Meaning Of Dreams: సాధారణంగా ప్రతి ఒక్క మనిషికి కలలు రావడం సర్వసాధారణం. అయితే కొన్నిసార్లు శుభానికి సంకేతంగా కలలు వస్తే మరికొన్నిసార్లు అశుభానికి సంకేతంగా కలలు వస్తుంటాయి.
ఇలా అశుభానికి సంకేతంగా కొన్ని కలలు రావడం వల్ల చాలామంది వాటిని పదే పదే తలుచుకుంటూ మదన పడుతూ ఉంటారు. అలాగే కొన్ని వస్తువులు కలలో కనిపించడం వల్ల మన జీవితంలో ఏ పని మొదలు పెట్టినా తిరుగుండదని అన్ని విజయాలు కలుగుతాయని భావిస్తారు. మరి ఆ వస్తువులు ఏమిటి అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం…
తేనే: మనం నిద్రపోతున్నప్పుడు కలలో తేనె లేదా పాలు కనిపిస్తే శుభానికి సంకేతం అని చెబుతారు. ఈ విధమైనటువంటి వస్తువులు కలలో కనిపించడం వల్ల మనం చేసే పనిలో విజయం కలుగుతుందని భావిస్తారు. అలాగే ఎక్కువ మొత్తంలో పాలు కనిపించడం వల్ల మన ఇంట్లో సిరి సంపదలు పెరుగుతాయని చెబుతారు.
Also Read: స్మార్ట్ ఫోన్ యూజర్లకు హెచ్చరిక…ఈ యాప్స్ ఉంటే వెంటనే డిలీట్ చేయండి!
ధాన్యాలు: భూమి నుంచి ఉద్భవించే సంపదలో పంటలు ఒకటి. ఈ విధమైనటువంటి ధాన్యాలు కలలో కనిపిస్తే మనకు అదృష్టం కలిసివస్తుందని సంకేతం.
పసుపు మరియు కుంకుమ: పసుపు కుంకుమ కలలో కనిపిస్తే తమ సౌభాగ్యం పదికాలాలపాటు చల్లగా ఉంటుంది అని అర్థం. అదేవిధంగా పసుపు బంగారాన్ని సూచిస్తుంది కనుక మీ ఇంట్లో సిరి సంపదలు వృద్ధి చెందుతాయని అర్థం. ఇలాంటి వస్తువులు కనుక కలలో కనిపిస్తే తప్పకుండా మీరు మీ జీవితంలో చేసే పనులలో విజయం సాధించడానికి సంకేతమని చెప్పవచ్చు.
Also Read: ఐటీ సంస్థల్లో ఇక నుంచి హైబ్రిడ్ విధానమేనా?
ఇవి కూడా చదవండి
1. టాలీవుడ్ మ్యూజికల్ హిట్స్
2. సినిమా టికెట్ల తగ్గింపు వివాదం: ప్రశ్నించిన హీరో నానిని టార్గెట్ చేసి వైసీపీ.. తప్పెవరిది?
3. ఈ ఏడాది దేశంలో జరిగిన అతిపెద్ద ఘటనలివీ
4. సోషల్ మీడియా లో వైరల్ గా మారిన “రాధే శ్యామ్” ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫోటోలు…