Viral Photo: మనలో చాలా మంది తమకు తాము జీనియస్ అని తెగ బిల్డప్ ఇస్తుంటారు. అయితే పరీక్ష ఎదురైనప్పుడు సవాల్‌ను స్వీకరించి ఫలితం రాబట్టినప్పుడు వాళ్లలోని టాలెంట్ బయటకు వస్తుంది. తెలివిగలవాళ్లకు బుర్ర పదును పెట్టాలంటే పజిల్స్ మంచి ఛాయిస్. చాలా మంది దినపత్రికలలో, వీకెండ్ బుక్స్‌లో వచ్చే పదాల పజిల్స్‌ను ఈజీగా పరిష్కరిస్తుంటారు.

కొందరు సమయం తీసుకుని పదాల పట్టికను పూరిస్తారు. అయితే ఫొటో పజిల్స్ కూడా వారి బుర్రకు పదనుపెడతాయి. ఎందుకంటే ఫోటో పజిల్స్ విజ్ఞానంతో పాటు వినోదాన్ని కూడా అందిస్తాయి. ఫోటోల్లో పైకి ఒకటి కనిపిస్తే.. లోపల మరొకటి ఉంటుంది.
Also Read: బిగ్ బ్రేకింగ్: అసెంబ్లీలో 91142 ఉద్యోగాలను ప్రకటించిన కేసీఆర్
మన కళ్ళను పూర్తిగా మభ్యపెడుతుంటాయి. అందుకే ఫోటో పజిల్స్ సాల్వ్ చేయాలంటే ముఖ్యంగా కళ్లు పాదరసంలా పనిచేయాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే ఫోటో పజిల్స్‌ను ఈజీగా పరిష్కరించగలుగుతారు. ఈ కోవకు చెందిన ఓ ఫోటో పజిల్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఈ ఫోటో నిండా రాళ్లు గుట్టగా పోసి ఉన్నాయి. ఈ రాళ్లలో ఓ పాము దాగుంది. అదెక్కడుందో మీరు కనిపెట్టాలి. మొత్తం రాళ్లతో నిండిన ఈ ప్రదేశంలో విషసర్పం జరజరా పాక్కుంటూ వెళుతోంది. మీరు కళ్లకు కొంచెం పని చెప్తే ఆ పామును తేలికగా కనిపెట్టేస్తారు. మరి ఇంకా ఆలస్యం ఎందుకు? మీరు కూడా ఫోటో పజిల్‌పై ఓ లుక్కేయండి. ఒకవేళ సమాధానం దొరక్కపోతే కింద ఫోటోను పరిశీలించండి.
Also Read: బీజేపీతో పొత్తుకు చంద్రబాబు సిద్ధంగా లేరా?
Recommended Videos



