Ladki Movie: రామ్ గోపాల్ వర్మ ఏది చేసిన సెన్సేషన్ అని చెప్పొచ్చు. తనదైన శైలిలో విభిన్న చిత్రాలను తెరకెక్కించడం లో ఆర్జీవి కి సాటిలేరని చెప్పాలి. ఆయన తాజాగా పూజా భలేకర్ హీరోయిన్ గా “లడ్ కి” అనే సినిమా తెరకెక్కించారు. ఈ సినిమాని ఆర్ట్ సి మీడియా, బిగ్ పీపుల్ సంస్థలు కలిసి సంయుక్తంగా నిర్మించాయి. ఈ సినిమా ట్రైలర్ ను నిన్ననే వర్మ రిలీజ్ చేశారు. మార్షల్ ఆర్ట్స్ హీరో బ్రూస్ లీ స్ఫూర్తితో ఫైటర్ గా మారిన ఓ యువతి జీవితంలో జరిగే సంఘటనలతో ఈ సినిమాని తెరకెక్కించామని ఆర్జీవి చెబుతున్నారు. ఈ సినిమాలో యాక్షన్ తో పాటు అందాల ఆరబోత కూడా గట్టిగానే ఉన్నట్లు తెలుస్తుంది. అయితే తాజాగా ఈ సినిమాను చైనాలో జరిగే ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శించబోతున్నారు అని ఆర్జివి వెల్లడించారు. ఇండో – చైనీస్ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘లడకీ’ సినిమాని డిసెంబర్ 10వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

తెలుగు, తమిళం, హిందీతో పాటు చైనీస్ భాషలో కూడా ఈ మూవీ రిలీజ్ అవుతుంది. చైనాలో ఈ సినిమా ‘డ్రాగన్ గర్ల్’ అనే పేరుతో రిలీజ్ అవ్వనుంది. ఈ చిత్రాన్ని చైనా ఫిలిం గ్రూప్ కార్పొరేషన్ అనే డిస్ట్రిబ్యూషన్ సంస్థ అక్కడ 20 వేల థియేటర్స్ లో భారీగా విడుదల చేయబోతోందని వర్మ తెలిపారు. అంతే కాక బ్రూస్ లీ 81వ జయంతి సందర్భంగా దుబాయ్ లోని బుర్జ్ ఖలీఫాలో నవంబర్ 27న ‘లడకీ’ సినిమా స్పెషల్ పోస్టర్ ను విడుదల చేయబోతున్నారన్నారు. అలాగే చైనా లోని ఫోషన్ కుంగ్ ఫు ఫిలిం ఫెస్టివల్ లో బ్రూస్ లీ జయంతి సందర్భంగా ఈ సినిమా స్పెషల్ ప్రీమియర్ కి సెలెక్ట్ అయినట్లు చెబుతూ హర్షం వ్యక్తం చేశారు.