Solar Plant: మనలో చాలామంది ఇంటి పైకప్పుపై సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసుకోవాలని భావిస్తున్నారు. అయితే సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు సంబంధించి సరైన అవగాహన లేకపోవడం వల్ల సోలార్ ప్లాంట్ ఏర్పాటు విషయంలో ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అయితే కేంద్ర ప్రభుత్వం రూఫ్‌టాప్ సోలార్ ప్రోగ్రామ్ ద్వారా సోలార్ ప్లాంట్ ను ఏర్పాటు చేసుకోవడానికి అనుమతులను ఇవ్వడం గమనార్హం. కేంద్రం ఇందుకోసం జాతీయ పోర్టల్ ను ఏర్పాటు చేసింది.
దరఖాస్తుకు ఆమోదం వచ్చిన తర్వాత నచ్చిన విక్రేత నుంచి దానిని ఇన్ స్టాల్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఈ జాతీయ పోర్టల్ లో విక్రేతల జాబితా ఎల్లవేళలా అందుబాటులో ఉంటుందని సమాచారం. సర్టిఫైడ్ ఇన్వర్టర్ల కింద సోలార్ ప్లాంట్ కొరకు నమోదు చేసుకోవాల్సి ఉంటుందని తెలుస్తోంది. లబ్ధిదారుడు సోలార్ పాంట్ ఏర్పాటు తర్వాత కొన్ని రూల్స్ ను ఫాలో కావాలి.
లబ్ధిదారుడు ప్లాంట్ ను నిర్ణీత వ్యవధిలో ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. అలా చేయకపోతే దరఖాస్తు రద్దయ్యే అవకాశం ఉంటుంది. లబ్ధిదారుడు నిబంధనలను తప్పనిసరిగా కచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. https://solarrooftop.gov.in/ వెబ్ సైట్ ద్వారా పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం ఉంటుంది.