ఈ నెలలో, వచ్చే నెలలో ఎక్కువ సంఖ్యలో పెళ్లి మూహూర్తాలు ఉన్నాయనే సంగతి తెలిసిందే. మన దేశ సాంప్రదాయం ప్రకారం పెళ్లి తర్వాత అమ్మాయి అబ్బాయి ఇంటికి వెళుతుంది. ఇల్లరికం రావడానికి అబ్బాయిలు అస్సలు ఇష్టపడరనే సంగతి తెలిసిందే. కొంతమంది ఇల్లరికం రావడాన్ని అవమానంగా ఫీలవుతారు. అయితే రాజస్థాన్ రాష్ట్రంలోని ఒక గ్రామంలో మాత్రం భిన్నంగా జరుగుతుంది.
ఈ గ్రామంలో మొత్తం 240 కుటుంబాలు నివశిస్తున్నాయి. కొన్ని వందల సంవత్సరాల క్రితం గ్రామంలో ఆడపిల్లలు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. ఆ సమయంలో ఈ గ్రామంలోని ఆడపిల్లలను పెళ్లి చేసుకున్న యువకులు గ్రామంలోనే స్థిరపడ్డారు. ఇల్లరికం వచ్చిన అల్లుళ్లు వేర్వేరు పనులు చేయడం ద్వారా తమ కుటుంబాలను పోషించుకుంటూ వచ్చారు. ఆ తర్వాత గ్రామంలో ఇదే సాంప్రదాయం కొనసాగుతూ వచ్చింది.
ఈ వింత సాంప్రదాయం వల్ల ఈ గ్రామం పేరు తెగ వైరల్ అవుతుండటం గమనార్హం. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కౌశాంబి హింగుల్‌పూర్ అనే గ్రామంలో కూడా ఈ తరహా సాంప్రదాయం అమలులో ఉంది. ఈ గ్రామంలో అల్లుడికి అత్తింటి వారు ఉపాధి మార్గాలను చూపించడం జరుగుతుంది.