Jagan vs AP Employees: ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యోగులు నిర్వహించిన ‘చలో విజయవాడ’ సక్సెస్ అయిన సంగతి తెలిసిందే. ఈ విషయం అధికార వైసీపీకి ఇబ్బందికరంగా మారింది. ఉద్యోగులు పీఆర్సీ విషయంలో ఈ నేపథ్యంలోనే ఇంకా గట్టిగా పోరాడాలని డిసైడ్ అయ్యారు. అయితే, ఏపీ ప్రభుత్వం ఉద్యోగుల విషయమై నింపాదిగా ఉందనే వార్తలొస్తున్నాయి. కానీ, ప్రభుత్వం ఉద్యమాన్ని చీల్చేందుకుగాను తన వంతు ప్రయత్నాలు స్టార్ట్ చేసిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఉద్యోగులు సమ్మెకు వెళ్లకుండా ఉండేందుకుగాను అన్ని రకాల ప్రయత్నాలు స్టార్ట్ చేస్తోందట. ఈ నెల 6 అర్ధరాత్రి నుంచి సమ్మెకు వెళ్లాలని పీఆర్సీ సాధన సమితి డిసైడ్ చేసింది.
ఈ క్రమంలోనే ఈ నెల 6వ తేదీ కంటే ముందరే ఉద్యోగులను సమ్మెకు వెళ్లకుండా ఆపేందుకుగాను సర్కారు సర్వ ప్రయత్నాలు చేస్తోందని సమాచారం. ఈ క్రమంలోనే ‘చలో విజయవాడ’ సక్సెస్ కావడానికి ప్రధాన కారణమైన ఉపాధ్యాయులను తొలుత చల్లబరచాలని భావిస్తోందట. ఉపాధ్యాయులు భారీ సంఖ్యలతో తరలివచ్చినందు వల్లే చలో విజయవాడ ఊహించని విధంగా సక్సెస్ అయిందని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తున్న ఉపాధ్యాయలను చీల్చేందుకుగాను జగన్ సర్కారు వ్యూహాత్మక ఎత్తుగడ వేయబోతుందట.
ఎస్ జీటీలకు ప్రమోషన్స్ ఆశ చూపించి వారిని ఉద్యమంలో నుంచి బయటకు వచ్చేలా చేస్తుందన్న వార్తలు వస్తున్నాయి. ఇప్పటి వరకు 19 పాఠశాలల మ్యాపింగ్ పూర్తయిందని, త్వరలో 22 వేల మందికి పైగా టీచర్లకు ఎస్జీటీల నుంచి స్కూల్ అసిస్టెంట్లుగా ప్రమోషన్ కల్పించనున్నట్లు ఈ నేపథ్యంలోనే న్యూస్ వస్తోంది. అలా మొత్తంగా ఉద్యోగుల ఉద్యమం మరీ తీవ్రతరం కాకమునుపే సద్దుమణిగేలా చేయాలని భావిస్తోందట సర్కారు.
Also Read: చలో విజయవాడ సక్సస్.. ప్రభుత్వం వెనక్కి తగ్గాల్సిందేనా?
ఏపీ ప్రభుత్వం ప్రమోషన్స్ ఎర వేసినంత మాత్రాన ఉపాధ్యాయులు ఉద్యమం నుంచి బయటికి వస్తారా? అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా ఉంది. వాళ్లు బయటకు రావడం అనుమానమేనని ఈ సందర్భంగా మరి కొందరు అయితే అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వం ఆశ చూపితే అందుకు లొంగిపోతారా? అని అనుకుంటున్నారు. ఉపాధ్యాయులు ఇతర ఉద్యోగుల సమస్యలు, డిమాండ్లను అలాగే వదిలేసి తమ కోసం తాముగా ఉద్యమాన్ని వదిలి వెళ్లబోరని ఈ సందర్భంగా మరి కొందరు అభిప్రాయపడుతున్నారు. సమ్మెను అడ్డుకోవడానికి ప్రభుత్వ ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయనేది తెలియాలంటే ఇంకొంత కాలం వెయిట్ చేయాల్సిందే.97
Also Read: సొంత పార్టీలోనే అసమ్మతి కుంపట్లు ఎదుర్కొంటున్న జగన్