారి పనిచేయడం లేదని, ఏదైనా పని కోసం ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లితే 89 శాతం మంది అధికారులు సరిగా స్పందించడం లేదని తెలిపారు. ఇకపోతే రెండు తెలుగు రాష్ట్రాల్లో రెవెన్యూ ఆఫీసుల్లో 85 శాతం అవినీతి ఉందని తేలింది. రిజిస్ట్రేషన్‌, మున్సిపాలిటీ, పోలీస్ డిపార్టుమెంటు కూడా అవినీతికి అతీతం కాదని ప్రజలు తేల్చిచెప్పారట..

రెండు రాష్ట్రాలకు చెందిన పొలిటికల్ లీడర్స్‌లో 80 శాతం మంది అవినీతి పరులేనని ప్రజలు స్పష్టం చేశారు. వీరందరికీ శిక్ష పడితేనే మిగతా అవినీతి పరుల్లో కూడా భయం ఉంటుంది. ప్రజా ప్రతినిధులకు శిక్షలు విధించి ప్రభుత్వాలు నిలబడుతాయా? అంటే కష్టమే. వచ్చే ఎన్నికల్లో గెలవాలంటే ఇప్పుడు అక్రమంగా సంపాదించిన డబ్బే కావాలి. వీరిపై చర్యలు తీసుకుంటే అధికార పార్టీలకు ఎన్నికల్లో ఖర్చు చేసేందుకు ఫండ్స్ రావు. అయితే, కేసీఆర్, జగన్ ప్రభుత్వాల్లో జరుగుతున్న అవినీతిపై ప్రజలు ఆగ్రహంగా ఉన్నారట..ప్రతీ పనికి రేటు కడితే ఇక ఈ ప్రభుత్వాలు మాకేందుకు అన్న ఫీలింగ్‌లో ప్రజలు ఉన్నట్టు తెలుస్తోంది. రానున్న రెండేళ్లు ఇలానే పాలన సాగితే కేసీఆర్, జగన్‌కు ఎదురీత తప్పదని అనుకుంటున్నారు విశ్లేషకులు..

Also Read: జనసేన కోసం టీడీపీ నేతల సీట్లు మారుస్తున్న చంద్రబాబు?

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
Exit mobile version