Prabhas Salaar Movie: నాతో పాటు పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా ఉన్నాడు – ప్రభాస్

Prabhas Salaar Movie: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ‘రాధే శ్యామ్’ మూవీ ప్రమోషన్స్‌లో చాలా బిజీగా ఉన్నాడు. అయితే తాజాగా ఓ ప్రెస్ మీట్‌లో ప్రభాస్.. తన తరువాతి చిత్రం సలార్ నుండి ఓ క్రేజీ అప్డేట్ ఇచ్చాడు. ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ ఉండబోతున్నాడన్న విషయాన్ని బయటపెట్టాడు ప్రభాస్. ఇక ‘కేజీఎఫ్’ చిత్రంతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న పాన్ ఇండియా డైరెక్టర్ ‘ప్ర‌శాంత్ నీల్’ దర్శకత్వంలో ఈ సినిమా రాబోతుంది. కాగా ఈ […]

Written By: Raghava Rao Gara, Updated On : March 9, 2022 11:43 am

Prabhas Salaar Movie

Follow us on

Prabhas Salaar Movie: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ‘రాధే శ్యామ్’ మూవీ ప్రమోషన్స్‌లో చాలా బిజీగా ఉన్నాడు. అయితే తాజాగా ఓ ప్రెస్ మీట్‌లో ప్రభాస్.. తన తరువాతి చిత్రం సలార్ నుండి ఓ క్రేజీ అప్డేట్ ఇచ్చాడు. ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ ఉండబోతున్నాడన్న విషయాన్ని బయటపెట్టాడు ప్రభాస్. ఇక ‘కేజీఎఫ్’ చిత్రంతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న పాన్ ఇండియా డైరెక్టర్ ‘ప్ర‌శాంత్ నీల్’ దర్శకత్వంలో ఈ సినిమా రాబోతుంది.

Prabhas Salaar

కాగా ఈ పాన్ ఇండియా సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమా నుంచి మరో ఇంట్రెస్టింగ్ అప్ డేట్ తెలుస్తోంది. ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ ఉందని.. ఆ సాంగ్ లో బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ అలియా భట్ నటించబోతుందని తెలుస్తోంది. కాగా వచ్చే షెడ్యూల్ లో ఈ సినిమా సాంగ్ షూటింగ్ శరవేగంగా జరగనుంది.

Also Read:   తెలుగులోకి డబ్ అయినా రీమేక్ అయిన 10 సినిమాలు ఇవే..

అందుకే, ప్రస్తుతం సలార్ షూటింగ్ ను తిరిగి స్టార్ట్ చేశాడు. అన్నట్టు మూడు వారాల పాటు ఈ ‘సలార్’ కొత్త షెడ్యూల్ జరగనుంది. ఇక ఈ షెడ్యూల్ అంతా విలన్ డెన్ లో జరుగుతుందని తెలుస్తోంది. ఈ సాంగ్ తర్వాత విలన్ సీన్స్ ను షూట్ చేయనున్నారు. ఈ సీన్స్ కోసం ఈ సినిమా ఆర్ట్ డిపార్ట్మెంట్ భారీ సెట్ ను కూడా నిర్మించింది. ఈ సెట్ లోనే కీలకమైన యాక్షన్ సీన్స్ ను షూట్ చేయనున్నారు.

Prabhas Salaar Movie

 

ఈ సెట్ ప్రభాస్ తో పాటు శృతి హాసన్ కూడా పాల్గొనబోతుంది. అందుకే ఈ సెట్ ను పలు విధాలుగా చెక్ చేసి అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ఏది ఏమైనా ప్రభాస్ తో హై వోల్టేజ్ యాక్షన్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఈ సినిమా చేస్తున్నాడు అనగానే.. ‘సలార్’ పై పాన్ ఇండియా రేంజ్ లో భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఇప్పుడు జరుగుతున్న షెడ్యూల్ పూర్తి అయ్యాక, సింగరేణి ఓపెన్‌ కాస్ట్ ప్రాంతంలో తర్వాత షెడ్యూల్ షూటింగ్ జరగనుంది.

Also Read: పవన్ మేనియా.. లేడీ పోలీసుల కోసం ‘భీమ్లా నాయక్’ స్పెషల్ షో..

Tags