Family Man: సినిమాలు కంటే ఇప్పుడు వెబ్ సిరీస్ లను జనం బాగా ఆదరిస్తున్నారు. తెలియకుండానే ఓటీటీ అనేది ఒక విప్లవంలా మారింది. ప్రతి ప్రేక్షకుడి ఫోన్ లోకి, ఇంటిలోకి వెళ్ళిపోయింది ఈ ఓటీటీ. పాశ్చాత్య దేశాల్లో ఈ ఓటీటీ విప్లవం అనేది ఎప్పుడో మొదలైనా.. ఇండియాలో మాత్రం కరోనా కారణంగానే ఎక్కువ అయింది. ఇప్పుడు ప్రపంచంలోనే ఘనమైన ఓటీటీ సంస్థలు ఏవి అనగానే ముందుగా గుర్తుకు వచ్చేవి అమోజాన్, నెట్ ఫ్లిక్ష్ లే.
ఈ రెండు సంస్థలు ఇండియన్ మార్కెట్ పై బాగా దృష్టి పెట్టి.. భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. అయితే ఇండియాలో బాగా క్లిక్ అయిన వెబ్ సిరీస్ మాత్రం ఫ్యామిలీ మ్యాన్. కాగా ఫ్యామిలీ మ్యాన్ 2లో హీరోకి ఒక పెద్ద సమస్య ఎదురు కాగానే “చెల్లం సార్”ని అడగడం, ఆయన చెప్పడం జరుగుతూ ఉంటుంది. “ఇది మరీ తేలిగ్గా తేల్చేయడం కాదా? హీరో సొంతంగా కష్టపడి కనిపెట్టేలా తీసివుంటే బావుండేదా ?” అంటూ ప్రస్తుతం ఒక చర్చ నడుస్తోంది.
అయినా, తేలిక ఏంటి ? ఆల్రెడీ 11 ఎపిసోడ్స్ సూపర్ హిట్ అయ్యాయి. అసలు కాన్సెప్ట్ ఏమిటి ? హీరో ఏజెంట్, క్రైమ్ ఆపాలి. అలాగే అతనికి కావాల్సిన విషయం ఏమిటి ? అసలు ఇదంతా ఎవరు చేస్తున్నారు ?, ఎలా ఆపగలం ? అనే కోణంలో ఈ సిరీస్ సాగుతుంది. మన తెలుగు సినిమాల్లో లాగా అంతా హీరోనే చేస్తే.. ఇక కథ ఎందుకు ? కథనం ఎందుకు ?
Also Read: RRR: ఆర్ఆర్ఆర్ గ్రాండ్ ఈవెంట్కు ముఖ్య అతిథులుగా ఆ ఇద్దరు టాప్ సీనియర్ హీరోలు
అయినా, అంతా హీరోనే చేస్తే.. మనకు ఆ సిరీస్ అంత గొప్పగా నచ్చేదే కాదు. అయినా ఎవరిని అడిగితే ఎక్కడనుండి ఇన్ఫర్మేషన్ వస్తుందో అని తెలుసుకోవడం ఐబీ ఉద్యోగానికి కావాల్సిన సమయ స్ఫూర్తి!. అయినా ఇది కల్పితం, ఆ మాటకొస్తే చిన్న విషయాన్నీ తీసుకొనే పూర్తి హీరోయిక్ గా చూపించాలి. రియల్ టైం లో చేయలేనిది, తెర పై హీరో చేయాలి. అప్పుడే కిక్ ఉంటుంది. అందుకే, ఇక ఫ్యామిలీ మ్యాన్ పై చర్చ అనవసరం.
Also Read: ఈ జుట్టుపోలిగాడు ఎవ్వడండి ? వీడు వీడి ఓవర్ యాక్టింగ్ ?