Legal cases on comments: నోరు మంచిదైతే ఊరుమంచిది అవుతుంది అని పెద్దలు చెబుతూ ఉంటారు. కానీ వారు చెప్పే మాటను ఎవరు పెద్దగా పట్టించుకోరు. అయితే ఒక్కోసారి నోరు ఉంది కదా అని ఎలా పడితే అలా మాట్లాడితే ఎన్నో సమస్యల్లో ఇరుక్కోవాల్సి వస్తుంది. కేవలం సమస్యలు మాత్రమే కాకుండా కేసులు కూడా నమోదయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత జైలుకు కూడా వెళ్లే అవకాశం ఉంటుంది. అందువల్ల ఎలా పడితే అలా మాట్లాడకూడదు. అయితే ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎలాంటి కేసులు ఎదుర్కోవాల్సి వస్తుందో తెలుసా?
భారత రాజ్యాంగం ఆర్టికల్ 19 ప్రకారం ప్రతి ఒక్కరికి మాట్లాడి స్వేచ్ఛ హక్కు ఉంది. వారు ఇతరులతో అనేక విషయాలను మాట్లాడుకోవచ్చు. అయితే ఇదే సమయంలో కొన్ని మాటలు మాట్లాడటం ద్వారా వారిపై కేసులు నమోదయ్య అవకాశం ఉంటుంది. వీటిలో..
నిందించడం:
కొందరు తమ గురించి కంటే ఇతరుల గురించి ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. ముఖ్యంగా వారిపై నెగటివ్ వ్యాఖ్యలు చేస్తూ రాక్షసానందం చేస్తారు. ఎదుటివారు చెడ్డవారు అని చెబుతూ ఉంటారు. ఇలా వారిని అగౌరపరిచేలా మాట్లాడుతూ.. వారిని నిందించడం వల్ల భారతీయ రాజ్యాంగం ప్రకారం ఐపిసి సెక్షన్ 49 ప్రకారం కేసు నమోదు చేయవచ్చు. ఇలా కేసు నమోదు అయితే రెండు సంవత్సరాల జైలు శిక్ష లేదా జరిమానా రెండు పడవచ్చు. ఇతరుల గురించి మాట్లాడడం మాత్రమే కాకుండా వారి గురించి తప్పుగా లేఖలు రాయడం లేదా పుస్తకాలు రచించడం లేదా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా కూడా ఐపిసి సెక్షన్ 501, 502 ప్రకారం కేసులు నమోదు అవుతాయి.
బెదిరించడం:
ఒక వ్యక్తిని బెదిరించడం లేదా భయభ్రాంతులకు గురి చేయడం వల్ల భారతీయ శిక్షా స్మృతి ప్రకారం నేరమే అవుతుంది. ఇలాంటి వారిపై ఐపిసి సెక్షన్503 ప్రకారం కేసు నమోదు చేయవచ్చు. అలాగే ఐపిసి సెక్షన్ 506, 507 ప్రకారం కూడా కేసులు నమోదవుతాయి. ఒక వ్యక్తిని నేరుగా బెదిరించడం లేదా లేక ద్వారా, సోషల్ మీడియా ద్వారా బెదిరించినా.. ఏడు సంవత్సరాల వరకు జైలు శిక్ష.. జరిమానా రెండు ఉంటాయి.
అసభ్యకర వ్యాఖ్యలు:
ఎదుటి వ్యక్తిని అసభ్యకరంగా మాట్లాడడం.. లేదా వినకూడని పదజాలం వాడడం వల్ల భారత రాజ్యాంగం ప్రకారం ఐ.పి.సి సెక్షన్ 294, 499,500, ప్రకారంగా కేసులు నమోదు అయ్యే అవకాశం ఉంటుంది. ఇలాంటివారు ఒక వ్యక్తిని అసభ్య పదజాలంతో మాట్లాడిన లేదా పాటలు పాడిన కూడా కేసు నమోదు చేసే అవకాశం ఉంటుంది. వీరికి రెండు సంవత్సరాల వరకు జైలు శిక్ష లేదా జరిమానా రెండు ఉంటాయి. అలాగే మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలు చేస్తే ఐపిసి సెక్షన్ 354 A ప్రకారంగా కేసులు నమోదు చేసే అవకాశం ఉంటుంది. ఇలాంటి వారికి ఒక సంవత్సరం నుంచి మూడు సంవత్సరాల వరకు జైలు శిక్షతో పాటు జరిమానా ఉంటుంది.