https://oktelugu.com/

Karthika Deepam: కార్తీక్ కోసం పయనమైన మోనిత.. డాక్టర్ అంజలి ఇంటికి వంటలక్క.. ట్విస్ట్ మామూలుగా లేదుగా!

Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ లో ఈ రోజు ఏం జరిగిందంటే.. కార్తీక్ సౌర్య కు ఆపరేషన్ చేస్తూ ఉంటాడు. మరోవైపు దీప డాక్టర్ బాబు ఎక్కడికి వెళ్ళాడు అని బాధపడుతుంది. ఇక ఆపరేషన్ పూర్తవడంతో డాక్టర్ అంజలి కార్తీక్ కు థాంక్స్ అని చెబుతుంది. కార్తీక్ బయటికి రావడంతో దీప కార్తీక్ కళ్ళను చూసి గుర్తు పడుతుంది. చేతులెత్తి దండం పెడుతుండగా కార్తీక్ వద్దని సైగల్ చేస్తాడు. మరోవైపు మోనిత దగ్గరకు డాక్టర్ […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : February 4, 2022 / 05:18 PM IST
    Follow us on

    Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ లో ఈ రోజు ఏం జరిగిందంటే.. కార్తీక్ సౌర్య కు ఆపరేషన్ చేస్తూ ఉంటాడు. మరోవైపు దీప డాక్టర్ బాబు ఎక్కడికి వెళ్ళాడు అని బాధపడుతుంది. ఇక ఆపరేషన్ పూర్తవడంతో డాక్టర్ అంజలి కార్తీక్ కు థాంక్స్ అని చెబుతుంది. కార్తీక్ బయటికి రావడంతో దీప కార్తీక్ కళ్ళను చూసి గుర్తు పడుతుంది. చేతులెత్తి దండం పెడుతుండగా కార్తీక్ వద్దని సైగల్ చేస్తాడు.

    మరోవైపు మోనిత దగ్గరకు డాక్టర్ భారతి వచ్చి ఇవాళ రాత్రి మనం బయలుదేరాలి అంటుంది. ఇక హాస్పిటల్లో దీప.. సౌర్య దగ్గరికి వెళ్లి మాట్లాడుతుంది. నీకేం కాదమ్మా అంత తగ్గిందని అంటుంది. సౌర్య.. అసలు నాకు ఏం జరిగింది అమ్మ అనటంతో.. కడుపు నొప్పి అని అబద్ధం చెప్తుంది. కానీ నాకు గుండె దగ్గర నొప్పి వస్తుంది కదా అనటంతో దీప ఏమి చెప్పలేకపోతుంది. ఇక తాతను, నానమ్మని చూడాలనిపిస్తుంది అని అంటుంది.

    మరోవైపు మోనిత, డాక్టర్ భారతి కారులో పార్టీకి బయలుదేరుతారు. ఇక హాస్పిటల్ లో డాక్టర్ అంజలి.. డాక్టర్ కార్తీక్ గురించి గొప్పగా చెబుతుంది. ఇక దీప ఫీజు గురించి అడగడంతో అంజలి తనకు ఫీజు వద్దని తన గొప్ప మనసును చాటి చూపుతుంది. దానికి కార్తీక్, దీప తనకు థాంక్స్ చెబుకుంటారు. దీప వంటలు బాగా చేస్తుందని అప్పారావు అనటంతో.. అంజలి తనను తన ఇంట్లో వంటలు చేయమని అంటుంది.

    దానికి దీప కూడా ఒప్పుకుంటుంది. ఇక కార్తీక్ కూడా దీప కు సహాయంగా వస్తానని.. అలా అయినా మీ రుణం తీరుతుందని అంటాడు. ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలవుతుంది. మోనిత, భారతి అంజలి వాళ్ళ ఇంట్లో పార్టీకే వస్తున్నారు. ఇక అక్కడ దీప వంటలు చేయడానికి వెళుతుంది. ఈ క్రమంలో అక్కడ మోనితకు దీప, కార్తీక్ ఎదురవడం.. అక్కడి నుంచి కథ మలుపు తిరగడం ఖాయమని తెలుస్తోంది.